For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిహారిక పెళ్లైన వెంటనే నాగబాబుకు షాక్: వరుణ్ తేజ్ తనతో ప్రేమలో ఉన్నాడంటూ ఓ అమ్మాయి!

  |

  నటుడిగా, నిర్మాతగా, సమర్పకుడిగా సినీ రంగంలో ఎన్నో పాత్రలను పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. సుదీర్ఘ కాలం పాటు సినీ పరిశ్రమకు సేవలు అందించిన ఆయన.. కొన్నేళ్ల క్రితం బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా ఆకట్టుకున్న ఆయన నవ్వుల రారాజుగా పేరొందారు. ఈ క్రమంలోనే సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను అలరించాలని డిసైడ్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ తేజ్‌తో తాను ప్రేమలో ఉన్నానంటూ ఓ అమ్మాయి నాగబాబుకే షాకిచ్చింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  సినిమా నుంచి జబర్ధస్త్ జడ్జ్‌గా మార్పు

  సినిమా నుంచి జబర్ధస్త్ జడ్జ్‌గా మార్పు

  సినిమా రంగంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు నాగబాబు. ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించి మెప్పించారు. ఈ క్రమంలోనే జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఏడేళ్లుగా ఆ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన ఆయన... దాని విజయంలో కీలక పాత్రను పోషించారు. అదే సమయంలో కొన్ని సీరియళ్లలోనూ నటించి ఆకట్టుకున్నారు.

  దానికి బ్రేక్... అదిరింది అనేలా ఎంటర్

  దానికి బ్రేక్... అదిరింది అనేలా ఎంటర్

  సుదీర్ఘ కాలం పాటు జబర్ధస్త్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన నాగబాబు.. కొన్ని నెలల క్రితం దానికి గుడ్‌బై చెప్పేశారు. అదే సమయంలో మరో ఛానెల్‌లో ‘అదిరింది' అనే కామెడీ షోను ప్రారంభించారు. ఇప్పటికే మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ‘బొమ్మ అదిరింది' పేరుతో మరో సీజన్‌ను కూడా మొదలు పెట్టేసింది. దీనికి ఆయన జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

  యూట్యూబ్ ఛానెల్‌తో సరికొత్తగా ప్లాన్లు

  యూట్యూబ్ ఛానెల్‌తో సరికొత్తగా ప్లాన్లు

  ఓ వైపు సినిమాలు.. మరోవైపు షోలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. అదే సమయంలో యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొన్ని కామెడీ షోలు ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే తెలియజేశారాయన. ఇందులో భాగంగానే ‘ఖుషీ ఖుషీగా' అనే తొలి తెలుగు స్టాండప్ కామెడీ షోను మొదలెట్టారు. అంతేకాదు, దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు.

  స్టాండప్ కామెడీ.. బూతులపై ఘాటుగా

  స్టాండప్ కామెడీ.. బూతులపై ఘాటుగా

  నాగబాబు ఒరిజినల్స్‌ పేరిట ప్రసారం కానున్న ‘ఖుషీ ఖుషీగా' షో ప్రోమోలో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. బూతులు నచ్చని వారు ప్రవచనాలు వినండని ఫైర్ అయ్యారు. అంతేకాదు, నచ్చని వారికే అవి అలా అనిపిస్తాయని, సరదాగా చూసే వాళ్లకు మజాను పంచుతాయని చెప్పుకొచ్చారు.

  నాగబాబుకు బిగ్ షాకిచ్చిన అమ్మాయి

  తన కూతురు నిహారిక పెళ్లి పనులతో బిజీ బిజీగా గడిపారు నాగబాబు. ఈ నెల 9న ఆమె పెళ్లి జొన్నలగడ్డ వెంకట చైతన్యతో రాజస్థాన్‌లోని ఉదయ్ విలాస్‌లో జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఇది పూర్తయిన వెంటనే తన ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నారు నాగబాబు. ఈ నేపథ్యంలో ఆయనకు ఓ అమ్మాయి బిగ్ షాక్ ఇచ్చింది.

  Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie
  వరుణ్ తేజ్‌ తనతో ప్రేమలో ఉన్నాడంటూ

  వరుణ్ తేజ్‌ తనతో ప్రేమలో ఉన్నాడంటూ

  ‘ఖుషీ ఖుషీగా' షో ఫస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను నాగబాబు తాజాగా విడుదల చేశారు. అందులో ఓ లేడీ కంటెస్టెంట్ స్టాండప్ కామెడీ చేస్తూ.. ‘నాగబాబు గారూ.. వరుణ్ బాబు నేను ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం ఆయనకు చెప్పగానే.. చూడు హసీనా.. జిందగీ మంచిది కాదు.. వట్టి గీతలే మన చేతులో ఉంటాయి' అని చెప్పింది. దీంతో నాగబాబుతో సహా అక్కడున్న వారంతా బిగ్గరగా నవ్వేశారు.

  English summary
  Kushi Kushiga, the first ever Stand-up comedy series by Win Win Works of Naga babu in association with Infinitum Network Solutions. Stay tuned to watch this ultimate telugu laughter riot Directed by : Mahesh Reddy Aduri Edited by : Venkatesh kengerla Art director : Prapul Nishanth Music : Srujan Shashank.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X