Bigg Boss Telugu 7: బాహుబలి రేంజ్‌లో గౌతమ్ కృష్ణ రీ ఎంట్రీ.. వస్తూనే శివాజీ, పల్లవి ప్రశాంత్‌పై విరుచుకుపడి..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఇక ఐదో వారం వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ 2.ఓ గ్రాండ్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇక అందులో ఐదుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇక లోపల 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. ఒకరు సీక్రెట్ రూమ్ లో ఉన్నారు. ఇక సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ రీఎంట్రీ ఇవ్వగా.. ఆట మలుపు తిరుగుతోంది. రావడం రావడమే గౌతమ్.. ప్రశాంత్, శివాజీలపై విరుచుకుపడ్డారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

బిగ్ బాస్ సీజన్ 7లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఇక వారిలో ఐదుగురు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఓ ఫేక్ ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. గౌతమ్ కృష్ణను ఎలిమినేట్ చేస్తున్నట్లు చూపించి... సీక్రెట్ రూమ్ లోకి పంపించారు. ఇక రెండు రోజులుగా సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్.. హౌజ్ లో ఎవరెవరూ ఎలా చేస్తున్నారో అంతా వింటూ కూర్చొన్నాడు.

Goutham Krishna is Back to Bigg Boss House From Secret Room and Fires on Sivaji and Pallavi Prashanth

ఇక నిన్న నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. కొత్తగా వచ్చిన ఐదుగురిని పోటుగాళ్లు అని... పాత వారిని ఆటగాళ్లు అని బిగ్ బాస్ డిసైడ్ చేశాడు. ఇక నామినేషన్స్ లో పోటుగాళ్లు వర్సెస్ ఆటగాళ్లు అన్నట్లు సాగింది. నిన్న నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవ్వగా.. అందరూ ఎవరికి తోచిన రీజన్స్ చెప్పి వాళ్లు నామినేట్ చేశారు. ఇక గౌతమ్ కూడా నామినేట్ వేయాలి కాబట్టి... ఆయన్ని బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని బిగ్ బాస్ సూచించాడు.

ఇక తాజాగా విడుదల అయిన ప్రోమో చూస్తే గనుక.. గౌతమ్ మంచి ఫైర్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. తనను తాను హై రేంజులో ఊహించుకుంటున్నాడు గౌతమ్. చూపిస్తా ఒక్కోక్కరికి... గుద్దుతా అంటూ రెచ్చిపోయాడు. ఇక బిగ్ బాస్ నుంచి ఆదేశం వచ్చింది. మీ సీక్రెట్ రూమ్ టాస్క్ ఓవర్ అయింది.. మీరు హౌజ్ లోకి వెళ్లాలి అంటూ బిగ్ బాస్ గౌతమ్ కు చెప్తాడు. దానికి రెడీ బిగ్ బాస్.. అంటూ గౌతమ్ బ్యాగ్ సర్దేసుకుంటాడు.

ఇక హౌజ్ లోకి ఎంటర్ అయ్యే టైం.. అందరూ అక్కడ నిలబడి ఉంటారు. కేజీఎఫ్, బహుబలి ఎలివేషన్... రాననుకున్నారా? రాలేననుకున్నారా... అంటూ బిగ్ బాస్ లోకి గౌతమ్ అడుగుపెడతాడు. అశ్వద్ధామ ఈజ్ బ్యాక్ అని తనను తాను అశ్వద్ధామతో పోల్చుకున్నాడు గౌతమ్. తేనే పూసిన కత్తిని గొంతులో దింపారు కదా.... అయినా ఈ అశ్వద్ధామ చావడు అని అరుస్తూ... బిగ్ బాస్ హౌజ్ లోకి రీ ఎంట్రీ ఇస్తాడు. ఇక ఇది చూసిన నెటిజన్స్... బహుబలి రేంజులో ఎంట్రీ ఉందిగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరోవైపు కంటెస్టెంట్స్.. అంతా గౌతమ్ ను చూసి షాక్ అవుతారు. ఇక గౌతమ్ మాట్లాడుతూ... శివన్నా.. నిన్న మీరు ఒకటి అన్నారు కదా.. గౌతమ్ అయితే ఎక్కువ ఎంటర్‌ టైన్ చేయలేడేమో అని... ఎంటర్‌టైన్మెంట్ అంటే ప్యాంట్ విప్పేసి తిరగడం కాదు కదా అంటూ శివాజీపై ఫైర్ అయ్యాడు గౌతమ్. ఇక దానికి బట్టలు విప్పడం ఎంటర్‌టైన్మెంటా అని నువ్వు ఇంతమంది ముందు అన్నావు. 100 సినిమాల్లో చేశాను నేను బట్టలు లేకుండా. నేను యాక్టర్. నేను ఏమైనా చేయగలను అంటూ శివాజీ సైతం రెచ్చిపోయాడు. ఇక లైవ్ ఎపిసోడ్ లో ప్రశాంత్ పై కూడా ఫైర్ అయినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X