Don't Miss!
- Finance
Pakistan Crisis: ఓడరేవుల్లో సరుకులు.. పాకిస్థానీలకు మాత్రం ఆకలి కేకలు.. ఎందుకిలా..?
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- News
YS Jagan, Chandrababu : జగన్, చంద్రబాబుకూ సంక్షేమ సవాల్ ! లబ్దిదారుల డిమాండ్లు ఇవే..!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
షూటింగ్ గ్యాప్‌లో గ్యాంగ్ మొత్తం అలా.. గెటప్ శ్రీను స్పెషల్ ట్రీట్!
జబర్దస్త్ వేదిక నుంచి ఎంతో మంది ఆర్టిస్ట్‌లు స్టార్స్‌గా ఎదిగారు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో చోటా మోటా పాత్రలు చేస్తున్నా రాని గుర్తింపు.. జబర్దస్త్ వల్ల వచ్చేసింది. జబర్దస్త్ వల్ల ఆ క్రేజ్‌ను వాడుకుంటూ.. వెండితెరపై వెలిగిన వారెంతో మంది ఉన్నారు. అయితే జబర్దస్త్ షోలో ఉన్నా లేకపోయినా కూడా ఆర్టిస్ట్‌లందరూ కూడా ఫ్రెండ్స్‌లానే ఉంటారు. జబర్దస్త్ తెరపైన కనిపించే నవ్వుల కన్నా తెర వెనుక చేసే సందడి ఎంతో ఉంటుంది.

షూటింగ్ అలా..
బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలకు సంబంధించిన షూటింగ్‌లు అన్నీ కూడా వెరైటీ షెడ్యూల్స్ ఉంటాయి. వరుసగా షూటింగ్‌లు చేస్తూ రెండు మూడు ఎపిసోడ్‌లను పూర్తి చేసేస్తుంటారు. అలా రేయింబవలు అనే తేడా లేకుండా షూటింగ్ చేస్తూనే ఉంటారు.

గ్యాప్‌లో ఇలా..
ఇక ఉదయం మొదలైన షూటింగ్ ఒక్కోసారి తెల్లవారుఝాము వరకు ఉంటుంది. అలాంటి సమయంలో ఆర్టిస్ట్‌లందరూ షూటింగ్ గ్యాప్‌లో ఫుల్ సందడి చేస్తుంటారు. అలా తాజాగా జబర్దస్త్ టీం షూటింగ్ గ్యాప్‌లో విందు కార్యక్రమాన్ని పెట్టుకున్నారు.

లంచ్ టైం..
ఇక మామూలుగా అందరూ ఒకే చోట షూటింగ్ చేస్తుండటం మూలాన లంచ్ టైంలో సందడి చేస్తుంటారు. కొందరు ప్రొడక్షన్ వాళ్లు పెట్టే ఫుడ్ తింటుంటారు. ఇంకొందరు బయటి నుంచి ఆర్డర్స్ తెప్పించుకుంటారు. కానీ కొందరు మాత్రం ఇంటి నుంచే వచ్చే ఫుడ్‌ను తింటుంటారు.

గెటప్ శ్రీను అలా..
అయితే తాజాగా గెటప్ శ్రీను తన ఫ్రెండ్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడట. గెటప్ శ్రీను ఇంటి నుంచి స్పెషల్ లంచ్ బాక్స్ వచ్చిందని.. అందరికీ ట్రీట్ ఇచ్చాడని కెవ్వు కార్తీక్ చెప్పుకొచ్చాడు. అలా జబర్దస్త్ టీం మేట్స్ అయిన ఇమ్మాన్యుయేల్, సన్నీ, కెవ్వు కార్తీక్, రాం ప్రసాద్ ఇలా అందరూ కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.

సుధీర్ మిస్..
మామూలుగా అయితే త్రీ మంకీస్ టైప్.. గెటప్ శ్రీను, రాం ప్రసాద్ ఉంటే అక్కడ కచ్చితంగా సుధీర్ ఉండాల్సిందే. కానీ ఈ లంచ్ టైంలో మాత్రం సుధీర్ డుమ్మా కొట్టేసినట్టున్నాడు. ఇందులో సుధీర్ ఉంటే పిక్ అదిరిపోయేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.