For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Anchor Ravi కి షాకిచ్చిన గూగుల్: అలా టైప్‌ చేస్తే ఆ ఫొటో వచ్చేస్తుంది.. భార్యకు ఆ మాట చెబుతూ!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు ఉన్నారు. అందులో ఎక్కువ శాతం మంది అమ్మాయిలదే హవాను చూపిస్తున్నారు. వాళ్ల పోటీని తట్టుకుని నిలబడిన మేల్ యాంకర్లలో రవి ఒకడు. దాదాపు ఏడెనిమిదేళ్లుగా తనదైన శైలి హోస్టింగ్‌తో ఆకట్టుకుంటోన్న అతడు.. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకున్నాడు. అతడి భార్య కూడా అప్పుడప్పుడూ బుల్లితెరపై సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా యాంకర్ రవికి గూగుల్ షాకిచ్చింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  దమ్ము కొడుతూ దొరికిపోయిన స్టార్ హీరోయిన్లు.. నయనతార, ప్రియాంక, కంగన స్టైల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

  అలా మొదలైన కెరీర్.. స్టార్‌గా ఎదిగి

  అలా మొదలైన కెరీర్.. స్టార్‌గా ఎదిగి

  రేడియో జాకీగా తన కెరీర్‌ను ఆరంభించాడు రవి. ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలోనే అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. ప్రేక్షకులతో పాటు నిర్వహకుల దృష్టిలో పడిపోయాడు. దీంతో అతడికి వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ షోలు చేస్తూ రవి తెలుుగలో స్టార్‌ యాంకర్‌గా ఎదిగిపోయాడు.

  వివాదాలు... పర్సనల్ లైఫ్‌ గురించి

  వివాదాలు... పర్సనల్ లైఫ్‌ గురించి

  సుదీర్ఘమైన కెరీర్‌లో యాంకర్‌గా ఎంతో మంచి పేరును సంపాదించుకున్న రవి.. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో గొడవల్లో అనవసరంగా భాగం అయ్యాడు. అదే సమయంలో పర్సనల్ లైఫ్ విషయంలోనూ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అలాగే, డబుల్ మీనింగ్ డైలాగులతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫలితంగా చెడ్డ పేరొచ్చింది.

  ఎప్పుడో పెళ్లైంది... భార్యను మాత్రం

  ఎప్పుడో పెళ్లైంది... భార్యను మాత్రం

  యాంకర్ రవికి చాలా కాలం క్రితమే వివాహం అయింది. అది కూడా కాలేజ్ రోజుల నుంచే ప్రేమించిన నిత్యా సక్సేనా అనే అమ్మాయినే అతడు పెళ్లాడాడు. ఈ విషయం మాత్రం చాలా సీక్రెట్‌గా ఉంచాడు. అలాగే ఎన్నో షోలు చేస్తూ సింగిల్ అన్నట్లు కనిపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నేళ్ల క్రితమే తన భార్యను, పాపను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ మేరకు ఫొటోలు వదిలాడు.

  షోలలోకి కూడా తీసుకొస్తున్నాడుగా

  షోలలోకి కూడా తీసుకొస్తున్నాడుగా

  పెళ్లై, తండ్రి కూడా అయిన విషయాన్ని ప్రేక్షకులకు తెలియనీవ్వని రవి.. అది రివీల్ చేసిన తర్వాత మాత్రం తరచూ హాట్ టాపిక్ అవుతున్నాడు. దీనికి కారణం అతడు చేసే షోలకు భార్య, పిల్లను కూడా తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడి పర్సనల్ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీనికితోడు భార్యపై ప్రేమను తరచూ చూపిస్తున్నాడు. దీంతో హైలైట్ అవుతున్నాడు.

  అందులో రచ్చ చేస్తున్న రవి ఫ్యామిలీ

  అందులో రచ్చ చేస్తున్న రవి ఫ్యామిలీ

  లాక్‌డౌన్ కారణంగా యాంకర్ రవి ప్రస్తుతం ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తరచూ తన భార్య, పాపతో కలిసి విచిత్రమైన వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు. ఇలా చాలా రోజులుగా ఎన్నో వీడియోలు చేసిన అతడు ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. ఇక, ఇటీవలే ‘మగువా మగువా' పాటకు మేల్ వెర్షన్‌గా చేసిన వీడియో హాట్ టాపిక్ అయింది.

  యాంకర్ రవికి షాకిచ్చిన గూగుల్

  యాంకర్ రవికి షాకిచ్చిన గూగుల్

  కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. యాంకర్ రవి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటాడు. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. అలాగే, కొన్ని ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టాడు. ఇందులో అతడికి గూగుల్ షాకిచ్చింది.

  Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
  అలా టైప్‌ చేస్తే ఆ ఫొటో వచ్చేస్తుంది

  అలా టైప్‌ చేస్తే ఆ ఫొటో వచ్చేస్తుంది

  గూగుల్‌లో Worlds most beautiful couple అని టైప్ చేస్తే రవి, నిత్య ఫొటోను చూపిస్తుందట. ఈ విషయాన్ని స్క్రీన్ షాట్ చేసి చూపిస్తూ ఓ అభిమాని పోస్ట్ పెట్టారు. దీన్ని తన స్టోరీలో షేర్ చేసిన రవి.. షాకవుతున్నట్లు ఓ స్టిక్కర్‌ను పోస్ట్ చేశాడు. అంతేకాదు, ‘నిత్య.. ఇది నువ్వు చూశావా' అంటూ భార్యను ట్యాగ్ చేస్తూ అడిగాడు. అయితే, ఇప్పుడు మాత్రం గూగుల్‌లో రిజల్ట్ అలా రావట్లేదు.

  English summary
  Telugu Anchor Ravi Recently Shared a Photo in his Instagram Story. In This Pic.. Google Shows he and his Wife as Worlds most beautiful couple.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X