Bigg Boss 8 Telugu: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న హాట్ బ్యూటీ.. ఇక నిఖిల్ కు పట్టపగలే చుక్కలు..

Bigg Boss 8 Telugu: గతంలో ఎప్పుడూ చూడని సరికొత్త కాన్సె్ప్టులు, టెస్టులతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. బుల్లితెర ప్రేక్షకులను ఓరేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది.చూస్తు చూస్తుండగానే రెండు వారాలు పూర్తి చేసుకోబోతుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ లో ప్రారంభమైన ఈ సీజన్.. తొలివారం ఎలిమినేషన్ లో బేబక్క బయటకు వెళ్లిపోయారు. అలాగే నేడు రెండవ ఎలిమినేషన్స్ జరుగుతోంది. ఈ ఎలిమినేషన్స్ లో విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నాగమణికంఠ, శేఖర్‌ భాషా, పృథ్వీరాజ్‌, నిఖిల్‌, సీతా, నైనికా ఉన్నారు. అయితే.. నేడు శేఖర్ బాషా ఎలిమినేట్ కాబోతున్నాడు. ఇప్పటికే బయటకు వచ్చాడని వార్తలు వస్తున్నాయి. దీంతో హౌస్ లో 12మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగులు తారు.ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ వైల్డ్ కార్డు ద్వారా ఏంట్రీ ఇవ్వనున్న బ్యూటీ ఎవరో మీరు కూడా లూక్కేయండి.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి ముందు వైల్డ్ కార్డు ఏంట్రీ ద్వారా పలువురు పేర్లు తెరమీదికి వచ్చాయి. అందులో జ్యోతిరాయ్‌ అలియస్ జగతి మేడం..ఈ హాట్ బ్యూటీని
బిగ్ బాస్ నిర్వహకులు సంప్రదించారట. అయితే.. ఆ బ్యూటీ అటు సీరియల్స్.. ఇటు సినిమాల్లో బిజీగా ఉండడంతో తాను హౌస్ లోకి రాలేనని చెప్పారని టాక్. మరోవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ముక్కు అవినాశ్, శోభా శెట్టి, రోహిణీ, హరితేజ, నయని పావని వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో బ్యూటీ వస్తుందనే ప్రచారం ప్రారంభమైంది.

Gorintaku fame Kavya Shri will give a wild card entry into the Bigg Boss 8 Telugu house

ఆ బ్యూటీ ఎవరో కాదు.. గోరింటాకు ఫేమ్ కావ్య శ్రీ. ఈ అమ్మడుది కర్ణాటక. బెంగుళూరులో పుట్టి పెరిగింది. కావ్య కాలేజీ డేస్ నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది. తల్లిదండ్రులు కూడా తనకు సపోర్టుగా నిలువడంతో నటనపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తొలిసారి 'నీలి' అనే కన్నడ సీరియల్‌తో నటించి అవకాశం దక్కించుకుంది. ఆ తరువాత అమ్మ, మహంకాళి అనే నటించింది. ఆ తరువాత ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో తొలి సీరియల్ గోరింటాకుతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది కావ్య శ్రీ. ఆ తరువాత స్టార్ మా ప్రసారమతున్న అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సిరీయల్ లో నటించే అవకాశం అందుకుంది. ఈ సీరియల్‌లో శకుంతల పాత్రలో కావ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

ఇక గోరింటాకు సీరియల్ చేసే సమయంలో నిఖిల్ తో పరిచయం ఏర్పడింది. ఆ సీరియల్లో వారిద్దరూ జంటగా నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ పలు ఎంటర్ టైన్మెంట్ షోస్, డ్యాన్స్ షోస్ లలో పాల్గొన్నారు. అంతే కాకుండా.. వీరిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ ను కూడా ప్రారంభించారు. అందులో షార్ట్ ఫీల్స్, వీడియోలు, ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసేవారు. ఇలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

Gorintaku fame Kavya Shri will give a wild card entry into the Bigg Boss 8 Telugu house

ఈ క్రమంలోనే వీరు ప్రేమించుకుంటున్నారనీ, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పలు రూమార్స్ వచ్చాయి. వీటిపై ఈ జంట ఏనాడు స్పందించలేదు. ఏమైందో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో ఒకరినొకరూ అన్ ఫాలో చేసుకున్నారు. నిఖిల్ బిగ్ బాస్ లోని ఎంట్రీ ఇస్తే... తన ఫ్రెండ్ అందరూ నిఖిల్ కు విషెష్ చెప్పారు. కానీ, కావ్య శ్రీ మాత్రం..ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినా నిఖిల్ కూడా తాను సింగిల్ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో నిఖిల్ -కావ్య శ్రీ బంధానికి బ్రేకులు పడ్డాయా? అని వీరి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ తరుణంలో కావ్యశ్రీ బిగ్ బాస్ ఇస్తే.. నిఖిల్ కు చుక్కలు కనిపించడం ఖాయమని బీబీ లవర్స్ భావిస్తున్నారు. మరీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎలాంటి ప్లాన్స్ వేస్తోంది వేచిచూడాలి మరీ. వీరిలో ఎవరు వస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X