చిన్న తప్పు... రష్మి, సుధీర్ వ్యక్తిగత జీవితంపై ఎఫెక్ట్, పేరెంట్స్ బాధపడుతున్నారు!

Recommended Video

Getup Srinu Gives Clarification On Sudheer,Rashmi Affair

రష్మి, సుధీర్ మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, బయట ప్రచారం జరుగుతున్నదాంట్లో నిజం లేదు అని గెటప్ శ్రీను స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి వృత్తి పరంగా కలిసి షోలు చేయడం తప్ప... వ్యక్తిగతంగా వారి మధ్య ఏమీ లేదని తెలిపారు.

రష్మి ఆమె షూటింగులు, ఫ్యామిలీ వ్యవహారాలతో బిజీ బిజీగా ఉంటారు. ఆవిడకు ఒక లైఫ్ గోల్ కూడా ఉంది. చాలా ఇంటర్వ్యూల్లో కూడా రష్మి ఇదే విషయం చెప్పారు. సుధీర్ తనకు ఫ్రెండ్ మాత్రమే. మేము కూడా అంతే. రష్మి అంటే మంచి వ్యక్తి, మా కుటుంబంలో ఒక అమ్మాయిలా చూస్తామని గెటప్ శ్రీను తెలిపారు.

చిన్న తప్పు... అంతా రాంప్రసాద్ వల్లే

చిన్న తప్పు... అంతా రాంప్రసాద్ వల్లే

మాతో ఎవరితో అలాంటి రూమర్స్ రాకుండా సుధీర్ మీదనే రావడానికి మూల కారణం రాంప్రసాద్. సుధీర్-రష్మి మధ్య ఓ చిన్న ట్రాక్ పెట్టుకుందాం అని మొదలు పెట్టాడు. అలా అది కొనసాగుతూ మరో రకంగా టర్న్ అయింది. ‘వారు పెళ్లి చేసుకున్నారంట, పిల్లలంట, అదీ..ఇదీ అనే రూమర్స్ మొదలయ్యాయని గెటప్ శ్రీను తెలిపారు.

రష్మి-సుధీర్ వ్యక్తిగత జీవితంపై ఎఫెక్ట్... పేరెంట్స్ బాధ పడుతున్నారు

రష్మి-సుధీర్ వ్యక్తిగత జీవితంపై ఎఫెక్ట్... పేరెంట్స్ బాధ పడుతున్నారు

టీవీలో ఏ ఫ్రోగ్రాం వచ్చిన జనాలు వెంటనే నమ్మేస్తారు. ఇలా జరుగడంలో మా పొరపాటు కూడా ఉంది. చివరకు ఇది సుధీర్ పర్సనల్ జీవితం మీద పడింది. ఇది ఇద్దరికీ ఎఫెక్ట్ అయింది. రష్మి ఎప్పుడూ ఈ విషయం నాకు వ్యక్తిగతంగా చెప్పలేదు కానీ సుధీర్ ఫ్యామిలీ అయితే బాధపడుతూ ఉంటారు.

సుధీర్ పెళ్లి సంబంధాలకు ఈ రూమర్స్ అడ్డంకిగా...

సుధీర్ పెళ్లి సంబంధాలకు ఈ రూమర్స్ అడ్డంకిగా...

మొదట్లో ఇదంతా బాగానే ఉండేది కానీ పెళ్లి సంబంధాలు చూస్తుంటే రష్మి-సుధీర్ మధ్య ఏదో ఉందట కదా? అని అడిగితే ఎవరికైనా బాధేస్తుంది. కానీ వారి మధ్య వాస్తవంగా ఏమీ లేదు. ఈ విషయం మాకు తెలుసు. మేము క్రియేట్ చేసిన ఈ రాపో ఆన్ స్క్రీన్ వరకు ఓకే. అందరూ తెరపై ఈ జంట బావుందని మెచ్చుకున్నారు. సినిమాల్లో చాలా మంది హీరో హీరోయిన్ల జంట బావుందని అంటారు. అంత మాత్రాన అవి నిజాలు కావుకదా. ఇది కూడా అంతే.

2019లో సుధీర్ పెళ్లి

2019లో సుధీర్ పెళ్లి

సుధీర్‍‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. 2019లో అయిపోవాలి. అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే... సుధీర్-రష్మి మధ్య అలాందేమైనా ఉందనే భావన ఉంటే వెంటనే తీసేయండి. వారు నెలలో ఒకసారి ఫోన్ చేసుకోవమే ఎక్కువ. ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా ఉంటారు. స్క్రీన్ మీద ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడం జనాలు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని కంటిన్యూ చేశాం. కానీ దాని వల్ల ఇలా జరుగుతుందని ఊహించలేదని గెటప్ శ్రీను తెలిపారు.

రష్మి ఫ్యామిలీ కూడా చాలా ఫీలైంది

రష్మి ఫ్యామిలీ కూడా చాలా ఫీలైంది

ఇలాంటి రూమర్స్ రావడం వల్ల రష్మి ఫాదర్, మదర్, సిస్టర్ ఫీలయ్యారు. దీంతో పాటు ఇద్దరూ కలిసి ఓసారి టీవీ షోలో పెళ్లి ఈవెంట్ చేయడం కూడా ఈ రూమర్స్ ఎక్కువ కావడికి కారణమైంది. దయచేసి ఎవరూ వారి మధ్య ఏదో ఉందని ఊహించుకోవద్దు... ఒక స్నేహితుడిగా సుధీర్‌కు త్వరగా మంచి అమ్మాయి దొరికి పెళ్లి జరుగాలని కోరుకుంటున్నాను... అని గెటప్ శ్రీను ఆకాంక్షించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X