Brahmamudi: బ్రహ్మముడి సీరియల్ షూటింగ్ లొకేషన్‌లో దెయ్యం... స్వప్న, కావ్య రియాక్షన్ ఏంటంటే?
బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకులను బుల్లితెరపై ఆకట్టుకున్న సీరయల్లలో ఒకటి. అయితే ఈ సీరియల్లో మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు లీడ్ రోల్స్ లో చేస్తున్నారు. ఇక దీపికాతో పాటు.. బిగ్ బాస్ బ్యూటీ హమీద కూడా నటిస్తుంది. అయితే ఇటీవల బ్రహ్మముడి లోకేషన్లోకి దెయ్యం వచ్చింది. అయితే ఆ దెయ్యం ఎంట్రీతో హమీదా, దీపికా (స్వప్న, కావ్య) రియాక్షన్ ఎలా ఉందో ఈ స్టోరీలో చూద్దాం.
బుల్లితెరపై బ్రహ్మముడి సీరియల్ సూపర్ రేటింగుతో దూసుకుపోతుంది. మాటీవీలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ పేక్షకులను ఆకట్టుకుంటుంది. అక్కా చెల్లెళ్లు... ఓ ఇంటి ఫ్యామిలీలోని వారుసులను పెళ్లాడిన తర్వాత కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి... అనే కథాంశంతో తెరకెక్కించారు. ఇక బిగ్ బాస్ బ్యూటీ హమీదా, దీపికా రంగరాజు.. స్వప్న, కావ్యలుగా నటిస్తున్నారు.

మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ నాగులపల్లి, శ్రీకర్, కిరణ్ కాంత్ ప్రధాన పాత్రల్లో ఈ సిరీయల్ తెరకెక్కింది. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ ట్విస్టులతో మరింత ఆసక్తిగా సాగుతుంది. అయితే ఇదిలా ఉంటే.. ఇటీవల బ్రహ్మముడి సెట్లోకి దెయ్యం వచ్చింది. అయితే అది రియల్ దెయ్యం కాదు... బ్రహ్మముడి షూటింగ్ లొకేషన్ లో దెయ్యం ఉన్నట్టు డిటెక్ట్ చేసింది స్వప్న.
"ఎన్టైటి డిటెక్టెడ్" అనే యాప్ మన సెల్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే... మనం ఉన్న లొకేషన్ లో దెయ్యం ఉందా లేదా అనే విషయం తెలుస్తుందని చెప్పుకువచ్చింది. మరి ఇప్పుడు బ్రహ్మముడి షూటింగ్ లొకేషన్ లో దెయ్యం ఉన్నట్టుగా అక్కడ ఆ యాప్ డిటెక్ట్ చేసింది హామీదా అలియాస్ స్వప్న. ఇక అక్కడ దెయ్యం ఉన్నట్లు డిటెక్ట్ అవ్వడంతో... ఆ దెయ్యంతో స్వప్న, కావ్య (హమీదా, దీపికా) చాట్ చేశారు.

ఆ దెయ్యం పేరు ఏంటో చెప్పమని అడగ్గా.. దాని పేరు బెడ్సి అని తేలింది. ఇక అది ఫీమేల్ దెయ్యం అని తెలుసుకున్నారు. అది చాల మంచి దెయ్యం అంట.. ఆ దెయ్యం ఎలా చనిపోయిందో కూడా చెప్పుకువచ్చింది. ఆ దెయ్యం పుట్టిన దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లమ్ కారణంగా చనిపోయినట్లు చెప్పుకు వచ్చింది ఆ దెయ్యం. ఇక ఈ సందర్భంగా హమీదా అలియాస్ స్వప్న.. తనకు జరిగిన ఓ సందర్భాన్ని చెప్పుకువచ్చింది.
తన ఫోనులో ఐదేళ్ల నుంచి ఈ యాప్ ఉందట. అయితే ఇంతకు ముందు నేను ఒక ఇంట్లో ఉండగా... అక్కడ కూడా ఈ యాప్ తో దెయ్యాన్ని డిటెక్ట్ చేసాను అని చెప్పుకువచ్చింది. దెయ్యం ఉందని తెలిసి ఆ ఇంటిని ఖాళి చేసేసాను.. అంటూ హామీదా తెలిపింది. అక్కడ ఉన్నప్పుడు నాకు నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేవి.. మొత్తం నెగిటివ్ వైబ్స్ వచ్చేవి అందుకే యాప్ ఇన్ స్టాల్ చేసి చూడగా.. దెయ్యం డిటెక్ట్ అయినట్లు చెప్పుకువచ్చింది. ఇక ఈ విషయాలన్నీ హమీదా తన యూట్యూబ్ వ్లాగ్ లో చెప్పుకువచ్చింది. ప్రస్తుతం హామీదా కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











