బిగ్ బాస్ ఫైనల్‌లో షాకింగ్ రిజల్ట్: ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ భారీ ఆఫర్.. షో నుంచి ఇద్దరే ఔట్!
బిగ్ బాస్ షో మరో సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకునే సమయం వచ్చేసింది. ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేతో నాలుగో సీజన్ ముగియనుంది. దీంతో ఈ సారి ఎవరు విజేతగా నిలుస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రైవేటు పోల్స్ అన్నీ ఏకగ్రీవంగా తీర్పు ఇస్తున్నా.. అధికారికంగా జరిగే ఓటింగ్‌లో ఎలాంటి ఫలితం వస్తుందోనన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫినాలే ఎపిసోడ్ షూట్ మొదటి పార్ట్ శనివారమే ముగిసింది. ఇందులో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఆ సమయంలో ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

ఆదివారమే గ్రాండ్ ఫినాలే.. అన్నీ ఫిక్స్
బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం జరగనుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎపిసోడ్‌లో విన్నర్‌ను ప్రకటించనున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే, కొందరు సినీ తారలు ఆటపాటలతో అలరించనున్నారు. నాలుగు గంటల పాటు సాగే ఈ ఎపిసోడ్ కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు.

ఓటింగ్‌లో చివరి స్థానం.. ఆమె అవుట్
గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. దీని ప్రకారం.. ఓటింగ్‌లో చివరి స్థానం దక్కడంతో దేత్తడి హారిక ఐదో స్థానంలో నిలవడంతో పాటు షో నుంచి ముందుగా ఎలిమినేట్ అయిందట. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఆమె.. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫైటర్‌గా గుర్తింపు తెచ్చుకుని ఫినాలేలో అడుగుపెట్టినా నిరాశే ఎదురైంది.

నలుగురు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ గిఫ్ట్
దేత్తడి హారిక ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్, అభిజీత్, అఖిల్ సార్థక్‌లు మిగిలారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నలుగురు కంటెస్టెంట్లకు హోస్ట్ అక్కినేని నాగార్జున భారీ ఆఫర్ ఇచ్చాడట. ‘మీ నుంచి ఎవరైతే వెళ్లిపోవాలనుకుంటున్నారో.. వాళ్లకు రూ. 10 లక్షలు ఇస్తా' అని చెప్పాడని తెలిసింది.

భారీ ఆఫర్‌ను అందరూ తిరస్కరించారు
హౌస్‌లో ఉన్న ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్, అభిజీత్, అఖిల్ సార్థక్‌లు నాగార్జున ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించారని సమాచారం. డబ్బులు ముఖ్యం కాదు.. ప్రేక్షకుల అభిమానమే ముఖ్యం అన్నట్లుగా వాళ్లంతా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఇన్ని వారాల పాటు నెగ్గుకుంటూ వచ్చిన నమ్మకంతో వాళ్లంతా బయటకు వెళ్లేందుకు సమ్మతించలేదని తెలుస్తోంది.

షో నుంచి రెండో కంటెస్టెంట్ ఎలిమినేట్
నాగార్జున ఇచ్చిన రూ. 10 లక్షలు అందరూ తిరస్కరించడంతో ఓటింగ్ రిజల్ట్‌ను ఫాలో అయ్యాడట బిగ్ బాస్. ఇందులో దేత్తడి హారిక తర్వాత ఆరియానా గ్లోరీకే తక్కువ ఓట్లు పోలయ్యాయని సమాచారం. దీని ప్రకారం నాలుగో స్థానంలో ఉన్న ఆమెను బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడట హోస్ట్ నాగార్జున. దీంతో ముగ్గురు మగ అభ్యర్థులే తుది పోరులో ఉన్నారు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్‌లో షాకింగ్ రిజల్ట్
వాస్తవానికి మూడు సీజన్లను మగ కంటెస్టెంట్లే గెలుచుకోవడంతో, ఈ సారి కచ్చి లేడీనే విజేతగా చేసే అవకాశాలున్నాయని అంతా అనుకున్నారు. అయితే, బయట పరిస్థితి వేరుగా ఉండడంతో రన్నరప్ అయినా ఇస్తారని భావించారు. కానీ, ఊహించని విధంగా ఇద్దరు అమ్మాయిలు హారిక, ఆరియానా మొదటి దశలోనే ఎలిమినేట్ అవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.


Click it and Unblock the Notifications











