Geetu Royal: గీతూ రాయల్ కు కలిసొచ్చిన ఎలిమినేషన్!.. పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్?

అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతున్న రియాలిటీ షోలలో ముందుగా చెప్పుకునేది బిగ్ బాస్ రియాలిటీ షోనే. బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎంతోమంది సెలబ్రిటీలు అడుగుపెట్టారు. ఇందులో పార్టిస్ పేట్ చేసినవారు సెలబ్రిటీలుగా మారారు. బిగ్ బాస్ పూర్తి గేమ్ ఆడి టైటిల్ విన్నర్ అయినా, కాకపోయినా.. హౌజ్ లోని వారి పర్ఫామెన్స్, ఆటతీరు, బిహేవియర్ చూసి ఇంప్రెస్ అయినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ల స్కిల్స్ తో అట్రాక్ట్ చేసి షో నుంచి బయటకు వెళ్లాక సినిమా ఆఫర్లు అందుకుంటూ కెరీర్ ను స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ తొమ్మిదో వారంలో చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడు తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం.

రసవత్తరంగా ఆరో సీజన్..

రసవత్తరంగా ఆరో సీజన్..

తెలుగులో అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ముందుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమైన ఈ షో సీజన్ల మీద సీజన్ లు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఐదు టెలివిజన్, ఒక ఓటీటీ (నాన్ స్టాప్) సీజన్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ రసవత్తరంగా సాగిపోతోంది. అయితే సెలబ్రిటీ షో గా ప్రారంభమైన ఈ షోలో సెలబ్రిటీలే ఎంట్రీ ఇచ్చారు.

సెలబ్రిటీలే కాకుండా..

సెలబ్రిటీలే కాకుండా..

తర్వా సీజన్ లు పెరిగినకొద్ది.. సీరియల్ నటినటులు, సోషల్ మీడియా స్టార్స్, రివ్యూవర్స్, యాంకర్స్, జర్నలిస్ట్స్ ఇలా విభిన్న నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే అదివరకే ఫేమ్ ఉన్నవాళ్లు షోలో పార్టిస్ పేట్ చేయగా.. కొంతమంది పాపులారిటీ, ఫేమ్ కోసం బిగ్ బాస్ షోలో గేమ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇందులో పాల్గొన్న అనేకమంది సెలబ్రిటీలుగా మారి సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు.

చిరంజీవి సినిమాలో దివి..

చిరంజీవి సినిమాలో దివి..

బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో పార్టిస్ పేట్ చేసిన దివి వాద్యా త్వరగానే ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి వెళ్లిపోయిన పలు సినీ అవకాశాలు అందుకుంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో ఓ కీలక పాత్ర చేసి అలరించింది. అంతకుముందు మా నీళ్ల ట్యాంక్, పరంపర 2 వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. ఇదే సీజన్ లో పాల్గొన్న సోహైల్ కూడా రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు.

ఢీ షోలో అఖిల్ సార్థక్..

ఢీ షోలో అఖిల్ సార్థక్..

ఇక నాలుగో సీజన్ రన్నర్ గా గెలిచిన అఖిల్ సార్థక్ ఢీ షోకు మెంటార్ గా ఉంటూ హైపర్ ఆదితో కామెడీ పండించాడు. బిగ్ బాస్ నాన్ స్టాప్ అండ్ మూడో సీజన్ లో పార్టిస్ పేట్ చేసిన బోల్డ్ బ్యూటి అషు రెడ్డి ఇటీవలే ఫోకస్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకుంది. ఇక నాలుగో సీజన్ లోని బోల్డ్ బ్యూటి అరియానా గ్లోరి.. ప్రస్తుతం బిగ్ బాస్ కేఫ్ కు యాంకర్ గా తనదైన శైలీలో ఆకట్టుకుంటోంది.

 బ్రింగ్ బ్యాక్ గీతూ..

బ్రింగ్ బ్యాక్ గీతూ..

అయితే తాజాగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్ లేదా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్న చిత్తూరు చిరుత గీతూ రాయల్ అనూహ్యంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసింది. ఆమె వెళ్లిపోవడంతో గీతూ ఫ్యాన్స్ నిరాశ చెందారు. గీతూ రాయల్ ను తిరిగి హౌజ్ లోకి పంపించేందుకు ఉద్యమం కూడా చేపట్టారు. అయితే గీతూ రాయల్ ఎలిమినేట్ అయిన ఆ ఎలిమినేషన్ ఆమెకు కలిసి వచ్చినట్లే ఉంది.

 కీలక పాత్ర కోసం..

కీలక పాత్ర కోసం..

తాజాగా గీతూ రాయల్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం భవదీయుడు భగత్ సింగ్. ఈ చిత్రంలో గీతూ రాయల్ నటించే అవకాశం కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం గీతూ రాయల్ ను హరీశ్ శంకర్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

చిత్తూరు యాసకు ఫిదా..

చిత్తూరు యాసకు ఫిదా..

ఇదే కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప ది రూల్ సినిమాలో కూడా గీతూ రాయల్ కు అవకాశం వచ్చినట్లు రూమర్ వినిపిస్తోంది. అయితే గీతూ రాయల్ చిత్తూరు యాస చూసి ఆమెను ఓకే చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ లో ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని బిగ్ బాస్ కు వెళ్లకముందే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది గీతూ రాయల్. ఇదంతా చూస్తుంటే గీతూ రాయల్ ఎలిమినేషన్ ఆమెకు కలిసొచ్చినట్లే కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X