twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Seetimaarr 7 Days collections: ఏడు రోజూ అదే రేంజ్‌లో.. హిట్ అవ్వాలంటే అన్ని కోట్లు రావాల్సిందే

    |

    కెరీర్ ఆరంభంలో ఎన్నో విజయాలను అందుకున్నా.. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు మాచో హీరో గోపీచంద్. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నా.. ఎందుకనో విజయం మాత్రం అతడిని వరించడం లేదు. దీంతో ఈ టాలెంటెడ్ హీరో కెరీర్ ముగిసినట్లే అన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో గోపీచంద్ నటించిన చిత్రమే 'సీటీమార్'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలోనే మంచి టాక్‌తో కలెక్షన్లను భారీగా అందుకుంది. అయితే, క్రమంగా వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఇక, మొదటి వారం ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

    Recommended Video

    Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
    ‘సీటీమార్' కొట్టేలా వచ్చిన గోపీచంద్

    ‘సీటీమార్' కొట్టేలా వచ్చిన గోపీచంద్

    గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'. ఈ మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి దీన్ని నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భూమిక చావ్లా ఇందులో కీలక పాత్రను పోషించింది. అప్సరా రాణి స్పెషల్ సాంగ్‌ను చేసింది. మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గత వారం విడుదలైంది.

    Bigg Boss: రెండో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఆమె మాత్రం పైపైకి!Bigg Boss: రెండో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఆమె మాత్రం పైపైకి!

    సినిమా బిజినెస్ ఎక్కడ ఎంత జరిగింది?

    సినిమా బిజినెస్ ఎక్కడ ఎంత జరిగింది?

    చాలా కాలం నుంచి హీరోగా ఉన్నా గోపీచంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ కొంచెం తక్కువనే చెప్పాలి. అయితే, 'సీటీమార్' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో రూ. 5 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ. 11.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

     ఏడో రోజు ఎక్కడ.. ఎంత వచ్చిందంటే?

    ఏడో రోజు ఎక్కడ.. ఎంత వచ్చిందంటే?

    'సీటీమార్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు కలెక్షన్లు పర్వాలేదనిపించాయి. నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 38 లక్షలు షేర్, రూ. 68 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

    Maestro Full Movie: నితిన్‌కు బిగ్ షాక్.. రిలీజ్ అయిన గంటల్లోనే లీక్.. ఆ సైట్‌లో డౌన్‌లోడ్ లింక్Maestro Full Movie: నితిన్‌కు బిగ్ షాక్.. రిలీజ్ అయిన గంటల్లోనే లీక్.. ఆ సైట్‌లో డౌన్‌లోడ్ లింక్

    వారంలో సత్తా.. కొనసాగించేలా బిగ్ ప్లాన్

    వారంలో సత్తా.. కొనసాగించేలా బిగ్ ప్లాన్

    మొదటి మూడు రోజులు భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టిన 'సీటీమార్' మూవీ.. ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా పడిపోతూ వచ్చింది. అయినప్పటికీ ప్రతిరోజు వసూళ్లలో పెద్దగా తేడాను చూపించకపోవడం మంచి విషయం. ఇక, ఇప్పటికే ఏడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు కూడా థియేటర్ల సంఖ్య భారీగా ఉండేలా ప్లాన్ చేశారు.

    ఏడు రోజులకు కలిపి ఎంత రాబట్టింది?

    ఏడు రోజులకు కలిపి ఎంత రాబట్టింది?

    ఆరంభంలో బాగా రాణించిన 'సీటీమార్' మూవీ ఏడు రోజులకు కలిపి నైజాంలో రూ. 2.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.63 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.11 కోట్లు, ఈస్ట్‌లో రూ. 86 లక్షలు, వెస్ట్‌లో రూ. 49 లక్షలు, గుంటూరులో రూ. 98 లక్షలు, కృష్ణాలో రూ. 50 లక్షలు, నెల్లూరులో రూ. 43 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.27 కోట్లు షేర్, రూ. 13.68 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

    బాత్రూంలో బ్రాతో సమంత రచ్చ: అందాలన్నీ చూపిస్తూ మరీ ఘాటుగా.. ఫస్ట్ టైమ్ ఈ రేంజ్‌లో!బాత్రూంలో బ్రాతో సమంత రచ్చ: అందాలన్నీ చూపిస్తూ మరీ ఘాటుగా.. ఫస్ట్ టైమ్ ఈ రేంజ్‌లో!

     ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత

    రెండు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో రూ. 8.27 కోట్లు షేర్ రాబట్టిన గోపీచంద్ 'సీటీమార్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో (అమెరికాలో ప్రదర్శించలేదు) రూ. 8 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారంలో ఈ చిత్రం రూ. 8.67 కోట్లు షేర్, రూ. 14.55 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా టార్గెట్‌కు మరింత చేరువైంది.

    మూవీ టార్గెట్ ఎంత? ఇంక ఎంతొస్తే హిట్?

    మూవీ టార్గెట్ ఎంత? ఇంక ఎంతొస్తే హిట్?

    గోపీచంద్ నటించిన 'సీటీమార్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలిపి (అమెరికాలో లేదు) రూ. 11.50 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ చిత్రం మొదటి వారం రోజుల్లో రూ. 8.67 కోట్లు వసూలు చేసింది. అంటే.. మరో రూ. 3.33 కోట్లు వసూలు చేస్తేనే ఈ మూవీ క్లీన్ హిట్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    English summary
    Tollywood Talented Hero Gopichand and Sampath Nandi Seetimaarr Movie Released Last Friday. This Movie Collect 8.67 Cr in 7 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X