For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గెటప్ శ్రీను అందుకే కనిపించట్లేదు: వాళ్ల వల్లే జబర్ధస్త్‌కు దూరం.. మేటర్ లీక్ చేసిన కమెడియన్

  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో జబర్ధస్త్‌ది ప్రత్యేకమైన స్థానం అనే చెప్పాలి. దీనికి కారణం.. ఇది ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా ప్రసారం అవడంతో పాటు కొన్ని వందల మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అందుకే ఈ షో అంటే ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఇక, దీని ద్వారా వెలుగులోకి వచ్చిన ఆర్టిస్టుల్లో గెటప్ శ్రీను ఒకడు. ఎంతో కాలంగా ఇందులో తన హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడతను. ఇలాంటి సమయంలో కొద్ది రోజులుగా ఈ కమెడియన్ షోలో కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై శ్రీను క్లారిటీ ఇచ్చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
  మిమిక్రీ ఆర్టిస్టు నుంచి కమెడియన్‌లా

  మిమిక్రీ ఆర్టిస్టు నుంచి కమెడియన్‌లా

  కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్టుగా పని చేసేవాడు శ్రీను. ఈ క్రమంలోనే ఎన్నో ఈవెంట్లలో స్టార్లను ఇమిటేట్ చేస్తూ మెప్పించాడు. అలా జబర్ధస్త్ కమెడియన్ వేణు ద్వారా ఆ షోలోకి అడుగు పెట్టాడు. అలా బుల్లితెరపై తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన శ్రీను.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని ఎత్తుకు ఎదిగాడు. ఆ తర్వాత సుడిగాలి సుధీర్, రాంప్రసాద్‌తో కలిసి టీమ్‌గా ఏర్పడ్డాడు.

  స్కిట్ స్కిట్‌కు వైవిధ్యం.. అందుకే పేరు

  స్కిట్ స్కిట్‌కు వైవిధ్యం.. అందుకే పేరు

  జబర్ధస్త్‌లో ఉన్న కమెడియన్లలో ఒక్కొక్కరికీ ఒక్కో భిన్నమైన శైలి, గుర్తింపు ఉన్నాయి. అందులో శ్రీనుకు మాత్రం గెటప్‌ల స్పెషలిస్టుగా పేరొచ్చింది. దీనికి కారణం అతడు స్కిట్ స్కిట్టుకూ వైవిధ్యాన్ని చూపించేలా గెటప్‌లో వేయడమే. అంతేకాదు, విభిన్నమైన శైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అందుకే అతడికి అంత మంచి పేరు వచ్చిందన్న విషయం తెలిసిందే.

  సినిమాల్లోనూ సత్తా.. స్టార్లతోనే చేస్తూ

  సినిమాల్లోనూ సత్తా.. స్టార్లతోనే చేస్తూ

  సుదీర్ఘమైన ప్రయాణంలో జబర్ధస్త్‌తో పాటు మరెన్నో షోలలో పని చేశాడు గెటప్ శ్రీను. ఈ క్రమంలోనే పాపులారిటీతో పాటు సినిమాల్లో అవకాశాలు కూడా అందుకున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించాడు. అందులో ‘ఖైదీ నెంబర్ 150', ‘ఇస్మార్ట్ శంకర్', ‘గ్యాంగ్ లీడర్', ‘రంగస్థలం', ‘దిక్కులు చూడకు రామయ్య', ‘సినిమా చూపిస్త మావా', ‘జాంబీ రెడ్డి' చిత్రాలు పేరు తెచ్చాయి.

  హీరోగా మారాడు.. సోలోగా వస్తుండు

  హీరోగా మారాడు.. సోలోగా వస్తుండు

  ఆ మధ్య గెటప్ శ్రీను.. సుడిగాలి సుధీర్.. రాంప్రసాద్‌తో కలిసి ‘త్రీ మంకీస్' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇక, ఇప్పుడు ‘రాజు యాదవ్' అనే మూవీతో సోలో హీరోగా చేస్తున్నాడు. ‘నీది నాది ఒకే క‌థ‌', ‘విరాట‌ప‌ర్వం' చిత్రాల‌కు చీఫ్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన కృష్ణ‌మాచారి దీన్ని తెరకెక్కిస్తున్నాడు. అంకిత క‌ర‌త్ హీరోయిన్‌. ఇటీవల వచ్చిన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది.

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

  వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్నప్పటికీ.. గెటప్ శ్రీను సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటుంటాడు. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటాడు. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నాడు.

  బుల్లితెరపై కనిపించని జబర్ధస్త్ శ్రీను

  బుల్లితెరపై కనిపించని జబర్ధస్త్ శ్రీను

  చాలా కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న గెటప్ శ్రీను.. కొద్ది రోజులుగా జబర్ధస్త్ సహా ఏ షోలోనూ కనిపించడం లేదు. దీంతో అతడు ఎందుకు షోలకు దూరం అయ్యాడన్న అనుమానం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. అదే సమయంలో ఈ టాప్ కమెడియన్‌కు ఏదైనా సమస్య వచ్చిందా? లేక షో నిర్వహకులతో గొడవలు అయ్యాయా? అని అంతా చర్చించుకుంటున్నారు.

  అందుకే కనిపించడంలేదు.. వాళ్ల వల్లే

  అందుకే కనిపించడంలేదు.. వాళ్ల వల్లే

  తనపై వస్తున్న వార్తలకు తాజాగా గెటప్ శ్రీను స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ‘అందరికీ నమస్కారం. మూవీ షూట్ తర్వాత మా టీమ్‌లోని కొందరికి కరోనా వచ్చింది. దీంతో నేను టెస్ట్ చేయించుకున్నా. నాకు నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ కొద్ది రోజులుగా హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నా. అందుకే జబర్ధస్త్‌లో కనిపించట్లేదు. 18న వచ్చే ఎపిసోడ్‌తో కలుద్దాం' అంటూ పేర్కొన్నాడు.

  English summary
  Comedian Getup Srinu not appearing in Jabardasth Show Since One Month. Now He Gave Clarity on This in Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X