Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సుధీర్ గురించి గెటప్ శ్రీనుకు నెటిజన్ సూటి ప్రశ్న: వంద శాతం నిజమే అంటూ ఊహించని సమాధానం
తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు.. ఇస్తున్నారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే బిగ్ సెలెబ్రిటీలుగా ఎదుగుతున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్ గెటప్ శ్రీను పేరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు ఏడేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను తనదైన శైలి కామెడీతో అలరిస్తూ దూసుకుపోతున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఫలితంగా వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా గెటప్ శ్రీను.. సుడిగాలి సుధీర్‌పై గురించి ఓ విషయాన్ని తేల్చి చెప్పేశాడు. ఆ సంగతులు మీకోసం!
అలా మొదలైన కెరీర్.. ఇలా పాపులారిటీ
ప్రస్తుతం టాప్ కమెడియన్‌గా వెలుగొందుతోన్న శ్రీను.. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్లను ఇమిటేట్ చేస్తూ ఎన్నో ఈవెంట్లలో ప్రదర్శన ఇచ్చాడు. అలా వేణు సహాయంతో జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి తనలోని అద్భుతమైన టాలెంట్‌ను చూపిస్తూ సత్తా చాటాడు. ఆ తర్వాత సుధీర్, రాంప్రసాద్‌తో కలిసి టీమ్‌గా సాగుతున్నాడు.
గెటప్‌ల స్పెషలిస్ట్.. స్కిట్ స్కిట్‌కూ కొత్తగా
జబర్ధస్త్ షోలోని కమెడియన్లు అందరిలోనూ అద్భుతమైన టాలెంట్ ఉంది. అందులో శ్రీనుకు మాత్రం ప్రత్యేకంగా గెటప్‌ల స్పెషలిస్టు అనే పేరుంది. స్కిట్ స్కిట్‌కూ తనలోని వైవిధ్యమైన నటనను చూపిస్తూ పాత్రలను చేయడం వల్లే ఈ పేరు సొంతమైంది. అదే సమయంలో ఎన్నో రకాల మేనరిజాలాతో ప్రేక్షకులకు మజాను పంచుతున్నాడు. తద్వారా బెస్ట్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు.
టాలీవుడ్లో బిజీ కమెడియన్‌గా మారాడు
తన కెరీర్లో జబర్ధస్త్ మాత్రమే కాదు.. ఎన్నో టీవీ షోలలో గెటప్ శ్రీను భాగం అయ్యాడు. అదే సమయంలో సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేశాడు. వాటిలో 'ఖైదీ నెంబర్ 150', 'ఇస్మార్ట్ శంకర్', 'గ్యాంగ్ లీడర్', 'రంగస్థలం', 'దిక్కులు చూడకు రామయ్య', 'సినిమా చూపిస్త మావా', 'జాంబీ రెడ్డి' వంటి చిత్రాలు గుర్తింపు తెచ్చాయి.
హీరోగా రాబోతున్న జబర్ధస్త్ కమెడియన్
క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాదు.. గెటప్ శ్రీను.. సుడిగాలి సుధీర్, రాంప్రసాద్‌తో కలిసి 'త్రీ మంకీస్' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇక, ఇప్పుడు 'రాజు యాదవ్' అనే మూవీతో సోలో హీరోగా చేస్తున్నాడు. పలు చిత్రాలకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన కృష్ణమాచారి దీన్ని తెరకెక్కిస్తున్నాడు. అంకిత కరత్ హీరోయిన్. ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
అందులో బిజీగా.. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్
చేతి నిండా షోలు, సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉండే గెటప్ శ్రీను.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు.
Recommended Video
సుధీర్ కెప్టెన్సీపై గెటప్ శ్రీను రియాక్షన్ ఇదే
తాజాగా నిర్వహించిన సెషన్లో ఓ నెటిజన్ 'మీ ఉద్దేశం ప్రకారం సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్‌గా ఉండడానికి అర్హుడేనా' అని గెటప్ శ్రీనును సూటిగా ప్రశ్నించాడు. దీనికి అతడు 'వందకు వంద శాతం' అంటూ స్పష్టం చేశాడు. తద్వారా సుడిగాలి సుధీర్ కెప్టెన్సీ గురించి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేశాడు. అదే సమయంలో అతడిపై ఉన్న ప్రేమను మరోసారి నిరూపించాడు గెటప్ శ్రీను.