Bigg Boss: ఆది రెడ్డిపై భారీ కుట్ర.. ఎలిమినేట్ చేసేలా ప్లాన్.. మోసం బయటపెట్టి షాకిచ్చిన గీతూ రాయల్

చిత్ర విచిత్రమైన టాస్కులు.. కెమెరాల మధ్యనే గొడవలు, కొట్లాటలు, రొమాన్స్, లవ్ ఇలా ఎన్నో ఎమోషన్స్.. మొత్తానికి గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టు.. అయితేనేం తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. మన దగ్గర వచ్చే షోకు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇప్పుడు ఆరో సీజన్‌ను కూడా నిర్వహకులు ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఇక, ఇందులో స్ట్రాంగ్ ప్లేయర్‌గా ఉన్న ఆది రెడ్డిపై భారీ కుట్ర జరుగుతున్నట్లు గీతూ పోస్ట్ చేసింది. అసలేమైందో మీరే చూడండి!

21 మందిలో ఆది హైలైట్‌గా

21 మందిలో ఆది హైలైట్‌గా

బిగ్ బాస్ ఆరో సీజన్‌ కోసం కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో బిగ్ బాస్ నిర్వహకులు పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారు. ఇలా మొత్తంగా ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపారు. అందులో కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన రివ్యూవర్ ఆది రెడ్డి ప్రత్యేకమైన శైలితో బాగా హైలైట్ అయ్యాడు. తద్వారా ఆరంభంలోనే అందరి దృష్టిలో పడ్డాడు.

 ఆట, మాట తీరుతో మంచిగా

ఆట, మాట తీరుతో మంచిగా

చాలా కాలంగా బిగ్ బాస్ రివ్యూలతో పాటు యూట్యూబ్ వీడియోలతో పేరు తెచ్చుకున్న ఆది రెడ్డి.. చాలా మందికి పరిచయం కాలేదు. కానీ, ఇటీవలే బిగ్ బాస్ షో ఆఫర్‌ను సొంతం చేసుకున్నాడు. ఇందులో తనదైన ఆటతీరుతో అందరి మనసులు దోచుకుంటున్నాడు. అదే సమయంలో మాటతీరు, అందరితో వ్యవహరించే తీరుతో మంచి పేరును కూడా సొంతం చేసుకున్నాడు.

ఫైనలిస్టుగా ఆది రెడ్డి పేరు

ఫైనలిస్టుగా ఆది రెడ్డి పేరు

ప్రస్తుతం బిగ్ బాస్ ఆరో సీజన్‌లో టికెట్ టు ఫినాలే టాస్కు జరుగుతోంది. ఇందులో రేవంత్, శ్రీహాన్, ఆది రెడ్డి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఎంతో ఆసక్తికరంగా దాదాపు నాలుగు రోజుల పాటు సాగిన ఈ టాస్కులో ఆది రెడ్డి విజయం సాధించి ఫస్ట్ ఫైనలిస్టుగా నిలిచాడని రెండు రోజుల క్రితమే ఓ న్యూస్ లీకైంది. కానీ, అలా జరగకుండా శ్రీహాన్ ఇందులో గెలిచినట్లు తెలుస్తోంది.

 ఆది రెడ్డి వెనుక కుట్ర అని

ఆది రెడ్డి వెనుక కుట్ర అని

ఆది రెడ్డి ఆటతీరుపై గీతూ రాయల్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. ఇందులో ఆమె 'ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆది రెడ్డి ఓట్లను తగ్గించడం కోసం అతడు టికెట్ టు ఫినాలే టాస్కులో విజయం సాధించినట్లుగా ఫేక్ రూమర్ ఒకటి ప్రచారం చేశారు. దీంతో ఆరోజు నుంచి అతడికి ఓట్లు తగ్గిపోయాయి' అంటూ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చింది.

నేను చెప్తూనే ఉన్నానంటూ

నేను చెప్తూనే ఉన్నానంటూ

అదే పోస్టులో గీతూ రాయల్ 'టికెట్ టు ఫినాలే విన్ అయినా.. ఈ వారం సేఫ్ అయితేనే అది ఉపయోగపడుతుంది అని నేను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు ఆది రెడ్డి టాస్కులో గెలవలేదు.. పైగా ఓట్లు కూడా బాగా తగ్గిపోయాయి. ఇది కచ్చితంగా అతడి తలరాత అని కూడా చెప్పొచ్చు. అతడి పట్ల నేను చాలా బాధ పడుతున్నాను' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.

ఆ సొల్లు మాటలు కాకుండా

ఆ సొల్లు మాటలు కాకుండా

గీతూ రాయల్ కంటిన్యూ చేస్తూ.. 'ఆది రెడ్డి ఈ వారం జరిగిన ఓటింగ్‌లో డేంజర్ జోన్‌లో ఉన్నాడు. కామనర్, రివ్యూవర్ లాంటి సొల్లు అంతా పక్కన పెట్టేస్తే.. ఒక కంటెస్టెంట్‌గా అతడు గేమ్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఫెయిర్‌గా ఆడుతున్నాడు. తన వ్యక్తితం, వ్యవహార శైలి కూడా ఎంతో బాగుంది. కాబట్టి అతడికి మీరంతా సపోర్ట్ చేయండి' అంటూ ఆది రెడ్డికి సపోర్టు చేసింది.

నిజంగానే డేంజర్‌ జోన్‌లో

నిజంగానే డేంజర్‌ జోన్‌లో

బిగ్ బాస్ ఆరో సీజన్‌ పదమూడో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లలో ఆరంభంలో ఆది రెడ్డికి ఓటింగ్ భారీగా జరిగింది. కానీ, మూడో రోజు నుంచి క్రమంగా పడిపోతూ వచ్చింది. తద్వారా ఈ వారానికి అతడు కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది. చూడాలి మరి ఈ వారం అతడి విషయంలో ఏం జరుగుతుందో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X