Bigg Boss Telugu 7 రైతు బిడ్డ మెడకు డెడ్ బోర్డ్.. పల్లవి ప్రశాంత్‌కు షాకిచ్చిన గౌతమ్!
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో 9వ వారం టాస్క్‌లతో కంటెస్టెంట్లు మోత మోగించారు. కెప్టెన్సీ, లగ్జరీ బడ్జెట టాస్క్ కోసం ఫస్ట్ పవర్ బాక్స్ అంటూ ఓ ఆటను మొదలుపెట్టారు. ఇంటిలోని సభ్యులను రెండు టీములుగా విడదీశారు. ఒక టీమ్‌ను వీర సింహాలు, రెండో టీమ్‌ను గర్జించే పులులు అంటూ పేర్లు పెట్టారు. ఈ టాస్క్ సందర్భంగా జరిగిన విషయాలు ఏమిటంటే..
బిగ్‌బాస్ హౌస్‌లో ఫస్ట్ పవర్ బాక్స్ గేమ్ సందర్భంగా బెలూన్ గేమ్ ఆడించారు. బెలూన్‌ను ఒకరు ఊదితే.. మరొకరు ఓ గోడలాంటి రాడ్‌ను ఎక్కి అవతల పక్క ఉన్న టైర్లలో ఊదిన బెలూన్లను అతికించాలి. ఒకరు ఒకేసారి ఊదాలని, అతడే బెలూన్ మూతి కట్టి మరో కంటెస్టెంట్‌కు ఇస్తే అతడు గోడ లాంటి కంచెను దూకి బెలూన్లను నిర్దేశిత ప్రదేశంలో అతికించాలి.

వీర సింహాలు టీమ్ నుంచి టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ పాల్గొనగా.. గర్జించే పులులు టీమ్ నుంచి పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటి వచ్చారు. తొలుత పల్లవి ప్రశాంత్ బెలూన్లు వేగంగా ఊదినప్పటికీ.. ఆ తర్వాత వెనకబడి పోయాడు. ఈ గేమ్‌లో టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ టీమ్ గెలిచింది.
ఫస్ట్ పవర్ బాక్స్ గేమ్ అనంతరం వీర సింహాలు జట్టుకు ఓ పవర్ లభించింది. ఆ పవర్ ప్రకారం ప్రత్యర్థి జట్టు నుంచి ఒకరిని తీసేయాల్సి ఉంటుంది. అలా తీసేసిన కంటెస్టెంట్ రానున్న గేమ్‌లో ఆడకుండా.. తమ జట్టు కోసం ఎలాంటి వ్యూహాలు పన్నకుండా ఉండాల్సి ఉంటుంది. ఆ కంటెస్టెంట్ ఎల్లప్పుడు డెడ్ బోర్డు వేసుకొనే ఉండాల్సి ఉంటుంది. అలా ప్రస్తుత వారం ఆ కంటెస్టెంట్ గేమ్ దూరంగా ఉండాలని అని బిగ్‌బాస్ రూల్ చెప్పారు.
పవర్ బాక్స్ గేమ్‌లో పవర్ లభించిన తర్వాత వీర సింహాలు జట్టు నుంచి గౌతమ్ కృష్ణ నుంచి మాట్లాడుతూ.. ఈ వీక్‌లో అమర్ దీప్, ప్రియాంక , అర్జున్ నామినేషన్‌లో ఉన్నారు. శివాజీ కూడా గాయం కారణంగా ఆడలేకపోయారు. అశ్వీనీకి కూడా ఛాన్స్ లభించలేదు. అందు వలన పల్లవి ప్రశాంత్‌ను గేమ్ నుంచి తీసేస్తున్నాం అని గౌతమ్ షాక్ ఇచ్చాడు.
అయితే గౌతమ్ చెప్పిన కారణాలపై పల్లవి ప్రశాంత్ జట్టు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలు చెప్పి తీయడం తప్పా? అని గౌతమ్ అన్నారు. ఇది గేమ్‌లో ఓ భాగం మాత్రమే. పల్లవి ప్రశాంత్‌ను కాకుండా వేరే ప్లేయర్‌ను తీస్తే ఒకేనా అని గౌతమ్ పాయింట్ అవుట్ చేశాడు.


Click it and Unblock the Notifications











