Hyper Aadi: లైవ్ షోలో షాకింగ్ సీన్.. హైపర్ ఆదికి అమ్మాయి ముద్దు.. తీవ్రమైన అవమానం అంటూ!
ఈ దశాబ్ద కాలంలోనే తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది ఫుల్ టాలెంట్ ఉన్న కుర్రాళ్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే సెన్సేషన్‌గా మారిపోయారు. ఆ కోవకే చెందుతాడు ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది. సాదాసీదాగానే టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన అతడు.. తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఇప్పుడు కూడా వరుసగా సినిమాలు, షోలు చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో ఆదికి అమ్మాయి ముద్దు పెట్టింది. ఆ వివరాలు మీకోసమే!
జబర్థస్త్‌లో టాప్ కమెడియన్
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోన్న జబర్ధస్త్‌లోకి హైపర్ ఆది మామూలు ఆర్టిస్టుగా వచ్చాడు. కానీ, ఆ తర్వాత అతడు టీమ్ లీడర్‌గా మారి సత్తా చాటాడు. అప్పట నుంచి తనదైన స్కిట్లను ప్రదర్శించి షో చరిత్రలోనే బెస్ట్ కమెడియన్లలో ఒకడిగా నిలిచాడు. అదే సమయంలో యూట్యూబ్‌లోనూ తన స్కిట్లతో ఆది ఎన్నో రికార్డులు సాధించాడు.

సినిమాల్లోకి.. యమా బిజీగా
జబర్ధస్త్ కమెడియన్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న హైపర్ ఆది.. ఆ తర్వాత సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో హీరోగా.. అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగ్ రైటర్‌గా పని చేశాడు. ఇక, ఈ మధ్యన ఆది వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.

జబర్దస్త్‌కు బైబై.. ఆ షోలలో
హైపర్ ఆది జబర్ధస్త్ షో ద్వారానే వెలుగులోకి వచ్చి సెన్సేషన్ అయ్యాడు. అయితే, కొంత కాలంగా అతడు ఆ షోలో కనిపించడం లేదు. సినిమాలతో ఫుల్ బిజీగా మారడం వల్లే అతడు దీనికి గ్యాప్ ఇచ్చినట్లు తెలిసింది. ఇక, ఇప్పుడు ఈ స్టార్ కమెడియన్ 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలను మాత్రమే చేస్తున్నాడు. అలాగే, కొన్ని స్పెషల్ ఈవెంట్లలోనూ ఆది మెరుస్తున్నాడు.

హైపర్ ఆది పెళ్లి పుకార్లతో
హైపర్ ఆది తెలుగు బుల్లితెరపై తనదైన ముద్రను వేసుకుని.. ఇప్పుడు సినీ రంగంలో కూడా ప్రభావాన్ని చూపిస్తోన్నాడు. అదే సమయంలో అతడి పెళ్లి గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అతడు ఫలానా అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని పుకార్లు వస్తున్నాయి. అలాగే, హైపర్ ఆది ఎవరితోనో డేటింగ్ చేస్తున్నాడని కూడా టాక్ వినిపిస్తూనే ఉంది.
అమ్మాయిని తీసుకొచ్చేసి
హైపర్ ఆది ప్రస్తుతం 'ఢీ' షోలో చేస్తున్నాడు. ఇందులో ప్రతి వారం ఏదో ఒక సినిమా స్ఫూఫ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే వచ్చే బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో అతడు ఏకంగా ఓ అమ్మాయిని తనకు జంటగా తీసుకొచ్చాడు. ఆమెను తన ప్రియురాలిగా పరిచయం చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ వాళ్లు విడుదల చేయగా.. ఇది వైరల్ అవుతోంది.

ముద్దు పెట్టేసిన అమ్మాయి
ఆ అమ్మాయితో హైపర్ ఆది 'మన ప్రేమను చాటి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ.. నాకు తీవ్రమైన అవమానం జరిగింది ఈ స్టేజ్ మీదనే. ఇది పోవాలంటే ఈ స్టేజ్ మీద ఆ పావనం జరగాల్సిందే' అన్నాడు. ఆ వెంటనే ఆదికి ఆ అమ్మాయి ముద్దు పెట్టేసింది. దీంతో అక్కడ ఉన్న వాళ్లందరూ షాకైపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా సిగ్గు పడిపోయింది.


Click it and Unblock the Notifications











