For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 5 Telugu: రొమాన్స్‌తో పిచ్చెక్కించే ఆ హీరోయిన్‌కు భారీ ఆఫర్.. అదే అత్యదిక పేమెంట్!

  |

  ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ హిందీలోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటోంది. మొదట్లో షోను ఎవరు పట్టించుకోరేమో అనుకున్నారు. కానీ మనోళ్లు హిందీ రేంజ్ లో కాకపోయినా మరీ ఎక్కువ లిమిట్స్ దాటకుండా బజ్ బాగానే క్రియేట్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కోసం ప్రస్తుతం కొంతమందిని కంటెస్టెంట్ లిస్టులో చేర్చినట్లు తెలుస్తోంది. అనుకున్న పేర్లు చివరి వరకు సస్పెన్స్ అనే చెప్పాలి. అయితే ఒక హీరోయిన్ కు మాత్రం భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఓకే చేయనున్నారట.

  ఎన్టీఆర్, నాని చేయనని చెప్పినా

  ఎన్టీఆర్, నాని చేయనని చెప్పినా

  బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్టింగ్ తో మొదలు పెట్టిన విధానం మంచి బూస్ట్ ఇచ్చింది. బుల్లితెరపై ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. రేటింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆ తరువాత ఎన్టీఆర్, నాని చేయనని చెప్పినా కూడా నాగార్జున ద్వారా కొనసాగించారు.

  సీజన్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే..

  సీజన్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే..

  నాగార్జున వచ్చిన తరువాత తెలుగు బిగ్ బాస్ షోకు ఒక డిఫరెంట్ క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి. నాగ్ తన పేరు కాంట్రవర్సీ కాకుండా చాలా ఈక్వల్ గా వెళుతున్నాడు. అసలైతే జూలైలోనే స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ప్లాన్స్ వర్కౌట్ అవ్వడం లేదు. ఇప్పుడు ఆగస్ట్ అనంతరం మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు.

  ఈసారి అంతకుమించి అనేలా

  ఈసారి అంతకుమించి అనేలా

  ఈసారి మొదలు కాబోయే సీజన్ 5 కోసం కూడా నాగార్జున హోస్ట్ అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక కంటెస్టెంట్స్ ఎవరనేది ఫైనల్ కావాల్సి ఉంది. ఆ విషయంలో నిర్వాహకులు ఈసారి ఏ మాత్రం తగ్గేలా లేరని అనిపిస్తోంది. గత ఏడాది సెలబ్రెటీల విషయంలో అంచనాలను అందుకోలేదు. కానీ ఈసారి అంతకుమించి అనేలా కొంచెం పేరున్న సెలబ్రేటీలను దింపుతున్నారని తెలుస్తోంది.

  ఆర్ఎక్స్ 100 బ్యూటీ కూడా

  ఆర్ఎక్స్ 100 బ్యూటీ కూడా

  బిగ్ బాస్ 5 కోసం ఇప్పటికే షణ్ముక్ జశ్వంత్, యాంకర్ రవి వంటి వారి పేర్లు వినిపించాయి. అలాగే ఒక గ్లామరస్ హీరోయిన్ కూడా రానున్నట్లు టాక్ వస్తోంది. ఆమె మరెవరో కాదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాయల్ రాజ్ పుత్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నిర్వాహకులు ఆమె పేరును ఫిక్స్ చేసినప్పటికీ ఇంకా ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం.

  భారీ రెమ్యునరేషన్..?

  భారీ రెమ్యునరేషన్..?


  పాయల్ రాజ్ పుత్ హౌజ్ లోకి వస్తే ఆ వాతావరణం మామూలుగా ఉండదు. అందుకే నిర్వహకులు ఆమెకు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వారానికి 15లక్షలకు పైగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. ఒకవేళ ఒకే అయితే ఆమెను ఎక్కువ రోజులు ఉంచి మరొక రౌండ్ ఫిగర్ రేటును ఫిక్స్ చేయవచ్చని సమాచారం. ఆమె ఒప్పుకుంటే మాత్రం బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇంతకుముందు ఎవరికి దక్కని రెమ్యునరేషన్ ఆమెకు రావచ్చని తెలుస్తోంది.

  English summary
  The names of Shanmuk Jashwant and Anchor Ravi have already been heard for Bigg Boss 5. Talk is coming that a glamorous heroine is also coming as well. Payal rajput who created a sensation with the RX 100 movie, seems to have fixed. Information that the organizers have fixed her name but have not yet received the green signal from her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X