బిగ్‌బాస్ ఇంట్లోకి అభినవ దేవత.. క్రేజీగా రాధే మా ఎంట్రీ
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షో 14వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీల పేర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా తగు జాగ్రత్తలు తీసుకొంటూ 14వ సీజన్‌ను ఆరంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌లోకి స్వయం ప్రకటిత అభినవ దేవత రాధే మా పాల్గొంటారనే వార్త వైరల్‌గా మారింది. ఈ వార్త గురించి పూర్తి వివరాలు..

ఎర్రటి దుస్తుల్లో ఉపాసకురాలు
బిగ్‌బాస్ షో ప్రారంభానికి ముందు కొంత మంది సెలబ్రిటీల ప్రోమో వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రటి దుస్తుల్లో ఉన్న ఓ సెలబ్రిటీ ముఖం కనిపించకుండా వీడియోను రిలీజ్ చేశారు. ఈ శనివారం బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె కృప, ప్రేమ కురవబోతున్నది అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

బిగ్‌బాస్ ఇంట్లో రాధే మా అంటూ
అయితే కలర్స్ టీవీ ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియోలో అభినవ దేవత రాధే మా రూపం స్పష్టంగా కనిపించింది. ఇంటిలో ప్రార్థనలు చేస్తూ బిగ్‌బాస్ గురించి మాట్లాడుతూ కనిపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆమె బిగ్‌బాస్‌లో పాల్గొంటే వివాదాలకు కొదువ ఉండదు అనే మాట వినిపిస్తున్నది.

రూమర్లను ఖండించిన నిర్వాహకులు
బిగ్‌బాస్ హిందీ 14వ సీజన్ కార్యక్రమం అక్టోబర్ 3వ తేదీన ప్రారంభం కానున్నది. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌తోపాటు పలువురి ప్రమోషన్స్ షూట్స్ పూర్తయ్యాయి. ఈ షో ఎప్పటిలానే ప్రతీ రోజు ఒక గంటపాటు ప్రసారం అవుతుంది అని నిర్వాహకులు వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా షో ప్రసారాన్ని 30 నిమిషాలకు కుదించామనే విషయాన్ని ఖండించారు
Recommended Video

సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్
ఇక సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించినందుకు ప్రతీ ఎపిసోడ్‌కు రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు చానెల్ ప్రకటించింది. అయితే ఈ సీజన్‌కు సల్మాన్‌కు ముట్టే మొత్తం రూ.480 కోట్లు, అయితే లాక్‌డౌన్ కారణంగా రూ.30 కోట్లు తగ్గించి రూ.450 కోట్లకు రెమ్యునరేషన్‌ను సెట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తీసుకొనే రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











