గెటప్ శ్రీను గుట్టు విప్పిన భార్య.. అర్ధరాత్రి కలలో మరొకరికి ప్రపోజ్.. ఇంతకీ ఎవరంటే

Recommended Video

Getup Srinu Wife Suji Revealed About His Proposal | Filmibeat Telugu

జబర్దస్త్ కామెడీ షోతో సినీ, టెలివిజన్ రంగాలకు చాలా మంది ప్రతిభావంతులైన కమెడియన్లు పరిచయం అయ్యారు. అందులో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న వారిలో హైపర్ ఆది, గెటప్ శ్రీను ఉన్నారు. తాజాగా ప్రముఖ నటుడు, కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోకు వీరిద్దరూ హాజరయ్యారు. అయితే టాక్ షోలో భాగంగా తన భార్య చెప్పిన మాటలతో గెటప్ శ్రీను ఇరుకున పడ్డారు. ఇంతకీ గెటప్ శ్రీను భార్య సుజీ చెప్పిన విషయం ఏంటంటే..

మా ఆయన సకలకళా వల్లభుడు

మా ఆయన సకలకళా వల్లభుడు

ఆలీ టాక్ షోలో ప్లే చేసిన వీడియోలో గెటప్ శ్రీను గురించి ఆయన భార్య సుజీ చెబుతూ.. మా ఆయన గురించి చెప్పాలంటే ఆయన సకలకళావల్లభుడు. ఆయనకు తెలియనిది ఏదీ ఉండదు. మంచి వంటగాడు. ఆయన వంట చేస్తానంటే నాకు చాలా హ్యాపీ. కానీ ఆయనను చాలా కాలంగా ఓ ప్రశ్న అడుగాలని అనుకొంటున్నాను అని తేజు అన్నారు.

అర్ధరాత్రి కలలో ప్రపోజ్ చేస్తూ

అర్ధరాత్రి కలలో ప్రపోజ్ చేస్తూ

గెటప్ శ్రీనును ఉద్దేశించి సుజీ ఓ ప్రశ్నను అడుగుతూ.. ఓ రోజు ఆయన అర్ధరాత్రి కలవరిస్తూ ఎవరికో ప్రపోజ్ చేశారు. మాటల్లో ప్రేమను వ్యక్తం చేశారు. ఆ రోజు అలా ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరు? చాలా జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పమని సుజి అడిగారు.

గెటప్ శ్రీను చెప్పిందేమింటంటే

గెటప్ శ్రీను చెప్పిందేమింటంటే

భార్య అడిగిన ప్రశ్నకు గెటప్ శ్రీను సమాధానం ఇస్తూ ఓ సినిమా కోసం ఓ రోజు షూటింగ్‌లో బిజినెస్‌మెన్ స్కూప్‌తో భారీగా డైలాగులు చెప్పాల్సి వచ్చింది. డైలాగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో వాటిని రోజంతా మననం చేసుకొంటూ ఉన్నాను. అదే రాత్రి కూడా నిద్రలో కలువరించాను అని చెప్పారు.

ఇరుకున పడిన గెటప్ శ్రీను

ఇరుకున పడిన గెటప్ శ్రీను

భార్య అడిగిన ప్రశ్నకు ఏదో చెప్పి తప్పించుకోవాలని గెటప్ శ్రీను చూశాడు. అయితే తను ఎవరిని కలువరించాడో అనే విషయాన్ని భార్య చేతే ఆలీ చెప్పించడంతో గెటప్ శ్రీను ఇరుకునపడ్డాడు. తాను ఏదో అనుకొని ఏదో చెప్పాను అని గెటప్ శ్రీను అన్నారు.

చిరంజీవిపై గెటప్ శ్రీను ప్రేమ అలా

చిరంజీవిపై గెటప్ శ్రీను ప్రేమ అలా

గెటప్ శ్రీను కలువరించింది ఎవరినో కాదు.. మెగాస్టార్ చిరంజీవిని అని భార్య సుజి వెల్లడించింది. గెటప్ శ్రీనుకు చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం. నిద్రలో కూడా తాను అంటే ఎంత ఇష్టమో కలవరిస్తూ చెప్పారు అని గెటప్ శ్రీను భార్య సుజి గుట్టువిప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X