Seetimaarr 8 Days collections: గోపీచంద్‌కు మొదలైన కష్టాలు.. టార్గెట్‌కు అన్ని కోట్ల దూరంలో!

తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోల్లో మాచ్ స్టార్ గోపీచంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. చాలా కాలం పాటు హవాను చూపిస్తూ వచ్చాడు. అయితే, కొన్నేళ్లుగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో ఫ్లాపులను చవి చూస్తూ ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల 'సీటీమార్' అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, రెండో వారంలో మాత్రం కలెక్షన్లు పెద్దగా రాలేదు. ఇక, ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టును పరిశీలిద్దాం పదండి!

 ‘సీటీమార్' అంటూ వచ్చిన గోపీచంద్

‘సీటీమార్' అంటూ వచ్చిన గోపీచంద్

గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'. ఈ మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి దీన్ని నిర్మించారు. తమన్నా హీరోయిన్‌గా నటించగా.. భూమిక కీలక పాత్రను పోషించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సినిమా బిజినెస్ ఎక్కడ ఎంత జరిగింది?

సినిమా బిజినెస్ ఎక్కడ ఎంత జరిగింది?

మాచ్ హీరో గోపీచంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ కొంచెం తక్కువన్న విషయం తెలిసిందే. అయితే, 'సీటీమార్' మూవీకి మాత్రం నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో రూ. 5 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ. 11.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

8వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చిందంటే?

8వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చిందంటే?

'సీటీమార్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదవ రోజు కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 30 లక్షలు షేర్, రూ. 54 లక్షలు గ్రాస్‌నే వసూలు అయింది.

8 రోజులకు కలిపి ఎంత రాబట్టింది?

8 రోజులకు కలిపి ఎంత రాబట్టింది?

మొదటి వీకెండ్‌లో సత్తా చాటిన 'సీటీమార్' మూవీ 8 రోజులకు కలిపి నైజాంలో రూ. 2.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.68 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.17 కోట్లు, ఈస్ట్‌లో రూ. 89 లక్షలు, వెస్ట్‌లో రూ. 53 లక్షలు, గుంటూరులో రూ. 1 కోటి, కృష్ణాలో రూ. 52 లక్షలు, నెల్లూరులో రూ. 45 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.57 కోట్లు షేర్, రూ. 14.22 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత

రెండు రాష్ట్రాల్లో ఎనిమిది రోజుల్లో రూ. 8.57 కోట్లు షేర్ రాబట్టిన గోపీచంద్ 'సీటీమార్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 33 లక్షలు, ఓవర్సీస్‌లో (అమెరికాలో ప్రదర్శించలేదు) రూ. 8 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో ఈ చిత్రం రూ. 8.98 కోట్లు షేర్, రూ. 15.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా బ్రేక్ ఈవెన్‌కు క్రమంగా దగ్గరవుతోంది.

మూవీ టార్గెట్ ఎంత? ఇంక ఎంతొస్తే హిట్?

మూవీ టార్గెట్ ఎంత? ఇంక ఎంతొస్తే హిట్?

గోపీచంద్ 'సీటీమార్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలిపి (అమెరికాలో లేదు) రూ. 11.50 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ చిత్రం ఎనిమిది రోజుల్లో రూ. 8.98 కోట్లు వసూలు చేసింది. అంటే.. మరో రూ. 3.02 కోట్లు వసూలు చేస్తేనే ఈ మూవీ క్లీన్ హిట్‌ స్టేటస్‌ను అందుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X