సుమకు అదిరిపోయే పంచ్‌లు వేసిన గెటప్ శీను.. చీ చీ ముట్టుకోకు అన్న జబర్దస్త్ వేణు
బుల్లి తెరను తరతరాలుగా ఏలేస్తున్న మకుటం లేని మహారాణి సుమ.. ఏ షో చేసిన అది హిట్టే. స్టార్ మహిళ అంటూ ఎన్నో రికార్డులను సృష్టించిన సుమ.. బుల్లి తెర ప్రేక్షకులను దత్తత తీసుకున్నట్లు కనిపిస్తోంది. నిరంతరం వారిని నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.
తాజాగా స్టార్ మా చానెల్‌లో ఎఫ్3 అనే షో ప్రసారం అవుతోన్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీల ఫ్యామిలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటోంది. తాజాగా ఈ షోలో జబర్దస్త్ ఫేమ్ గెటప్ శీను, వేణు తమ తమ కుటుంబ సభ్యులతో ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిద్దరితో పాటు సుమ కూడా ఉండటంతో ఎంటర్టైన్మెంట్‌కు కొదవే లేకుండా పోయింది.

గెటప్ శీను వేసిన పంచ్‌లకు సుమ నోట వెంట మాటరాలేదు. ఇక గెటప్‌లకు ఎంతో ఫేమస్ అయిన శీను.. చిత్ర విచిత్రంగా ప్రవర్తించడంతో.. చీ చీ ముట్టుకోకు అంటూ వేణు కసురుకున్నాడు. నేషనల్ జియోగ్రాఫిక చానెల్‌లో వచ్చే డబ్బింగ్ వాయిస్‌లను అనుకరించారు. దీంతో అందరూ పగలబడి నవ్వారు. చివరకు గెటప్ శీను.. ఇస్మార్ట్ శంకర్ స్టెప్పులను వేసి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. ఇక వీరు చేసిన కామెడీని పంచిన ఎంటర్టైన్మెంట్‌ను పూర్తిగా చూడాలంటే షో ప్రసారమయ్యే వరకు ఆగాలి.


Click it and Unblock the Notifications











