Bigg Boss Telugu 6: ఈ వారం అతడే ఎలిమినేషన్‌.. ఆది రెడ్డికి వెన్నుపోటు పొడుస్తున్న గీతూ

ఏమాత్రం ఆశలు, అంచనాలు లేకుండానే తెలుగు బుల్లితెరపై ప్రారంభమై భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో, నిజ సంఘటనలు చూపిస్తూ ఆడియెన్స్‌ను గెలుచుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక, ఇటీవలే ఈ షో ఆరోది కూడా అంగరంగ వైభవంగా మొదలైంది. ఇందులో తాజాగా జరుగుతోన్న వారంలో బిగ్ బాస్ అందరికీ షాకిచ్చాడు. ఈ నేపథ్యంలో గీతూ రాయల్ ఎలిమినేషన్‌పై జోస్యం చెప్పింది. ఆ వివరాలు మీకోసం!

కంటెంట్ మారినా చూడట్లేదు

కంటెంట్ మారినా చూడట్లేదు

మిగిలిన భాషల కంటే బిగ్ బాస్ షోకు తెలుగులోనే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. అందుకు అనుగుణంగానే దీన్ని సరికొత్త కంటెంట్‌తో ప్రసారం చేస్తున్నారు. ఇక, ఇటీవలే మొదలైన ఆరో సీజన్‌ను కూడా ఎన్నో ప్రయోగాలతో నడిపిస్తున్నారు. దీన్ని మరింత కొత్తగా మార్చేందుకు వినూత్నమైన ప్లాన్లతో వస్తున్నారు. అయినప్పటికీ ఈ సీజన్‌కు ఆదరణ దక్కక రేటింగ్ రావట్లేదు.

సెలెబ్రిటీ లీగ్ మాత్రం నిరాశ

సెలెబ్రిటీ లీగ్ మాత్రం నిరాశ

తాజా సీజన్‌లో ఏడో వారానికి సంబంధించి ఇంటి సభ్యులకు నిర్వహకులు 'సెలెబ్రిటీ గేమింగ్ లీగ్' అనే టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కంటెస్టెంట్లకు కొందరు హీరోలు, హీరోయిన్ల క్యారెక్టర్లను చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ టాస్క్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో బిగ్ బాస్.. కంటెస్టెంట్లు అందరికీ క్లాస్ పీకడంతో పాటు బయటకు వెళ్లిపోమని తిట్టాడు.

ఒకరిపై ఒకరు నిందలు వేస్తూ

ఒకరిపై ఒకరు నిందలు వేస్తూ

'సెలెబ్రిటీ గేమింగ్ లీగ్' టాస్కులో భాగంగా కేవలం ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే చక్కగా ఆడారని, మిగిలిన వాళ్లందరూ నిరాశ పరిచారని బిగ్ బాస్ వెల్లడించాడు. అంతేకాదు, ఈ కారణంగానే కెప్టెన్సీ కంటెండర్ల టాస్కును ఆపేసినట్లు కూడా చెప్పాడు. దీంతో మంచిగా ఆడని కంటెస్టెంట్లపై మిగిలిన వాళ్లు అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఒకరిపై ఒకరు నిందలు వేశారు.

ఆది రెడ్డిపై గీతూ విమర్శలు

ఆది రెడ్డిపై గీతూ విమర్శలు

తాజా ఎపిసోడ్‌లో గీతూ రాయల్.. ఆది రెడ్డి ఆటపై విమర్శలు చేసింది. ఈ క్రమంలోనే అతడితో మాట్లాడుతూ.. 'నువ్వు సరిగా పెర్ఫామ్ చేయట్లేదు. ఉదయం ఏదో ఓ గంట చేశావ్. తరువాత ఏం చేశావు? నువ్ నన్ను డిజప్పాయింట్ చేశావు. బిగ్ బాస్‌ను డిజప్పాయింట్ చేశావో లేదో నాకు తెలియదు కానీ.. నన్నుమాత్రం మాత్రం చేశావు' అంటూ ఆది రెడ్డిని మరింత నిరాశ పరిచింది.

నువ్వు వెళ్లిపోతావనే భయం

నువ్వు వెళ్లిపోతావనే భయం

ఆ తర్వాత ఆది రెడ్డితో గీతూ 'నువ్వు ఈ వారం వెళ్లిపోతావేమో అని భయంగా ఉంది. నువ్వు కూడా ఎలిమినేట్ అయ్యే వాళ్ల లిస్ట్‌లో ఉండొచ్చు. నా వల్ల నువ్వు సేఫ్ అవుతావులే కానీ.. నీ వల్ల ఎంటర్‌టైన్ చేసేవాళ్లు ఎవరైనా వెళ్లిపోతే నేను బాధపడతా. నీ దగ్గర ఎంటర్‌టైన్‌మెంట్ జీరో. నువ్వేం చేయడం లేదు.. జీరో.. ఏదోటి చేయాలి. అదే కదా కామెడీ' అంటూ చెప్పుకొచ్చింది.

ఎలిమినేట్ అయ్యేది వాళ్లే

ఎలిమినేట్ అయ్యేది వాళ్లే

బయట రివ్యూలు చెప్పుకునే గీతూ రాయల్.. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో సైతం 7వ వారం ఎలిమినేషన్స్‌పై రివ్యూ చెప్పింది. 'నామినేషన్స్‌లో ఉన్నారు అందరూ.. ఇప్పుడు కూడా పెర్ఫామ్ చేయట్లేదు.. ఇలాగైతే ఫేమ్ ఉన్న వాళ్లు ఉండి.. లేని వాళ్లు ఎలిమినేట్ అయిపోతారు. అందులో నువ్వు కూడా ఉండోచ్చు ఆది రెడ్డి' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ఆది రెడ్డికి గీతూ వెన్నుపోటు

ఆది రెడ్డికి గీతూ వెన్నుపోటు


నిన్నటి ఎపిసోడ్ చూస్తే.. గీతూ రాయల్ తనకు తాను తోపు అని ఫీల్ అవుతున్నట్లు అర్థం అవడంతో పాటు ఆది రెడ్డిని తనకంటే తక్కువ స్థాయి ఉన్న కంటెస్టెంట్ అని దిగజార్చేలా మాట్లాడినట్లు అర్థం అవుతుంది. ఒకరకంగా అతడి గేమ్‌ను ఫోకస్ తప్పేలా చేస్తూ వెన్నుపోటు పొడిచేస్తుంది. ఈ ఎపిసోడ్ తర్వాత ఆది రెడ్డి ఆటలో మార్పు వస్తే దానికి గీతూ కారణం అనొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X