Bigg Boss Telugu 5 విజేత ఎవరో చెప్పేసిన గూగుల్.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటూ బుల్లితెర మీద మ్యాజిక్ చేస్తున్నది. అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన కార్యక్రమంగా మంచి రేటింగ్‌ను సొంతం చేసుకొంటున్నది. అయితే 19 మంది సభ్యులతో బిగ్‌బాస్ ఇల్లు అత్యంత సందడిగా కనిపిస్తున్నది. అయితే 100 రోజులకు పైగా కొనసాగే ఈ కార్యక్రమంలో విజేత ఎవరు నిలుస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ విజేత ఎవరో అనే విషయం గూగుల్ రివీల్ చేయడం అత్యంత ఆసక్తిగా మారింది. గూగుల్ చెప్పిన బిగ్‌బాస్ తెలుగు 5 విజేత ఎవరంటే..

మూడోవారం పూర్తి చేసుకోబోతున్న బిగ్‌బాస్ తెలుగు 5
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభమై మూడో వారాన్ని పూర్తి చేసుకోబోతున్నది. గత రెండు వారాల్లో రెండు ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకొన్నది. ఈ వారాంతంలో మరో సెలబ్రిటీని బయటకు పంపించేందుకు నామినేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసుకొన్నది. అయితే మూడోవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఉత్కంఠగా మారింది.

మూడో వారంలో ఐదుగురు నామినేషన్‌లో..
ఇలా మూడో వారం ఎలిమినేషన్ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఏకంగా గూగుల్ మాత్రం విజేతను ప్రకటించేసింది. ప్రస్తుతం మూడో వారంలో శ్రీరామచంద్ర, లహరి షారి, మానస్, ప్రియ, ప్రియాంక ఐదుగురు ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్‌లో శ్రీరామచంద్ర ఈ సీజన్ విజేత అంటూ తెలపడం షాక్ గురిచేసింది.

బిగ్ బాస్ విజేత ఎవరంటే..
ఇక బిగ్‌బాస్ తెలుగు 5 విజేత ఎవరని టైప్ చేస్తే.. గూగుల్ సర్చ్ ఇంజిన్‌లో మాత్రం సింగర్ శ్రీరామచంద్ర పేరు కనిపిస్తున్నది. అయితే ఈ వార్త మిగితా అభిమానులను కంగారు పెడితే.. శ్రీరామ్ ఫ్యాన్స్‌ను మాత్రం సంతోషానికి గురిచేసింది. ప్రస్తుతం గూగుల్ వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నది. గూగుల్ 90 వేసినట్టు ఉన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ విజేతగా
అయితే ఇప్పటికే శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ సీజన్ 5 విజేతగా నిలువడం, అంతేకాకుండా ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉండటం వల్ల డేటాబేస్ సర్చ్‌లో తప్పు సంభవించి ఉంటుందనే విషయాన్ని టెక్నికల్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే గూగుల్ సర్చ్‌లో శ్రీరామచంద్ర విజేతగా చూపించడంపై కొంతరు సెటైర్లు వేస్తున్నారు.
Recommended Video

బిగ్‌బాస్‌లో రొమాంటిక్‌గా శ్రీరామచంద్ర
ఇదిలా ఉండగా, శ్రీరామచంద్ర బిగ్‌బాస్ ఇంటిలో రొమాంటిక్‌గా ఆకట్టుకొంటున్నారు. ఇంటిలోని అందాల భామలంతా శ్రీరామచంద్రతో లవ్ ట్రాక్ నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన హైదరాబాద్ అమ్మాయి.. అమెరికా అమ్మాయి టాస్క్ ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. ఈ టాస్క్‌లో శ్రీరామచంద్ర బెస్ట్ ఫెర్ఫార్మర్‌గా ఎంపికై కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచారు. అయితే కెప్టెన్సీ టాస్క్‌లో జస్వంత్ కెప్టెన్‌గా విజయం సాధించారు.


Click it and Unblock the Notifications











