నాగార్జునని అడ్డం పెట్టి రామ్ చరణ్ బిజినెస్

By Srikanya

Gemini Tv picked up the MANAM satellite rights
హైదరాబాద్ : శాటిలైట్ బిజినెస్ ఎంత అయ్యింది అనే విషయం ట్రేడ్ లో ...ఈ రోజున చిన్న,పెద్ద సినిమాలకు బాగా ప్లస్ అయ్యే విషయంగా పరిగణిస్తున్నారు. తాజాగా మనం చిత్రం శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవి వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఎనిమిది కోట్లు కు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉందని, కేవలం మనం చిత్రానికి మాత్రమే ఈ శాటిలైట్ రేటుని ఫిక్స్ చేయలేదని అంటున్నారు. రామ్ చరణ్ ఫ్లాఫ్ చిత్రం తుఫాన్ ని సైతం ఈ ప్యాకేజీలో తోసేసారని తెలుస్తోంది. రెండు చిత్రాలకు రిలియన్స్ వారు ఆర్దికంగా వెనక ఉండటంతో ఈ రెండు చిత్రాలు కలిపి అమ్మారంటున్నారు. విడిగా తుఫాన్ చిత్రం శాటిలైట్ రైట్స్ ఎవరూ కొనుక్కోవటానికి రాలేదని, అందుకే ఈ స్ట్రాటజీ అవలంభించారని అంటున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ కథానాయికలు. అన్నపూర్ణ స్డూడియోస్‌ సంస్థ నిర్మించింది. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌బచ్చన్‌ అతిథి పాత్రలో కనిపిస్తారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. ఈ చిత్రంలోని గీతాల్ని శుక్రవారం విడుదల చేస్తారు. ఎలాంటి ఆర్భాటమూ లేకుండా పాటల్ని నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. మే 23న 'మనం' ప్రేక్షకుల ముందుకొస్తుంది. అనూప్‌ స్వరాలు అందించారు. ఇప్పటికే 'పియో పియోరే..' గీతాన్ని యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. ఆ గీతానికి మంచి స్పందన వస్తోందని చిత్రబృందం చెబుతోంది.

పునర్జన్మకు సంభందించిన చిత్రాలు ఈ మధ్య కాలంలో పాపులరైనవి మగధీర, ఈగ. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు పునర్జన్మ కధాంశంతోనే నాగార్జున తమ చిత్రం మనం రూపొందింది అని తెలియచేస్తున్నారు. మగధీరలా ఈ చిత్రం విజయం సాధించాలనే ఈ కధాంశం ఎన్నుకున్నారన్నమాట.

నాగార్జున మాట్లాడుతూ... ఈ చిత్రం 1920 నుంచి 2030 మధ్య వంద సంవత్సరాలలో జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ చిత్ర కథాంశం ఎంతో వినోద బరితంగా ఉంటుందని తెలిపారు. పునర్జన్మ కోణం లో ఈ చిత్రం ఉంటుందని నాగార్జున అన్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం మే 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగార్జున మాట్లాడుతూ "నాన్నగారు నటించిన చివరి చిత్రం కాబట్టిసినిమా మీద అంచనాలు మెండుగా ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఇది మంచి సినిమాఅవుతుంది అనిపిస్తోంది.ఇది పూర్తి కుటుంబ సభ్యులతో చూడతగ్గ చిత్రం లా ఉంటుందని చాలా మందిఫోన్లు చేసి వాకబు చేస్తున్నారు. నాన్న,నేను, చైతన్య కలిసి నటించిన ఈ సినిమానుఅన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ లో ఓ ప్రెస్టీజియస్ సినిమా గా దర్శకులు విక్రమ్ కుమార్ రూపొందించారుసినిమా ఆడియోను ఈ నెలలో నే విడుదల చేసి సినిమానుమే నెల 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము'' అన్నారు

అలాగే ...కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం అంటున్నారు నాగార్జున. '' 'ఇంటిల్లిపాది చూడాల్సిన సినిమాలా ఉంది' అంటున్నారంతా. నిజంగానే ఇది అలాంటి సినిమానే. మనందరి ప్రేమకథని 'మనం'లో చూడొచ్చు. మా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రమిది. త్వరలో పాటల్ని వినిపిస్తాము''అన్నారు.

అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X