సుధీర్, రష్మీ లవ్ ట్రాక్‌లో ట్విస్ట్ అదే.. గెటప్ శ్రీను నోట అసలు నిజం

Sudigali Sudheer- Rashmi: తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. జబర్ధస్త్ షోకు హీరో- హీరోయిన్స్ లెక్క. వారిద్దరూ కలిస్తే.. సంథింగ్ స్పెషలే.. వారి అద్భుతమైన కామెడీ టైమింగ్‌, కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఇట్టే అట్రాక్ట్ చేస్తారు. టీవీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుని బుల్లితెర బెస్ట్ కపుల్‌గా మారారు. తెరపై మెరిసిన ఈ జంట నిజంగానే ప్రేమలో ఉన్నారా? అనే ప్రశ్న చాలా మంది ప్రేక్షకుల్లో మొదలైంది. కొందరు మంది అయితే.. వీళ్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించారు. తాజాగా సుధీర్, రష్మీల మధ్య ఉన్న లవ్ ట్రాక్ పై బజర్థస్త్ గెటప్ శ్రీను క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

యాంకర్ రష్మీ.. మొదట సినిమా నటి గానే ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత జబర్ధస్త్ యాంకర్‌గా బుల్లితెరపై సిర్థపడింది. అదే సమయంలో కమెడియన్‌గా వచ్చిన సుధీర్ తన వినూత్న హాస్యంతో, ఎనర్జీతో టీమ్ లీడర్‌గా ఎదిగి, అందరి అభిమానాన్ని గెలుచుకున్నాడు. జబర్థస్త్ షోలో వీళ్లిద్దరి మధ్య ప్రారంభమైన రొమాంటిక్ ట్రాక్ ఎంతగానో ఆకట్టుకుంది. షో టీమ్స్ కూడా ఈ క్రేజ్‌ను వాడుకుంటూ, వీళ్లతో ప్రత్యేక స్కిట్‌లు, ప్రేమ యాక్ట్స్ చేయిస్తూ ప్రేక్షకులను కట్టిపడేశారు. స్క్రీన్‌పై హగ్గులు, రొమాంటిక్ సన్నివేశాలు, ఆటపాటలతో బెస్ట్ ఫెయిర్ గా గుర్తింపు పొందారు.

Getup Srinu Reveals shocking Facts About Sudigali Sudheer And Rashmi Love Track

ఈ జంట అత్యంత సన్నిహితంగా ఉండటంతో వీళ్లిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా? పెళ్లి చేసుకోబోతున్నారా? అనే ప్రశ్న ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. కొందరుమంది అయితే.. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసేశారు. ఈ విషయంపై రష్మీ-సుధీర్ ఇద్దరూ పలు ఇంటర్వ్యూల్లో "మేము మంచి స్నేహితులం మాత్రమే" అని స్పష్టం చేశారు. అయినా రియల్ లైఫ్‌లో వేరుగా, రీల్ లైఫ్‌లో మరోలా ఉండటంతో అభిమానుల్లో అయోమయంలో పడ్డారు.

తాజాగా జబర్ధస్త్ ఫేమ్ గెటప్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌, జబర్ధస్త్ ప్రయాణం, అలాగే సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ జంటపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొదట ఆయన రాంప్రసాద్ గురించి మాట్లాడుతూ.. "వాడితో కలిసి పనిచేయడం నా అదృష్టం. గెటప్ శ్రీనుకు వచ్చిన పేరు, గుర్తింపు అన్నీ రాంప్రసాద్ కలం వల్లే.. వాడు రాసిన స్కిట్స్‌కి నటించడం నా పూర్వజన్మ సుకృతం" అని భావోద్వేగంగా అన్నారు. అంతేకాకుండా, "జబర్ధస్త్‌లో సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ పండడానికి, ఆ జంటకు ఇంత క్రేజ్ రావడానికి కారణం రాంప్రసాదే. మా టీంను భుజాల మీద మోసేది వాడే "అని రామ్ ప్రసాద్ ను ప్రశంసించారు. తాను 400 ఎపిసోడ్‌లు పూర్తి చేసినప్పుడు రాంప్రసాద్‌ కాళ్లు మొక్కానని చెప్పిన గెటప్ శ్రీను.. "పది సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు ఇంత మంచి కంటెంట్‌ ఇవ్వడం ఎవరి తరం కాదు" అని సెల్యూట్ చేశారు.

ఇదే ఇంటర్వ్యూలో యాంకర్ "సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ నిజమేనా?" అని అడగగా, గెటప్ శ్రీను నవ్వుతూ "ఆ లవ్ ట్రాక్ క్రియేట్ చేసింది రాంప్రసాద్‌నే"అని సరదాగా సమాధానమిచ్చాడు. యాంకర్‌ మళ్లీ "నిజంగానే ప్రేమలో ఉన్నారా?" అని ప్రశ్నించగా, "చూడ్డానికి బాగుంది కదా! అది నిజమా ? అబద్ధమా? అని పక్కన పెడితే వాళ్ల జంట చాలా సూపర్‌గా ఉంటుంది. వాళ్ళ జంటచూడ్డానికి బాగుంది కదా. త్వరలోనే ఆ జంట కలుస్తుందిలే " అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. మొత్తానికి, సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ అనేది నిజజీవిత ప్రేమకథ కాదని, జబర్ధస్త్ వంటి టీవీ షోలు తమ టీఆర్పీలను పెంచుకోవడానికి ఇలాంటి రొమాంటిక్ స్కిట్స్‌ను ప్లాన్ చేస్తుంటాయని గెటప్ శ్రీను ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. మరి సుధీర్-రష్మీ మనసులలో ఏముందో వారికే తెలియాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X