ఆస్ట్రేలియా ఆఫర్, ఎగిరి గంతేశా.. ఆ మాట చెప్పగానే మైండ్ బ్లాక్..తననూ వదల్లేదన్న గీతూ

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లోకి సోషల్ మీడియా స్టార్లు ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ఎంట్రీ ఇచ్చిన మంచి పేరు సంపాదించింది గీతూ రాయల్. గతంలో టిక్ టాక్ వీడియోలు తర్వాత బిగ్ బాస్ రివ్యూలు చేసి మంచి పేరు సంపాదించిన ఆమె జబర్దస్త్ సహా శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి వాటిలో కనిపిస్తూ మరింత క్రేజ్ సంపాదిస్తోంది.. అయితే తనకు కూడా లైంగిక వేధింపులు తప్ప లేదంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమెది కాస్టింగ్ కౌచ్ అని అనలేం ఎందుకంటే ఆమెను హోస్ట్ గా తీసుకుంటామని చెబుతూ కమిట్మెంట్ అడిగారు. అయితే హోస్టింగ్ ఏంటి? అందులో లైంగిక వేధింపులు ఏమిటి అనే వివరాల్లోకి వెళితే

జబర్దస్త్ లోకి ఎంట్రీ

జబర్దస్త్ లోకి ఎంట్రీ

చిత్తూరు యాసలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఫేమస్ అయింది గలాటా గీతూ అలియాస్ గీతూ రాయల్. టిక్ టాక్ వీడియోలు తర్వాత బిగ్ బాస్ రివ్యూస్ చెబుతూ గీతూ రాయల్ మంచి ఫేమస్ అయింది. తరువాత హైపర్ ఆది పుణ్యమా అంటూ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని స్కిట్స్ లో కనిపిస్తోంది. తాజాగా ఆమె ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలు పంచుకుంది.

చిన్న చిన్న పాత్రల్లో

చిన్న చిన్న పాత్రల్లో

తన అభిమాన హీరో అల్లు అర్జున్ అని, అల్లు అర్జున్ కోసం చేయి కోసుకుంటా అని చెప్పుకొచ్చింది. తనకు మాట్లాడటం ఇష్టం కాబట్టి ఆర్జే అవ్వాలనుకున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. తనకు పెద్ద పెద్ద బ్యానర్లలో నుంచి సినిమా అవకాశాలు వచ్చాయి కానీ తన యాక్టింగ్ రాదు కాబట్టి వారికి నేను నో చెప్పానని అయితే తరువాతి కాలంలో మహేష్ విట్టా చేసిన కల్ట్ సినిమా సోహైల్ హీరోగా చేసిన లక్కీ లక్ష్మణ్ అనే సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో నటించాను అని చెప్పుకొచ్చారు.

హోస్టింగ్ అంటే ఇష్టం

హోస్టింగ్ అంటే ఇష్టం

అయితే క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తే తనకు ఇటీవల ఒక చేదు అనుభవం ఎదురైంది అంటూ ఆమె పేర్కొన్నారు. ఆస్ట్రేలియా లో ఒక ఈవెంట్ ఉందని దానికి హోస్టింగ్ చేయాలని అంటే తనకు వస్తే తనకు హోస్టింగ్ అంటే ఇష్టం కాబట్టి సరేనన్నారు అని చెప్పుకొచ్చారు.

ఎక్కువ డబ్బులు ఇస్తా

ఎక్కువ డబ్బులు ఇస్తా

ఆస్ట్రేలియాలో ఈవెంట్ అంటే అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు, మూడు రోజుల ఈవెంట్ కు భారీగా రెమ్యూనరేషన్ అడిగాను వాళ్లు కూడా సరేనన్నారు అని ఆమె పేర్కొంది. సరిగ్గా టికెట్ బుక్ చేసే ముందు మేనేజర్ పీఏ ఫోన్ చేసి మీకు పర్సనల్గా ఓకే కదా అని అడిగితే నా పనులన్నీ చేయడానికి పర్సనల్ అసిస్టెంట్ గా ఎవరైనా వస్తారేమో అనుకుని సరే అన్నాను అని దానికి అతను అది కాదు మేడం మీకు మా మేనేజర్ కు పర్సనల్ గా ఓకే అయితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తా అని అన్నాడు.

 మైండ్ బ్లాక్ అయి

మైండ్ బ్లాక్ అయి

ఒక నిమిషం వద్దు ఏం చెప్పాడో నాకు అర్థం కాలేదు అర్థం అయిన తర్వాత మైండ్ బ్లాక్ అయింది వెంటనే నో చెప్పి ఫోన్ కట్ చేశాను తర్వాత పర్సనల్గా కలవకపోయినా హోస్టింగ్ అయినా చేయమని ఫోన్లు చేస్తూ ఉన్నారు కానీ నాకు భయం వేసి రానని చెప్పా అని ఆమె పేర్కొంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X