రష్మీ సుధీర్ గురించి నోరు జారిన గెటప్ శ్రీను: వాళ్లిద్దరి మధ్య ఒప్పందం.. అలా తిరిగారంటూ బాంబేశాడు!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది తమ తమ టాలెంట్లను నిరూపించుకుని స్టార్లుగా ఎదిగిపోయారు. వీరిలో చాలా మంది షోల ద్వారా పరిచయం అయిన వాళ్లే ఉన్నారు. అందులోనూ అందరూ స్వతహాగా పాపులారిటీని సంపాదించుకుంటే.. ఓ ఇద్దరు మాత్రమే జంటగా ఫేమస్ అయ్యారు. వాళ్లే.. జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్.. హాట్ యాంకర్ రష్మీ గౌతమ్. చాలా కాలంగా బుల్లితెర జోడీగా వెలుగొందుతోన్న వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రష్మీ సుధీర్ గురించి నోరు జారాడు టాప్ కమెడియన్ గెటప్ శ్రీను. ఆ వివరాలు మీకోసం!

పొట్టి బట్టలతో టాలీవుడ్ పాపులర్ యాంకర్ ఫోటోషూట్ (ఫొటోలు)

అలా పరిచయం.. ఇద్దరికీ ఒకేసారి సక్సెస్

అలా పరిచయం.. ఇద్దరికీ ఒకేసారి సక్సెస్

కెరీర్ ఆరంభంలోనే పలు సినిమాల్లో నటించిన రష్మీ గౌతమ్.. జబర్ధస్త్ అనే షో ద్వారా యాంకర్‌గా పరిచయం అయింది. దీంతో తక్కువ సమయంలోనే విపరీతంగా పాపులర్ అయింది. అదే షోతో తన టాలెంట్ నిరూపించుకుని స్టార్‌డమ్‌ను అందుకున్నాడు సుడిగాలి సుధీర్. తమ తమ విభాగాల్లో సత్తా చాటుతోన్న ఈ ఇద్దరూ.. బుల్లితెరపై ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు.

షర్ట్ బటన్ విప్పేసి షాక్ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్

అందరికీ భిన్నంగా పాపులర్ అయిన జోడీ

అందరికీ భిన్నంగా పాపులర్ అయిన జోడీ

తమ తమ టాలెంట్లతో తెలుగు బుల్లితెరపై టాప్ ప్లేస్‌కు ఎదిగిపోయారు రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్. అందరిలా కాకుండా వీళ్లిద్దరూ జంటగా ఎక్కువగా ఫేమస్ అయ్యారు. అందుకే వీళ్లిద్దరి ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. దీంతో ఈ జంట మధ్య ప్రేమాయణం సాగుతుందన్న టాక్ కూడా వినిపించింది. దీంతో వీళ్లు యూట్యూబ్ జోడీగా పేరొందుకుని తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతున్న జీనల్ జోషి

ఏమీ లేదంటూ అలా హల్‌చల్ చేస్తున్నారు

ఏమీ లేదంటూ అలా హల్‌చల్ చేస్తున్నారు

తమ మధ్య స్నేహం తప్ప ఏలాంటి బంధమూ లేదని అటు రష్మీ గౌతమ్.. ఇటు సుడిగాలి సుధీర్ ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. కానీ, తరచూ తమ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు నటిస్తూ ప్రేక్షకులను అయోమయానికి గురి చేస్తున్నారు. వీళ్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు షో నిర్వహకులు తరచూ రొమాంటిక్ యాక్టులు చేపిస్తుండడంతో లవ్ ట్రాక్ నిజమేనన్న టాక్ వినిపిస్తోంది.

మనసులో మాట చెప్పిన సుడిగాలి సుధీర్

మనసులో మాట చెప్పిన సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్ విషయంలో రష్మీ మొదటి నుంచీ క్లారిటీగానే ఉంది. అతడు తనకు ఫ్రెండ్ మాత్రమేనని చెబుతూనే ఉంది. అయితే, సుధీర్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే, ఇది స్క్రీన్ వరకే అని చెబుతుంటాడు. నిజానికి తనకు ఆఫర్లు రావడానికి, పేరు ప్రతిష్టలు పెరగడానికి యాంకర్ రష్మీనే కారణం అని సుధీర్ ఎన్నో సందర్భాల్లో ఒప్పుకున్నాడు కూడా.

పెళ్లి కొడుకులా మారిన సుధీర్.. రష్మీ అలా

పెళ్లి కొడుకులా మారిన సుధీర్.. రష్మీ అలా

వచ్చే వారం ప్రసారం కానున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో సుడిగాలి సుధీర్ పెళ్లి కొడుకు గెటప్‌తో షాకిచ్చాడు. అంతేకాదు, ఎవరికి చెప్పకుండానే వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పాడు. దీంతో టీమ్ సభ్యులైన గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సన్నీలు అతడి పెళ్లిని చెడగొట్టాలని ప్లాన్ చేస్తారు. ఇందుకోసం యాంకర్ రష్మీ గౌతమ్ సహాయం తీసుకున్నారు.

రష్మీ సుధీర్ గురించి నోరు జారిన గెటప్ శ్రీను

రష్మీ సుధీర్ గురించి నోరు జారిన గెటప్ శ్రీను

సుధీర్... రష్మీ వ్యవహారాన్ని ఖండిస్తున్నా.. చాలా మందిలో మాత్రం వీళ్లిద్దరూ ప్రేమికులేనన్న అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీంతో ఈ జంటను ప్రత్యేకంగా చూస్తుంటారు. ఇది షోల టీఆర్పీ రేటింగ్‌కూ బాగానే ఉపయోగపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ - రష్మీ గౌతమ్ మధ్య ఉన్న బంధం గురించి గుట్టు విప్పాడు జబర్ధస్త్ కమెడియన్ గెటప్ శ్రీను.

 వాళ్లిద్దరి మధ్య ఒప్పందం.. అలా తిరిగారంటూ

వాళ్లిద్దరి మధ్య ఒప్పందం.. అలా తిరిగారంటూ

స్కిట్‌లో భాగంగా సుధీర్ పెళ్లిని చెడగొట్టేందుకు గెటప్ శ్రీను విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఇందులో భాగంగానే వాళ్లిద్దరూ కలిసి తిరిగారని, పబ్బులకు, చాలా టూర్లకు వెళ్లాడని చెబుతాడు. దీంతో సుధీర్‌తో సహా అక్కడున్న వాళ్లంతా షాకైపోయారు. అప్పుడు నాలుక కరుచుకున్న శ్రీను.. టాపిక్ డైవర్ట్ చేశాడు. దీంతో ఈ ప్రోమో యూట్యూబ్‌లో విపరీతంగా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X