For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్‌లోకి గెటప్ శ్రీను రీఎంట్రీ: ఫస్ట్ స్కిట్‌లోనే అతడికి అవమానం.. మళ్లీ వెళ్లిపోతాడా!

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసులు దోచుకుని ప్రత్యేకమైనవి నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన షోలలో జబర్ధస్త్ ఒకటి. సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఈ షో.. తెలుగులో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. దీని ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో గెటప్ శ్రీను ఒకడు. ఎంతో కాలంగా ఇందులో తన హవాను చూపిస్తూ ఫుల్ పాపులర్ అయ్యాడు. కానీ, కొద్ది రోజులుగా ఈ కమెడియన్ షోలో కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా గెటప్ శ్రీను జబర్ధస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ, అంతలోనే షాక్ తగిలింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  అలా మొదలైన శ్రీను ప్రయాణం

  అలా మొదలైన శ్రీను ప్రయాణం


  శ్రీను కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్టుగా పని చేసేవాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఈవెంట్లలో స్టార్లను ఇమిటేట్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ క్రమంలోనే కమెడియన్ వేణు ద్వారా జబర్ధస్త్ షోలోకి అడుగెట్టాడు. అలా బుల్లితెరపై తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన శ్రీను.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని ఎత్తుకు ఎదిగాడు. దీంతో పేరు, ప్రఖ్యాతలను అందుకున్నాడు.

  పొట్టి డ్రెస్‌తో షాకిచ్చిన భూమిక: వామ్మో అలా పడుకుని అందాల విందు

  గెటప్‌లనే ఇంటిపేరు చేసుకుని

  గెటప్‌లనే ఇంటిపేరు చేసుకుని

  జబర్ధస్త్‌ షోలోని కమెడియన్లలో ఒక్కొక్కరికీ ఒక్కో భిన్నమైన శైలి, గుర్తింపు ఉన్నాయి. అందులో శ్రీనుకు మాత్రం గెటప్‌ల స్పెషలిస్టుగా పేరొచ్చింది. దీనికి కారణం అతడు స్కిట్ స్కిట్టుకూ వైవిధ్యాన్ని చూపించేలా గెటప్‌లో వేయడమే. అంతేకాదు, విభిన్నమైన శైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అందుకే శ్రీనుకు అంత మంచి పేరు వచ్చిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  సినిమాల్లో సత్తా.. భారీ చిత్రాల్లో

  సినిమాల్లో సత్తా.. భారీ చిత్రాల్లో

  తన ప్రయాణంలో శ్రీను జబర్ధస్త్‌తో పాటు మరెన్నో షోలలో పని చేశాడు. ఈ క్రమంలోనే సినిమాల్లో అవకాశాలు కూడా అందుకున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించాడు. అందులో 'ఖైదీ నెంబర్ 150', 'ఇస్మార్ట్ శంకర్', 'గ్యాంగ్ లీడర్', 'రంగస్థలం', 'దిక్కులు చూడకు రామయ్య', 'సినిమా చూపిస్త మావా', 'జాంబీ రెడ్డి' అతడికి పేరు తెచ్చాయి.

  స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన ప్రియాంక: అబ్బో తడిచిన అందాలను చూపిస్తూ!

   సోలో హీరోగా మారిన గెటప్ శ్రీను

  సోలో హీరోగా మారిన గెటప్ శ్రీను

  గెటప్ శ్రీను.. సుడిగాలి సుధీర్.. రాంప్రసాద్‌తో కలిసి 'త్రీ మంకీస్' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇక, ఇప్పుడు 'రాజు యాదవ్' అనే మూవీతో సోలో హీరోగా చేస్తున్నాడు. 'నీది నాది ఒకే క‌థ‌', 'విరాట‌ప‌ర్వం' చిత్రాల‌కు చీఫ్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన కృష్ణ‌మాచారి దీన్ని తెరకెక్కిస్తున్నాడు. అంకిత క‌ర‌త్ హీరోయిన్‌. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కాబోతుంది.

  జబర్ధస్త్‌తో పాటు వాటికి దూరం

  జబర్ధస్త్‌తో పాటు వాటికి దూరం

  సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న గెటప్ శ్రీను.. కొద్ది రోజులుగా జబర్ధస్త్ సహా ఏ షోలోనూ కనిపించడం లేదు. దీంతో అతడు ఎందుకు షోలకు దూరం అయ్యాడన్న అనుమానం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. అదే సమయంలో ఈ టాప్ కమెడియన్‌కు జబర్ధస్త్ నిర్వహకులతో ఏదైనా సమస్య వచ్చిందా? లేక డేట్స్ ఖాళీ లేకనే దూరమయ్యాడా? అని అనుకుంటున్నారు.

  తల్లైన తర్వాత మరో యాక్టర్‌తో హీరోయిన్ ఎఫైర్: బెడ్‌పై రొమాన్స్ చేసే పిక్ వైరల్

  జబర్ధస్త్‌లోకి గెటప్ శ్రీను రీఎంట్రీ

  జబర్ధస్త్ షో ద్వారా సెలెబ్రిటీగా మారిన వారిలో గెటప్ శ్రీను ఒకడు. చాలా ఏళ్ల పాటు ఇందులో సందడి చేసిన అతడు.. ఎన్నో నెలలుగా ఈ షోలో కనిపించడం లేదు. దీంతో సుధీర్ మాదిరిగా వేరే ఛానెల్‌లోకి వెళ్లిపోతాడేమో అని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా గెటప్ శ్రీను జబర్ధస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

  ఫస్ట్ స్కిట్‌లోనే శ్రీనుకి అవమానం

  ఫస్ట్ స్కిట్‌లోనే శ్రీనుకి అవమానం


  ఆటో రాంప్రసాద్ తన కొత్త టీమ్‌తో కలిసి స్కిట్ చేస్తోన్న సమయంలో గెటప్ శ్రీను సర్‌ప్రైజింగ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. అనంతరం వాళ్లంతా వెళ్లి మరో స్కిట్ చేస్తామని చెప్పారు. ఆ సమయంలో సీనియర్ నటి అన్నపూర్ణ తనదైన పంచులతో గెటప్ శ్రీనుకు కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. మొత్తానికి అతడి రాకతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది

  English summary
  Comedian Getup Srinu not appearing in Jabardasth Show Since Few Months. Now He Did Re Entry to This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X