యాంకర్ ప్రదీప్‌తో పెళ్లి చూపులు అయ్యాయి.. పెళ్లి జరిగేది అప్పుడే: సీక్రెట్ రివీల్ చేసిన నటి

By Manoj Kumar P

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో పాపులారిటీని దక్కించుకున్న వారిలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒకడు. తనదైన శైలితో యాంకరింగ్‌కు సరికొత్త నిర్వచనం చెప్పిన అతడు.. తక్కువ వ్యవధిలోనే ఎంతో పేరును సంపాదించుకున్నాడు. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే పలు ఛానెళ్లోకి సైతం ఎంట్రీ ఇస్తున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ నటి ప్రదీప్‌తో పెళ్లి చూపులు జరిగాయని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం.!

రెండు చోట్లా సక్సెస్.. అందుకే ఈ క్రేజ్

రెండు చోట్లా సక్సెస్.. అందుకే ఈ క్రేజ్

ప్రదీప్ బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో షోలను హోస్ట్ చేస్తున్నాడు. అదే సమయంలో కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. వాటిలో పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది', అల్లు అర్జున్ ‘జులాయి', నాగ చైతన్య ‘100% లవ్', జూనియర్ ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి.

హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రదీప్ మాచిరాజు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రదీప్ మాచిరాజు

ఇప్పటి వరకు యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన ప్రదీప్ మాచిరాజు.. టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మున్నా అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో అతడు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 1947లో జరిగే పీరియాడిక‌ల్ క‌థగా ఈ మూవీ తెరకెక్కుతోంది. కరోనా ప్రభావం సినిమా విడుదల వాయిదా పడింది.

ఆ అరవై కుటుంబాలకు అండగా నిలిచాడు

ఆ అరవై కుటుంబాలకు అండగా నిలిచాడు


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో తెలుగులో సినిమా, టీవీ షూటింగులు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే యాంకర్ ప్రదీప్ కూడా తన వంతు సాయంగా సినీ కార్మికులకు చెందిన అరవై కుటుంబాలకు నెలకు సరిపడా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించాడు.

వివాదాస్పద షోతో ప్రదీప్‌ ఇమేజ్ డ్యామేజ్

వివాదాస్పద షోతో ప్రదీప్‌ ఇమేజ్ డ్యామేజ్

కొద్ది రోజుల క్రితం తెలుగులో ‘పెళ్లిచూపులు' అనే షో ప్రసారం అయిన విషయం తెలిసిందే. ఇందులో పద్నాలుగు మంది అమ్మాయిలతో యాంకర్ ప్రదీప్‌ లీడ్‌గా ఈ షోను ఏర్పాటు చేశారు. కొన్ని వారాల పాటు సాగిన ఈ షోలో విజేతగా నిలిచిన అమ్మాయితో ప్రదీప్‌కు పెళ్లి చూపులు జరుగుతాయని నిర్వహకులు వెల్లడించారు. అప్పట్లో ఈ షో ఎంతో వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.

యాంకర్ ప్రదీప్‌తో పెళ్లి చూపులు అయ్యాయి

ఈ షోలో విజేతగా నిలిచింది తెలుగు అమ్మాయి జ్ఞానేశ్వరి కందిరేగుల. ‘పెళ్లిచూపులు' షో తర్వాత ఆమె ‘మిస్టర్ అండ్ మిస్' సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ‘ప్రదీప్‌తో పెళ్లి చూపులు అయ్యాయి. దానికి పెళ్లికి మధ్య గ్యాప్ ఉంటుంది. ప్రస్తుతం మా మధ్య అదే నడుస్తోంది' అని చెప్పుకొచ్చింది.

పెళ్లికి టైమ్ ఉంది.. లిప్ లాక్ పెట్టేసింది

పెళ్లికి టైమ్ ఉంది.. లిప్ లాక్ పెట్టేసింది

తాను ప్రస్తుతం సినిమా కెరీర్‌పై దృష్టి సారించానని, దీంతో పెళ్లి గురించి అప్పుడే ఆలోచించనని వెల్లడించింది. మరోవైపు ఆమె నటించిన ‘మిస్టర్ అండ్ మిస్' మూవీ ట్రైలర్ కొద్ది రోజుల క్రితం విడుదలైంది. ఇందులో ఆమె హీరోతో సుదీర్ఘమైన లిప్ లాక్‌తో పాటు రొమాంటిక్ సీన్‌ చేసి షాకిచ్చింది. అశోక్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో శైలేష్ సన్ని హీరోగా నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X