For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ బుల్లితెర ఎంట్రీపై అనుమానాలకు చెక్: ఒకే ఒక్క పోస్టుతో క్లారిటీ.. అసలైంది మాత్రం సస్పెన్స్

  |

  దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సుదీర్ఘమైన కెరీర్‌లో యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, సింగింగ్ ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం బిగ్ బాస్ షో ద్వారా హోస్టుగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో కూడా అదరగొట్టిన అతడు.. సుదీర్ఘ విరామం తర్వాత 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే షోతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కరోనా నేపథ్యం వల్ల దీనిపై అనుమానాలు వ్యక్తం అవగా.. తాజాగా క్లారిటీ వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...

  ఇద్దరు స్టార్ హీరోలతో నాలుగు సీజన్లు

  ఇద్దరు స్టార్ హీరోలతో నాలుగు సీజన్లు

  వందకు పైగా దేశాల్లో ప్రసారం అవుతూ.. హిందీలోకి కూడా వచ్చిన గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ'. దీన్నే తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే పేరుతో ప్రారంభించారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఇది.. ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి మూడింటికీ అక్కినేని నాగార్జున.. నాలుగో దానికి మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్టులుగా పని చేశారు.

  ఇప్పుడు కొత్త టైటిల్... మరో ఛానెల్‌లో

  ఇప్పుడు కొత్త టైటిల్... మరో ఛానెల్‌లో

  సక్సెస్‌ఫుల్ షో కావడంతో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు మరో సీజన్‌తో రాబోతున్నారు. అయితే, ఈ సారి ఈ గేమ్ షో స్టార్ మాలో కాకుండా జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది. దీనికి ‘ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్ మార్చారు. ఈ విషయాన్ని ప్రకటించినప్పుడే దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

   మీ ఆశలను నిజం చేసేందుకు సిద్ధంగా

  మీ ఆశలను నిజం చేసేందుకు సిద్ధంగా

  ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రోమోను కొద్ది రోజుల క్రితం విడుదల చేశారు. అందులో దీని ప్రస్థానం గురించి వివరించారు నిర్వహకులు. అంతేకాదు, ‘మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ‘‘ఎవరు మీలో కోటీశ్వరులు'' త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

  రీఎంట్రీ ఇస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్

  రీఎంట్రీ ఇస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్

  కొంత కాలంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షో ద్వారా బుల్లితెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే అతడికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. అందులో ఎన్టీఆర్ ఎప్పటిలాగే పదునైన పదజాలంతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో ఈ షో పట్ల తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రెస్‌మీట్‌లో స్వయంగా వెల్లడించాడు.

  గ్రౌండ్ వర్క్ మొదలు.. అన్నీ రెడీగానే

  గ్రౌండ్ వర్క్ మొదలు.. అన్నీ రెడీగానే

  ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు సంబంధించిన పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైంది. ఇందుకోసం జెమినీ టీవీలో కొన్ని ప్రశ్నలు కూడా అడిగేశారు. ఆ మధ్య పలు నగరాల్లో ఆడిషన్స్ కూడా నిర్వహించారు. దీంతో ఇది మే మొదటి వారంలోనే మొదలవుతుందని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు.

  కరోనా ఎఫెక్టుతో షో వాయిదా అంటూ

  కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా రెండో దశ తీవ్ర రూపం దాల్చుతోంది. దీంతో సినిమాల షూటింగులన్నీ నిలిచిపోయాయి. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షో ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవన్న టాక్ వినిపించింది. దీంతో అసలు ఇది ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

   ఒకే ఒక్క పోస్టుతో క్లారిటీ... అసలైంది

  ఒకే ఒక్క పోస్టుతో క్లారిటీ... అసలైంది

  ‘ఎవరు మీలో కోటీశ్వరులు' విషయంలో ప్రచారం అవుతోన్న అనుమానాలకు జెమినీ టీవీ పుల్‌స్టాప్ పెట్టేసింది. తాజాగా షో నిర్వహకులు ఇది త్వరలోనే రాబోతుందంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, ‘ఆడుతున్న వాళ్ల కలలను నెరవేస్తుంది. ఇటు చూస్తున్న ప్రేక్షకులకు వంద శాతం ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతుంది' అంటూ అందులో పేర్కొన్నారు. అయితే ఎప్పటి నుంచో మాత్రం చెప్పలేదు.

  English summary
  Jr NTR is Reentry to the small screen as a host for the upcoming season of Evaru Meelo Koteeswarulu. Now Gemini Tv Tweet on This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X