For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లైవ్ షోలో హైపర్ ఆదికి ఐలవ్‌యూ చెప్పిన అమ్మాయి: పెళ్లి గురించి మాట్లాడమంటూ షాకిచ్చిన కమెడియన్

  |

  బుల్లితెరపైకి ఎంతో మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే అద్భుతమైన టాలెంట్‌తో స్టార్లుగా మారిపోతుంటారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. సాదాసీదా ఆర్టిస్టుగా షోలోకి ప్రవేశించిన అతడు.. టీమ్ లీడర్ స్థాయికి ఎదిగిపోయాడు. అదే సమయంలో భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా హైపర్ ఆదికి ఓ అమ్మాయి లైవ్ షోలోనే ప్రపోజ్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  అలా మొదలైంది.. ఇలా ఎంట్రీ ఇచ్చాడు

  అలా మొదలైంది.. ఇలా ఎంట్రీ ఇచ్చాడు

  డబ్‌స్మాష్ వీడియోలు, సినిమా స్ఫూఫ్‌లతో తన కెరీర్‌ను ఆరంభించాడు ఆది. ఆ సమయంలోనే సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. అలా అదిరే అభి దృష్టిలో పడ్డాడు. అతడి ద్వారానే జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలో ఆర్టిస్టుగా, ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్‌గా పని చేశాడు. అలా అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ దక్కింది. అప్పటి నుంచి దూసుకెళ్తున్నాడు.

   షో మొత్తంలో స్పెషల్‌గా.. టాప్ ప్లేస్‌లోకి

  షో మొత్తంలో స్పెషల్‌గా.. టాప్ ప్లేస్‌లోకి

  జబర్ధస్త్‌లో ఎంతో మంది కమెడియన్లు, టీమ్ లీడర్లు ఉన్నారు. వాళ్లందరిలో హైపర్ ఆదిది ప్రత్యేకమైన శైలి. అందుకే అతడి స్కిట్ల కోసం అందరూ వేయి కళ్లతో వేచి చూస్తుంటారు. అంతేకాదు, దాదాపు పది నిమిషాలు పాటు ఉండే స్కిట్‌లో గుక్క తిప్పుకోకుండా వేసే పంచుల వల్ల అతడికి మంచి పేరు వచ్చింది. తద్వారా జబర్ధస్త్‌లోనే కాకుండా ఓవరాల్‌గా టాప్‌ ప్లేస్‌ను అందుకున్నాడు.

  అద్భుతమైన టైమింగ్‌తో రికార్డులు బ్రేక్

  అద్భుతమైన టైమింగ్‌తో రికార్డులు బ్రేక్

  హైపర్ ఆది తన స్కిట్లతో తెలుగు ప్రేక్షకులను మాయ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అద్భుతమైన టైమింగ్‌తో అదరగొడుతున్నాడు. తన టీమ్ సభ్యులపై పంచులతో దండయాత్ర చేస్తూ ప్రతి స్కిట్‌నూ వన్ మ్యాన్ షోగా మార్చేస్తున్నాడు. ఈ కారణంగానే అతడి స్కిట్లకు యూట్యూబ్‌లో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో అవి ట్రెండింగ్ అవుతున్నాయి. అలా ఎన్నో రికార్డులు కొట్టేశాడు.

  ఇక్కడే కాదు.. అక్కడ కూడా దూకుడు

  ఇక్కడే కాదు.. అక్కడ కూడా దూకుడు

  బుల్లితెరపై తనదైన శైలి కామెడీని పంచుతూ ఫేమస్ అయిపోయిన హైపర్ ఆది.. సినిమాల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే అతడు ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు. కామెడీ పాత్రలే కాకుండా కొన్ని చిత్రాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశాడు. దీంతో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇక, ‘మేడ మీద అబ్బాయి' అనే సినిమాతో డైలాగ్ రైటర్‌గానూ మారాడు.

  వాళ్లతో కలిసి ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు

  వాళ్లతో కలిసి ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు

  ఈటీవీలో ప్రసారం అయ్యే బెస్ట్ షోలలో ‘క్యాష్' ఒకటి. సుమ కనకాల హోస్ట్ చేస్తున్న దీనికి కూడా భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇక, వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఈ షోకు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, దీపిక పిల్లి, భానూశ్రీ కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. అందులో కూడా ఆది తనదైన మార్క్ కామెడీతో అలరించాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

  కమెడయన్‌కు ప్రపోజ్ చేసిన అమ్మాయి

  కమెడయన్‌కు ప్రపోజ్ చేసిన అమ్మాయి

  ఈ ప్రోమోలో హైపర్ ఆది.. ఆటో రాంప్రసాద్ పోటాపోటీగా పంచులు వేస్తూ కనిపించారు. అలాగే, సుమ కూడా వాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా సెటైర్లు వేసింది. ఈ క్రమంలోనే అందరూ కలిసి భానూశ్రీని టార్గెట్ చేశారు. ఆమెను పంచులతో ఫీల్ చేశారు. ఇక, ఈ ప్రోమో చివర్లో షోలో పాల్గొన్న కాలేజీ అమ్మాయి హైపర్ ఆదికి ప్రపోజ్ చేసింది. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు.

  Chiranjeevi Releases Shasi Movie Teaser
  పెళ్లి గురించి మాట్లాడమంటూ షాకిస్తూ

  పెళ్లి గురించి మాట్లాడమంటూ షాకిస్తూ

  నీకు ఆది అంటే ఎందుకు ఇష్టం అని ఆ అమ్మాయిని అడగగా.. ‘మీకు చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నా. కానీ ఛాన్స్ రావట్లేదు. ఎంత ప్రేమిస్తున్నారంటే చెప్పలేను. ఎలా అంటే చూపించలేను. కానీ ఈ గుండె కొట్టుకునేంత వరకూ నా మనసు మిమ్మల్నే ప్రేమించమంటోంది' అని ప్రపోజ్ చేసేసింది. దీంతో రాంప్రసాద్ మీ ఇంట్లో మాట్లాడదాంలేమ్మా అని మరో షాక్ ఇచ్చాడు.

  English summary
  Hyper Aadi is Very Known As Comedian in Telugu States. Recently he Participate in Suma Kanakala Cash Show. In This Show One Girl Love Proposed to Hyper Aadi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X