For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుడిగాలి సుధీర్‌ పెళ్లి సీక్రెట్ లీక్: ఏకంగా మూడు సార్లు అలా.. ఆమె ఎదుటే రివీల్ చేస్తానంటూ!

  |

  సుడిగాలి సుధీర్.. ఈ పేరుతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ కుర్రాడు దాదాపు ఐదారేళ్లుగా తనదైన శైలి టాలెంట్లతో ఆకట్టుకుంటున్నాడు. తద్వారా వరుస ఆఫర్లను దక్కించుకోవడంతో పాటు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

  దీంతో ఇతగాడి తరచూ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇక, కొద్ది రోజులుగా సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ జబర్దస్త్ కమెడియన్ పర్సనల్ వ్యవహారాల గురించి అతడి స్నేహితులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  అలా మొదలైన ప్రయాణం.. ఫుల్ ఫేమస్

  అలా మొదలైన ప్రయాణం.. ఫుల్ ఫేమస్

  మెజీషియన్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టుకున్నాడు సుధీర్. ఈ క్రమంలోనే ఎన్నో టీవీ ఛానెళ్లలో తన మ్యాజిక్ ప్రతిభను కనబరిచాడు. సరిగ్గా అప్పుడే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడడంతో అందులోకి ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. అలా ఆ షోలో చేస్తోన్న సమయంలోనే అసాధారణమైన టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా మామూలు ఆర్టిస్టు నుంచి టీమ్ లీడర్‌గా ప్రమోషన్‌ను కూడా అందుకున్నాడు. అప్పటి నుంచి గెటప్ శ్రీను, రాంప్రసాద్, సన్నీలతో కలిసి అద్భుతమైన స్కిట్లతో అలరిస్తున్నాడు. తద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకున్నాడతను.

  షూటింగ్‌‌కు వెళ్తే అలా చేయించారు.. ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని ఏడ్చా: శ్రీముఖి సంచలన వ్యాఖ్యలు

  రష్మీతో లవ్ ట్రాక్‌తో మరింత పాపులారిటీ

  రష్మీతో లవ్ ట్రాక్‌తో మరింత పాపులారిటీ

  యాక్టింగ్, డ్యాన్స్, పాటలు, మ్యాజిక్‌లు ఇలా ఎన్నో రకాల టాలెంట్లను చూపిస్తూ బుల్లితెర ఆల్‌రౌండర్‌గా వెలుగొందుతున్నాడు సుడిగాలి సుధీర్. వీటి ద్వారానే అతడు పాపులర్ అయ్యాడు. అయితే, అతడి పేరు మారుమ్రోగిపోడానికి మాత్రం యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వచ్చిన వార్తలే కారణం అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని జరిగిన ప్రచారంతో ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. ఫలితంగా ఒంటరిగా కంటే జంటగా ఫేమస్ అయ్యాడు. ఆమె వల్లే తనకీ స్థాయి వచ్చిందని సుధీర్ కూడా వెల్లడించాడు.

  సినిమాల్లోకి ఎంట్రీ.. హీరోగానూ ఫుల్ బిజీ

  సినిమాల్లోకి ఎంట్రీ.. హీరోగానూ ఫుల్ బిజీ

  తనదైన టైమింగ్‌తో బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో కామెడీని పండిస్తూ టాప్ కమెడియన్‌గా కొనసాగుతున్న సుడిగాలి సుధీర్.. చాలా కాలం క్రితమే సినిమాల్లోనూ అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే ‘రేసు గుర్రం', ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', ‘సర్దార్ గబ్బర్ సింగ్', ‘బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇవన్నీ అతడికి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే, హీరోగా చేసిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్', ‘త్రీమంకీస్' మాత్రం ఘోరంగా నిరాశ పరిచాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ యంగ్ టాలెంటెడ్ గాయ్ ‘కాలింగ్ సహస్రా', ‘గాలోడు' వంటి చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు.

  బాత్రూంలో బోల్డుగా దిశా పటానీ సెల్ఫీ: వామ్మో అందాలు మొత్తం చూపిస్తూ ఘాటుగా!

  మరోసారి యాంకర్‌గా... శ్రీదేవి కోసం సత్తా

  మరోసారి యాంకర్‌గా... శ్రీదేవి కోసం సత్తా

  సుదీర్ఘ కాలంగా జబర్ధస్త్ షోలో కమెడియన్‌గా కడుపుబ్బా నవ్విస్తోన్న సుడిగాలి సుధీర్.. ఆ మధ్య ‘పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారాడు. అందులోనూ తన మార్క్‌ను చూపించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇలా హోస్టింగ్ కూడా చేస్తూ వచ్చాడు. కానీ, ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో మరోసారి యాంకర్‌గా ఎంట్రీ మారాడు. అందులో ప్రత్యేకమైన మేనరిజంతో హోస్టింగ్ చేస్తూ సందడి చేస్తున్నాడు. దీంతో అతడికి మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలిసింది.

  చిరంజీవి బర్త్‌డే.. రాఖీ స్పెషల్‌గా ప్రోగ్రామ్

  చిరంజీవి బర్త్‌డే.. రాఖీ స్పెషల్‌గా ప్రోగ్రామ్

  వచ్చే వారం ప్రసారం కాబోతున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆరోజు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుతో పాటు రాఖీ పండుగ కూడా వచ్చింది. దీంతో ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని మరింత స్పెషల్‌గా ఆ ఎపిసోడ్‌ను రూపొందించారు.

  దీనికి జబర్ధస్త్ కమెడియన్ల సోదరీమణులు ఎంట్రీ ఇచ్చి వాళ్లందరికీ రాఖీలను కట్టారు. అలాగే, కమెడియన్లు అందరూ చిరంజీవి పాటలకు స్టెప్పులు వేస్తూ అలరించారు. దీంతో ఈ ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమో వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  Intinti Gruhalakshmi August 17th Episode: లాస్యను బుక్ చేసిన తులసి.. ఆమె ప్లాన్‌తో ప్రేమజంటకు షాక్

  సుడిగాలి సుధీర్ సీక్రెట్‌ గురించి అక్కతోనే

  సుడిగాలి సుధీర్ సీక్రెట్‌ గురించి అక్కతోనే

  ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో భాగంగా కమెడియన్ల అక్కలు, చెల్లెల్లు రాఖీలను పట్టుకుని వచ్చారని ముందే చెప్పుకున్నాం. ఇక, ఇందులో హోస్ట్ కమ్ జబర్ధస్త్ టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్‌ కోసం వాళ్ల అక్క ఎంట్రీ ఇచ్చారు. అప్పుడామె అతడి గురించి చెబుతూ.. ‘మా ఇద్దరికీ ఒక సంవత్సరమే ఏజ్ గ్యాప్ ఉంది. బ్రదర్ సిస్టర్ కంటే స్నేహితులు గానే ఎక్కువ ఉంటాము. ఇది అది అని కాకుండా అన్ని విషయాలూ షేర్ చేసుకుంటాం' అని చెప్పింది. అప్పుడు గెటప్ శ్రీను ‘అన్నీ చేసుకోలేదు.. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నాకు తెలుసు.. నేను నీకు చెబుతా' అంటూ షాకిచ్చాడు.

  ఏకంగా మూడు పెళ్లిళ్లు అంటూ షాకిచ్చేలా

  ఏకంగా మూడు పెళ్లిళ్లు అంటూ షాకిచ్చేలా

  గెటప్ శ్రీను సీక్రెట్లు చెబుతానంటూ చెప్పగానే అక్కడున్న వాళ్లంతా నవ్వుకోగా.. సుడిగాలి సుధీర్ మాత్రం షాక్ అయ్యాడు. ఇక, ఆ తర్వాత ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ.. ‘అక్క వీడి పెళ్లి కోసం ఇప్పటికి మూడు సార్లు కెనడా నుంచి వచ్చింది. పాపం ఫ్లైట్ చార్జీలు కన్నం.

  ఆ డబ్బులతో వీడికి మూడు పెళ్లిళ్లు అయ్యేవి' అంటూ పర్సనల్ సీక్రెట్‌ను రివీల్ చేశాడు. ఇలా ఈ ప్రోమో వీడియోలో సుడిగాలి సుధీర్ పెళ్లి ప్రస్తావన రావడంతో ప్రస్తుతం ఇది బుల్లితెర వర్గాల్లో చర్చనీయాంశం అయిపోయింది. ఫలితంగా ఇతగాడి పేరు మరోసారి మారుమ్రోగిపోతోంది.

  English summary
  Telugu Actor and a Stand-up comedian Sudigali Sudheer Recently Paticipated in Sridevi Drama Company. Getup Srinu and Auto Ram Prasad Revealed his Marriage Secret In This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X