Geetu Eliminated: బిగ్ బాస్‌లో షాకింగ్ సీన్.. షో చరిత్రలో తొలిసారి.. గీతూ దెబ్బకు వాళ్లూ వచ్చారుగా!

తెలుగు బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా ప్రేక్షకాదరణను అందుకున్న షోలలో బిగ్ బాస్ ఒకటి. తెలుగులోకి ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ షో... సక్సెస్‌ఫుల్‌గా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఆరో దాన్ని మొదలు పెట్టారు. దీనికి ఆరంభంలో రేటింగ్ రాకున్నా.. క్రమంగా పుంజుకుంటూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్ నుంచి టాప్ కంటెస్టెంట్ గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లో షాకింగ్ సీన్ కనిపించింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

క్రమంగా పెరుగుతోన్న రేటింగ్

క్రమంగా పెరుగుతోన్న రేటింగ్

బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా భారీ స్థాయిలో ఆదరణను అందుకుంటోంది. అందుకు అనుగుణంగానే ఆరో సీజన్‌కు కూడా సూపర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా దీనికి ఆదరణ అంతగా రావడం లేదు. అయినప్పటికీ నిర్వహకులు చాలా ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో ఈ సీజన్ రేటింగ్‌ క్రమంగా పెరుగుతూనే ఉంటోంది.

ఈ సారి షాకింగ్ ఎలిమినేషన్లు

ఈ సారి షాకింగ్ ఎలిమినేషన్లు

బిగ్ బాస్ షో మొత్తంలోనే చాలా ముఖ్యమైన ప్రక్రియల్లో ఎలిమినేషన్ ఒకటన్న విషయం తెలిసిందే. ఆరో సీజన్‌లో ఎలిమినేషన్స్ అన్నీ ఎవరూ ఊహించని విధంగా సాగుతున్నాయి. అందుకే ఇప్పటికే చాలా మంది స్ట్రాంగ్ ప్లేయర్లు బయటకు వెళ్లిపోయారు. దీంతో అసలు ఈ సీజన్‌లో ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియక ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ అయోమయంగా ఉన్నారు.

గీతూ రాయల్ టైటిల్ బరిలో

గీతూ రాయల్ టైటిల్ బరిలో

బిగ్ బాస్ ఆరో సీజన్‌ కోసం కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారు. ఇలా అందులో రాయలసీమ భామ గీతూ రాయల్ ప్రత్యేకమైన శైలితో బాగా హైలైట్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో టైటిల్ ఫేవరెట్ అనిపించుకుని పక్కాగా ముందుకు సాగింది.

షో నుంచి గీతూ రాయల్ ఔట్

షో నుంచి గీతూ రాయల్ ఔట్

తనదైన ప్రత్యేకమైన శైలి ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించుకుని.. టైటిల్ బరిలో నిలిచిన గీతూ రాయల్ తొమ్మిదో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఆదివారం ఎపిసోడ్‌లో శ్రీ సత్య, గీతూ రాయల్ మిగిలారు. ఇందులో గీతూ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. దీంతో ఆమెతో పాటు హౌస్‌లోని వాళ్లంతా షాక్‌లో ముగినిపోయారు.

ఎంతో ఎమోషనల్‌.. అందరూ

ఎంతో ఎమోషనల్‌.. అందరూ

గీతూ రాయల్ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిందని తెలియగానే హౌస్‌లో ఎమోషనల్ సీన్స్ కనిపించాయి. దాదాపుగా ఇంట్లో ఉన్న అందరు కంటెస్టెంట్లు ఏడ్చేశారు. మరీ ముఖ్యంగా రేవంత్ అయితే వెక్కి వెక్కి ఏడ్చాడు. గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత గీతూ రాయల్ 'నన్ను పంపకండి బిగ్ బాస్.. నేను వెళ్లను' అంటూ ఎమోషనల్ అవడం అందరికీ కన్నీరు తెప్పించింది.

నాగార్జునను పట్టుకుని ఏడ్చి

నాగార్జునను పట్టుకుని ఏడ్చి

ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీద గీతూ రాయల్ 'సార్ నేను టైటిల్ కొడతానని అనుకున్నా. కానీ, ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అస్సలు అనుకోలేదు. నేను బయటకు వెళ్లలేను సార్. ఇక్కడే ఉండిపోతాను. ఎలిమినేట్ అయ్యానన్న మాటనే నేను తట్టుకోలేకపోతున్నాను' అంటూ నాగార్జునను పట్టుకుని ఏడ్చింది. దీంతో ఆయన కూడా ఎమోషనల్‌గా కనిపించాడు.

వాళ్లు వచ్చి తీసుకెళ్లారంటే

వాళ్లు వచ్చి తీసుకెళ్లారంటే

గీతూ రాయల్ ఎంతకూ అక్కడి నుంచి వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో నాగార్జున సిబ్బందిని పిలవాల్సి వచ్చింది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు సిబ్బంది వచ్చి ఆమెను స్టేజ్ పైనుంచి తీసుకుని వెళ్లారు. దీంతో గీతూ రాయల్ చాప్టర్ అక్కడితో ఆయిపోనట్లు అయింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత కూడా బిగ్ బాస్‌లో భావోద్వేగ సన్నివేశాలే కనిపించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X