twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న్యూస్ రీడర్ దేవి నాగవల్లిపై గెటప్ శ్రీను సెటైర్.. అదే బూతుతో దారుణంగా ట్రోల్..

    |

    జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకని ఆ తర్వాత సినిమాల్లో కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నాడు గెటప్ శ్రీను. అయితే అప్పుడప్పుడు గెటప్ శ్రీను చేసే కొన్ని స్కిట్స్ కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక రీసెంట్ గా ప్రముఖ న్యూస్ రీడర్ దేవి నాగవల్లిని కూడా ఎవరూ ఊహించని విధంగా ఇమేటెట్ చేస్తూ ఒక కామెడీ ప్రోగ్రాం చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక అందులో మరొక ప్రముఖ నటుడు ఇంగ్లీష్ లో బూతులు మాట్లాడుతూ ఆ కామెడీ ప్రోగ్రాం ను మరింత వైరల్ అయ్యేలా చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

    కాంట్రవర్సీ డిబేట్

    కాంట్రవర్సీ డిబేట్

    కొన్ని వారాల క్రితం ప్రముఖ న్యూస్ రీడర్ దేవి నాగవల్లి యువ హీరో విశ్వక్సేన్ తో నిర్వహించిన ఒక డిబేట్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. అందులో ఆమె హీరోను గెటవుట్ అని తిట్టడం అలాగే హీరో కూడా ఇంగ్లీష్ లో బూతులు మాట్లాడుతూ ఆ లైవ్ డిబేట్ ను వైరల్ అయ్యేలా చేశారు. మొత్తానికి ఆ లైవ్ డిబేట్ అయితే అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు బజ్ అయితే క్రియేట్ చేసింది.

    గెటప్ శ్రీను ట్రోల్

    గెటప్ శ్రీను ట్రోల్

    అయితే దేవి నాగవల్లి ప్రవర్తించిన తీరుపై కూడా సోషల్ మీడియాలో అనేక రకాల ట్రోలింగ్స్ అయితే వచ్చాయి. ఇక ఆ విషయాన్ని అందరూ మరిచిపోతున్న తరుణంలో ఊహించని విధంగా గెటప్ శ్రీను ఆమెను ఇమిటేట్ చేస్తూ ఆ ట్రోలింగ్స్ మరింత బూస్ట్ తెచ్చినట్లు అయింది. ఏమాత్రం సందేహం లేకుండా దాదాపు అదే తరహాలో ఆమెను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశాడు.

    వెన్నెల కిషోర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్

    వెన్నెల కిషోర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్

    న్యూసెన్స్ న్యూస్ అంటూ చెప్పడమే కాకుండా ఆ ప్రోగ్రాం లో నే ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఇంగ్లీష్ పదం బూతు అర్థం వచ్చేలా అటుఇటుగా మాట్లాడడం కూడా హైలెట్ గా నిలిచింది. ఇక గెటప్ శ్రీను అయితే తన పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని మరొక నటుడు సత్యపై కూడా విసిరి కొట్టడం కామెడీగానే అనిపించింది.

    వీడియో వైరల్

    వీడియో వైరల్

    మొత్తానికి వీరు చేసిన ఒక ప్రమోషనల్ స్కిట్ అయితే బాగానే క్లిక్ అయింది. మత్తు వదలరా దర్శకుడు రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ సత్య ప్రముఖ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి అంటూ సరదాగా చేసిన ప్రమోషనల్ వీడియో వైరల్ అయింది.

    గెటప్ శ్రీను కామెడీగా..

    గెటప్ శ్రీను కామెడీగా..

    అయితే ఈ వీడియో దేవి నాగవల్లి కి సెటైరికల్ గానే ఉంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా గెటప్ శ్రీను తన ఇంట్రడక్షన్ దేవి ప్రసాద్ తమన్ అంటూ వివరణ ఇవ్వడం కూడా హైలెట్ గా నిలిచింది.. ప్రమోషనల్ వీడియోలు ఎవరికివారు మేమే హీరో అంటూ గొడవ పడిన విధానం కూడా కొన్ని రియల్ టీవీ డిబేట్స్ ఆధారంగా చేసుకొని కామెడీగా హైలెట్ చేశారు. హ్యాపీ బర్త్ డే సినిమా జూలై 8 వ తేదీన విడుదల కాబోతోంది మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Getup srinu imitating devi nagavalli controversial debate for movie promotion,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X