For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రదీప్‌తో పెళ్లి ఆగిపోడానికి కారణమిదే.. అతడి క్యారెక్టర్ అలాంటిది: జ్ఞానేశ్వరి షాకింగ్ కామెంట్స్

  |

  తెలుగు బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. సుదీర్ఘ కాలంలో ఎన్నో షోలను హోస్ట్ చేసిన అతడు.. యాంకరింగ్‌కు సరికొత్త నిర్వచనం చెబుతూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు అందుకుంటూ లేడీ యాంకర్లకే పోటీగా నిలుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ టాప్ యాంకర్‌ హీరోగానూ పరిచయం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'పెళ్లి చూపులు' ఫేం జ్ఞానేశ్వరి.. ప్రదీప్‌తో పెళ్లి గురించి ఊహించని కామెంట్స్ చేసింది. అంతేకాదు, అతడి క్యారెక్టర్‌పైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

  ప్రతిష్టాత్మక అవార్డుతోనే మొదలు పెట్టాడు

  ప్రతిష్టాత్మక అవార్డుతోనే మొదలు పెట్టాడు

  రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించి.. జీ తెలుగులో ప్రసారం అయిన సెలెబ్రిటీ గేమ్ షో ద్వారా యాంకర్‌గా పరిచయం అయ్యాడు ప్రదీప్ మాచిరాజు. ఆ వెంటనే ‘గడసరి అత్త సొగసరి కోడలు' అనే షోతో బ్రేక్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ షోకు ఉత్తమ యాంకర్‌గా నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు.

  యాంకర్‌గానే కాదు... యాక్టర్‌గానూ సత్తా

  యాంకర్‌గానే కాదు... యాక్టర్‌గానూ సత్తా

  తనదైన శైలి హోస్టింగ్‌తో ఎన్నో షోలను విజయవంతంగా నడిపించాడు యాంకర్ ప్రదీప్‌. అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకుంటూ చాలా షోలను వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడు. అదే సమయంలో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు. అందులో పవన్ ‘అత్తారింటికి దారేది', అల్లు అర్జున్ ‘జులాయి', నాగ చైతన్య ‘100% లవ్', ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా' పేరు తెచ్చాయి.

  హీరోగా పరిచయం.. 30 రోజుల్లోనే అంటూ

  హీరోగా పరిచయం.. 30 రోజుల్లోనే అంటూ

  ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు యాంకర్ ప్రదీప్. మున్నా అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్వీ బాబు నిర్మించారు. ‘నీలి నీలి ఆకాశం' అనే పాటతో రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేసిన ప్రదీప్.. సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక, ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

  రిలీజ్‌కు ముందే రికార్డు.. ఆ రెండు సంస్థలు

  రిలీజ్‌కు ముందే రికార్డు.. ఆ రెండు సంస్థలు

  ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ, కరోనా సహా ఎన్నో ఆటంకాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ గ్యాప్‌లో రిలీజ్ అయిన ‘నీలి నీలి ఆకాశం' అనే పాట రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో బడా నిర్మాణ సంస్థలు గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ దీన్ని విడుదల చేసేందుకు ముందుకొచ్చాయి.

  ప్రదీప్‌తో పెళ్లి ఆగిపోలేదంటున్న జ్ఞానేశ్వరి

  ప్రదీప్‌తో పెళ్లి ఆగిపోలేదంటున్న జ్ఞానేశ్వరి

  ప్రదీప్ కెరీర్‌లో చేసిన చెత్త షోలలో ‘పెళ్లి చూపులు' ఒకటి. ఇందులో విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరితో అతడి పెళ్లిపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘ప్రదీప్‌తో పెళ్లి ఆగిపోలేదు. పెళ్లి చూపుల తర్వాత టైం తీసుకున్నాం. మేము ఒకరికొకరు నచ్చాం కాబట్టే ఇంకా తెలుసుకుంటున్నాం. ఫ్యూచర్‌లో ఏదైనా జరగొచ్చు' అని షాకింగ్ కామెంట్స్ చేసింది.

  అతడి క్యారెక్టర్ అలాంటిది.. ఎక్స్‌పీరియన్స్

  అతడి క్యారెక్టర్ అలాంటిది.. ఎక్స్‌పీరియన్స్


  ఇదే ఇంటర్వ్యూలో ప్రదీప్‌ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. ‘‘పెళ్లి చూపులు' అనే షో ద్వారా మంచి వ్యక్తిని కలిశాను. అదో బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పొచ్చు. మంచి ఎక్స్‌పీరియన్స్ కూడా. షో జరుగుతోన్న సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రదీప్ అంటే డిక్షనరీ లాంటి వాడు. ఎంత చదవినా కొత్త విషయం తెలుసుకోవచ్చు' అంటూ చెప్పుకొచ్చింది జ్ఞానేశ్వరి.

  30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్
  లిప్‌లాక్‌తో రెచ్చిపోయింది.. ఈరోజే రెడీగా

  లిప్‌లాక్‌తో రెచ్చిపోయింది.. ఈరోజే రెడీగా


  పెళ్లి చూపులు షో తర్వాత కెరీర్‌పై దృష్టి సారించిన జ్ఞానేశ్వరి.. ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిస్' అనే మూవీ చేసింది. అశోక్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో శైలేష్ సన్ని హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా ఈరోజే విడుదల కాబోతుంది. ఇక, ఆ మధ్య విడుదలైన ట్రైలర్‌లో ఆమె హీరోతో సుదీర్ఘమైన లిప్ లాక్‌తో పాటు రొమాంటిక్ సీన్‌ చేసి షాకిచ్చింది. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.

  English summary
  Gnaneswari Kandregula is the new girl on the block, who grabbed all the eyeballs with the recently concluded TV reality show Pradeep Machiraju's Pellichoopulu. Here are a few lesser-known facts about the young starlet, whom the popular TV host turned actor chose as his partner on the show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X