Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గెటప్ శ్రీను ఎకౌంట్స్ డర్టీ పిక్చర్స్.. పోలీసులకు ఫిర్యాదు
జబర్దస్త్ షో పై గత కొంత కాలంగా వివాదస్పద వార్తలు హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. కాంట్రవర్సీలు, వివాదాలు ఈ కామెడీ షోకి కొత్తేమి కాదు. షో మంచి రేటింగ్ అందుకున్నప్పటి నుంచి వివాదాలు కూడా అదే రేంజ్ లో చుట్టుముడుతున్నాయి. కమెడియన్స్ పై దాడులు జరగడం అలాగే షో పై పోలీస్ కేసులు నమోదవ్వడం కోర్టుల చుట్లు తిరగడం వంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
నాగబాబు నుంచే కొత్త వివాదాలు..
మెగా యాక్టర్ నాగబాబు ఎప్పుడైతే షో నుంచి జడ్జ్ గా తప్పుకున్నారో అప్పటి నుంచి జబర్దస్త్ పై ఇండస్ట్రీలో ఒక రకమైన నెగిటివ్ ప్రచారాలు మొదలయ్యాయి. ఆ తరువాత నాగబాబు చేసిన నెగిటివ్ కామెంట్స్ కూడా అందరిని ఆశ్చర్యనికి గురి చేశాయి. ఆ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు షో కంటెస్టెంట్ గెటప్ శ్రీను కొత్త తరహా సమస్యని ఎదుర్కొంటున్నారు.
ఫేక్ ఎకౌంట్స్ తో డర్టీ పిక్చర్స్..
సోషల్ మీడియాలో ఫెక్ ఎకౌంట్స్ ఏ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సెలబ్రిటీల పేరుతో సోషల్ మీడియా ఎకౌంట్స్ ని క్రియేట్ చేసి డర్టీ పిక్చర్స్ ని వదులుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా అదే తరహాలో మళ్ళీ ఫేక్ ఎకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నారు.
గెటప్ శ్రీనుకి కూడా అదే తిప్పలు..
ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా అదే తరహాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రీసెంట్ గా కొన్ని అసభ్యకర పోస్టులు గెటప్ శ్రీను పేరుతో ఉండడం అందరిని షాక్ కి గురి చేసింది. అశ్లిల వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడమే కాకుండా తప్పుడు కామెంట్స్ చేస్తుండడం గెటప్ శ్రీనుకి తెలిసింది. దీంతో వెంటనే ఈ విషయంపై శ్రీను సీరియస్ అయ్యాడు.
Recommended Video
గెటప్ శ్రీను వార్నింగ్..
నాకు సోషల్ మీడియాలో ఉన్నది రెండే రెండు ఎకౌంట్లు. ఇటీవల ఒక ఫేక్ ఎకౌంట్ చూశాను. అందులో ఎవరో పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారు. దానితో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన కమెడియన్ శ్రీను తన పేరుతో ఇలా ఫేక్ ఎకౌంట్స్ క్రియేట్ చేస్తే సైబర్ క్రైమ్ పోలీసుల పిర్యాదుచేస్తానని అన్నాడు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ రూమర్స్ ని ఎవరు నమ్మవద్దని కూడా గెటప్ శ్రీను వివరణ ఇచ్చాడు.