సుధీర్ - రష్మీ ఎఫైర్ గుట్టు విప్పిన గెటప్ శ్రీను: ఆ సీక్రెట్ లీక్ చేసి మరీ పరువు తీశాడు.!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెరపై రష్మీ గౌతమ్ - సుడిగాలి సుధీర్ జంటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీళ్లిద్దరూ కలిసి చేసేది రెండు షోలే అయినా.. ప్రేక్షకులకు కావాల్సిన దాని కంటే ఎక్కువ మజానే దొరుకుతోంది. దాదాపు ఐదేళ్లుగా ఈ జోడీపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. వాటన్నింటినీ ఖండిచినప్పటికీ.. మరిన్ని వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జబర్ధస్త్ కమెడియన్ కమ్ యాక్టర్ గెటప్ శ్రీను... సుధీర్ - రష్మీ ఎఫైర్ గుట్టు విప్పాడు. తాజాగా జరిగిన షోలో కొన్ని సీక్రెట్లు లీక్ చేసి మరీ పరువు తీసేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

ఒక్క షోతో ఇద్దరూ సక్సెస్ అయ్యారు

ఒక్క షోతో ఇద్దరూ సక్సెస్ అయ్యారు

జబర్ధస్త్ అనే షో ద్వారా యాంకర్‌గా పరిచయం అయింది హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్. అదే షోతో తన టాలెంట్ నిరూపించుకుని స్టార్‌డమ్‌ను అందుకున్నాడు సుడిగాలి సుధీర్. తమ తమ విభాగాల్లో సత్తా చాటుతోన్న ఈ ఇద్దరూ.. బుల్లితెరపై ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. అదే సమయంలో మరిన్ని అవకాశాలు అందుకుంటూ తమ కెరీర్లను సక్సెస్ చేసుకుంటున్నారు.

విడిగా కంటే జంటగానే పాపులారిటీ

విడిగా కంటే జంటగానే పాపులారిటీ

రష్మీ గౌతమ్... సుడిగాలి సుధీర్ ఇద్దరూ ఎంతో ఫాలోయింగ్ ఉన్న వాళ్లే. అయితే, వీళ్లు విడివిడిగా కంటే జంటగానే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. దాదాపు ఐదేళ్లుగా కలిసి పని చేస్తుండడంతో పాటు అప్పుడప్పుడూ హైలైట్ అవుతుండడంతో వీళ్లపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే యూట్యూబ్ జోడీగా పేరొందుకుని తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

లేదంటూనే అవన్నీ చేస్తున్నారుగా

లేదంటూనే అవన్నీ చేస్తున్నారుగా

తమ మధ్య స్నేహం తప్ప ఏలాంటి బంధమూ లేదని అటు రష్మీ గౌతమ్.. ఇటు సుడిగాలి సుధీర్ ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. కానీ, తరచూ తమ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు నటిస్తూ ప్రేక్షకులను అయోమయానికి గురి చేస్తున్నారు. వీళ్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు షో నిర్వహకులు తరచూ రొమాంటిక్ యాక్టులు చేపిస్తుండడంతో లవ్ ట్రాక్ నిజమేనన్న టాక్ వినిపిస్తోంది.

సుధీర్ మాత్రం నిజం ఒప్పుకున్నాడు

సుధీర్ మాత్రం నిజం ఒప్పుకున్నాడు

సుడిగాలి సుధీర్ విషయంలో రష్మీ మొదటి నుంచీ క్లారిటీగానే ఉంది. అతడు తనకు ఫ్రెండ్ మాత్రమేనని చెబుతూనే ఉంది. అయితే, సుధీర్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే, ఇది స్క్రీన్ వరకే అని చెబుతుంటాడు. నిజానికి తనకు ఆఫర్లు రావడానికి, పేరు ప్రతిష్టలు పెరగడానికి యాంకర్ రష్మీనే కారణం అని సుధీర్ ఎన్నో సందర్భాల్లో ఒప్పుకున్నాడు కూడా.

సుధీర్ రష్మీ గుట్టు విప్పిన గెటప్ శ్రీను

సుధీర్ రష్మీ గుట్టు విప్పిన గెటప్ శ్రీను

సుధీర్... రష్మీ విషయంలో ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా.. చాలా మందిలో మాత్రం వీళ్లిద్దరూ లవర్సేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. దీంతో ఈ జంటను ప్రత్యేకంగా చూస్తుంటారు. ఇది షోల టీఆర్పీ రేటింగ్‌కూ బాగానే ఉపయోగపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ - రష్మీ గౌతమ్ మధ్య ఉన్న ఎఫైర్ గుట్టు విప్పాడు జబర్ధస్త్ కమెడియన్ గెటప్ శ్రీను.

ఆ సీక్రెట్ లీక్ చేసి మరీ పరువు తీశాడు.!

ఆ సీక్రెట్ లీక్ చేసి మరీ పరువు తీశాడు.!

తాజాగా జరిగిన ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ఎపిసోడ్‌లో సుధీర్ గురించి మాట్లాడుతూ.. ‘వీడు వస్తాడు.. రష్మీ వైపు టర్నింగ్ ఇస్తాడు. ఆ వెంటనే లవ్ సింబర్ వస్తుంది. దీంతో జనాలు వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని ఊహించేసుకుంటారు. ఇలానే సుధీర్ గాడు బతికేస్తున్నాడు. అంతే తప్ప అక్కడ ఏమీ లేదు' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ స్కిట్‌కు యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్ వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X