మహేష్,పవన్ లైవ్ ఏ ఛానెల్ లో చూడవచ్చంటే...
హైదరాబాద్ :విశాఖలో విధ్వంశం సృష్టించిన హుధూద్ తుఫాన్ బారిన పడ్డ భాదితులను ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ నిర్వహిస్తున్న ఫండ్ రైజింగ్ కార్యక్రమం ‘మేము సైతం' - వుయ్ లవ్ వైజాగ్'. ఈ కార్యక్రమంలో తెలుగు,తమిళ సిని పరిశ్రమలోని పెద్దలంతా పాల్గొంటున్నారు. ముఖ్యంగా తెలుగు నుంచి మహేష్, పవన్ పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ పోగ్రాం ట్రాన్సిమిషన్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఫైనల్ గా జెమినీ టీవి వారు ఈ ప్రసార హక్కులను సొంతం చేసుకున్నారు.

ఈ పోగ్రాం.. నవంబర్ 30న హైదరాబాద్ లో జరగనుంది. దాదాపు 13 గంటల పాటు కంటిన్యూగా జరిగే లైవ్ ప్రోగ్రాం. దాంతో గత కొద్ది రోజులుగా ‘మేము సైతం' ప్రోగ్రాంని ప్రత్యక్ష ప్రసారం చేసే రైట్స్ కోసం తెలుగులో నాలుగు పెద్ద ఎంటర్టైనింగ్ చానల్స్ పోటీ పడినట్లు సమాచారం. అవి... ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ మరియు జీ టీవీ. అయితే చివరికి జెమిని టీవీ వారు మేము సైతం ప్రత్యక్ష ప్రసార రైట్స్ ని ఓ భారీ మొత్తానికి దక్కించుకున్నారు. ఎంత మొత్తమన్నది తెలియరాలేదు.
ఇక మీరు చూస్తున్న లోగో విషయానికి వస్తే...సహాయం అందించడానికి సిద్దంగా ఉన్న చేతులను ఒక చెట్టు ఆకారంలో పొందుపరిచారు. కింద మేము సైతం అక్షరాలను, చెట్టును గ్రీన్, బ్లూ కలర్ లో రాశారు. సింబాలిక్ గా గ్రీన్ కలర్లో రాయడం అంటే విశాఖ పర్యావరణం అభివృద్ధికి, పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తాం, శక్తిని ఇస్తాం అని అర్ధం. బ్లూ కలర్లో రాయడం అంటే త్రికరణ శుద్ధితో, మనస్పూర్తితో, నిజాయితిగా పని చేస్తున్నాం. మీలో విశ్వాసాన్ని నింపుతాం అని అర్ధం. లోతుగా అధ్యయనం చేసి ఆలోచించిన తర్వాత ఈ లోగోను రూపొందించినట్టు చెప్తున్నారు.

నవంబర్ 30వ తేదిన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ స్టార్ నైట్ కార్యక్రమంలో టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మోహన్ బాబు మొదలైన వారు లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. తెలుగు పరిశ్రమ ప్రముఖులతో తమిళ పరిశ్రమ నుండి రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితరులు హాజరవుతున్నారు. నవంబర్ 30న టాలీవుడ్ కి సెలవు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











