ఏం చూసి మగాళ్లు అనుకుంటున్నారో. తిక్కరేగితే. అది కత్తిరిస్తాడట.. ఈటీవీ ప్రభాకర్ వార్నింగ్
బుల్లితెరపై యాహూ షోతో ఫేమస్ అయిన ప్రభాకర్ ఆపై అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నాడు. బుల్లితెరపై సీరియళ్లు నటిస్తూ, నిర్మిస్తూ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఒకానొక సమయంలో బుల్లితెర మెగాస్టార్ అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. వెండితెరపైనా వేషాలు వేశాడు. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. అయితే బుల్లితెరపై ప్రభాకర్ చేసిన సీరియళ్లు మాత్రం బాగానే క్లిక్ అయ్యేవి. ప్రస్తుతం వదినమ్మ సీరియల్‌తో టాప్ రేటింగ్‌లో దూసుకుపోతున్నాడు.

‘వదినమ్మ’తో రచ్చ..
వదినమ్మ సీరియల్ రోజురోజూకూ ఆసక్తికరంగానే మారుతోంది. రఘురామ్ పాత్రలో ఇంటికి పెద్ద దిక్కుగా ప్రభాకర్ అద్భుతంగా నటిస్తున్నాడు. రోజుకో మలుపు తిరుగుతూ సీరియల్ వంద రెండు వందల ఎపిసోడ్‌లను ఇట్టే దాటేసింది. మొత్తానాకి కార్తీక దీపం, గృహలక్ష్మీ తరువాత వదినమ్మ టీఆర్పీలో దూసుకుపోతోంది.

ఇస్మార్ట్ జోడి..
ఓంకార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా బుల్లితెరపై ఇస్మార్ట్ జోడి అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. సెలెబ్రిటీ జంటలతో కొత్త కొత్త ఆటలు ఆడించాడు. ఏడెనిమిది నెలల పాటు నిర్వహించిన ఈ షోలో చివరకు ప్రభాకర్ జంట గెలిచింది. ఇస్మార్ట్ జోడి టైటిల్‌ను దక్కించుకున్నారు. ఇందులో కొరియోగ్రాఫర్ యశ్ రన్నర్‌గా నిలిచారు.

దసరా ఈవెంట్ల సందడి..
అలాంటి ప్రభాకర్ తాజాగా దసరా ఈవెంట్లో సందడి చేశాడు. ఇప్పటికే అన్ని చానెళ్లకు సంబంధించిన దసరా ఈవెంట్ల ప్రోమోలు వైరల్ అయ్యాయి. ఈటీవీలో అక్కా ఎవరే అతగాడు, స్టార్ మాలో జాతరో జాతర, జీ తెలుగులో చిరంజీవి ప్రదీప్, చిలసౌ శ్రీముఖి అంటూ ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఇక జెమినీ టీవీలో దసరా పెళ్లి చూపులు అనే ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.
Recommended Video

ప్రభాకర్ సెటైర్లు..
ఇక ఈ దసరా పెళ్లి చూపులు ఈవెంట్లో జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు రచ్చ చేశారు. వీరితో పాటు సీరియల్ ఆర్టిస్ట్‌లు బాగానే సందడిచేశారు. యాంకర్‌గా శ్యామల తనదైన శైలిలో పంచులు వేసింది. ఇక ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా పోసాని కృష్ణ మురళీ నిలవనున్నట్టు కనిపిస్తోంది. ఈ ఈవెంట్లో ప్రభాకర్ ముసలి గెటప్ వేసుకుని బాగానే సెటైర్లు వేశాడు.
కత్తిరిస్తా అంటూ వార్నింగ్..
బుల్లెట్ భాస్కర్, సుధాకర్, చలాకీ చంటి అందరూ కలిసి వేసిన స్కిట్‌లో ప్రభాకర్ ఓ క్యారెక్టర్‌ను పోషించినట్టు కనిపిస్తోంది. ఏం చూసి మగాళ్లు అని అనుకుంటున్నారో అది కత్తిరిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు ప్రభాకర్. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇలా మొత్తానికి ప్రభాకర్ చాలా రోజుల తరువాత మళ్లీ కామెడీ పంచేందుకు ముందుకు వచ్చాడు.


Click it and Unblock the Notifications











