Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి జబర్ధస్త్ గీత.. ఒక్క స్కిట్‌తో ఫేమస్.. ఆ వీడియోల వల్లే ఛాన్స్
తెలుగు బుల్లితెరపైకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను సొంతం చేసుకుని.. సక్సెస్‌ఫుల్ షోగా మారిపోయింది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు ఇస్తూ.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు సృష్టిస్తూ ప్రేక్షకులను రంజింపే చేస్తోందీ షో. ఫలితంగా అత్యధిక టీఆర్పీ రేటింగ్ కూడా సొంతం అవుతోంది. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్ సీజన్లను, ఒక ఓటీటీ సీజన్‌ను నిర్వహకులు సక్సెస్‌ఫుల్‌గా ప్రసారం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దానిని కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనే ఓ కంటెస్టెంట్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఆరో సీజన్‌కు ఫిక్సైపోయిన డేట్
తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. అందుకే నిర్వహకులు ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సీజన్లను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దానిని మొదలు పెట్టబోతున్నారు. దీన్ని సెప్టెంబర్ 4వ తేదీ నుంచి రాబోతుందని తెలుస్తోంది. ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జునే నడిపించబోతున్నాడు.

కలర్‌ఫుల్‌గా రాబోతున్న సీజన్
బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు వచ్చినా అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అందుకు అనుగుణంగానే త్వరలో రాబోయే ఆరో దానిపై ఇవి తారాస్థాయిలో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ సీజన్ లోగో ప్రోమోను వదిలారు. అలాగే, సీజన్ మెయిన్ ప్రోమోను రిలీజ్ చేశారు. వీటికి భారీ స్పందన కూడా దక్కింది. దీనిబట్టే ఈ సీజన్ ఎంతో కలర్‌ఫుల్‌గా సాగబోతున్నట్లు అర్థం అవుతోంది.

పనులెలా సాగుతున్నాయంటే
సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ పనులు మొత్తం పూర్తైనట్లు బుల్లితెర వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగానే షోను నడిపించే హౌస్ సెట్ వర్కును నిర్వహకులు విజయవంతంగా పూర్తి చేశారట. ఇది గతంలో కంటే ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపించబోతుందని తెలిసింది. అలాగే, ఈ సీజన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ముగిసిపోయిందని టాక్.

15 మంది కంటెస్టెంట్లు ఫైనల్
అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం నిర్వహకులు కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను ఎప్పుడో ప్రారంభించారు. అంతేకాదు, కొద్ది రోజుల క్రితమే ఈ ప్రాసెస్‌ను పూర్తి చేసి షార్ట్ లిస్టును రెడీ చేశారు. ఇలా మొత్తంగా ఈ సీజన్ కోసం 15 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారని తెలిసింది. ఇందులో ఇద్దరు కామనర్స్ కూడా ఉన్నారని సమాచారం.

ఒక్కో పేరు లీక్.. టీమ్ షాక్‌లో
వాస్తవానికి బిగ్ బాస్ షోలో జరిగే తీరు మొత్తం సీక్రెట్‌గా ఉంచుతారు. కానీ, ఇందులోని ప్రతి విషయం బయటకు వస్తూనే ఉంది. దీంతో ఆరో సీజన్ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇలా ఇప్పటికే పలు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో నిర్వహకులు ఏం చేయాలో తెలియక షాక్ అవుతున్నారు.
బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం
https://telugu.filmibeat.com/heroine/actress-shama-sikander-gorgeous-photos-viral-112132.html

బిగ్ బాస్ షోలోకి జబర్ధస్త్ గీత
అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌లో గ్లామరస్ బ్యూటీలను ఎక్కువగా తీసుకు రాబోతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది అమ్మాయిల పేర్లు కూడా బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆరో సీజన్‌లో జబర్ధస్త్ షో వల్ల ఫేమస్ అయిన గీతూ రాయల్ ఈ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని తెలిసింది.

ఆ వీడియోల వల్లే అవకాశం
గీతూ రాయల్ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ షోకు రివ్యూలు చెప్తూ ఎన్నో వీడియోలు చేసింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్‌లోకి వచ్చి పుష్ప స్కిట్ చేసింది. ఒక్క దానితోనే ఆమె ఫేమస్ అయిపోయింది. దీంతో ఎన్నో అవకాశాలను కూడా దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు గీతూ ఏకంగా బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఛాన్స్ పట్టేసిందట.


Click it and Unblock the Notifications











