కౌశల్ మరోసారి బలి.. అంతా ఏకమై... బిగ్‌బాస్‌లో జోరుగా గ్రూప్ పాలిటిక్స్!
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు షో 75వ రోజును గ్రూపు రాజకీయాలు జోరందుకొన్నాయి. ఇంట్లోకి వచ్చిన నీవెవరివో చిత్ర హీరో, హీరోయిన్లు ఆది పినిశెట్టి, తాప్సీ, రితిక సింగ్ వెళ్లిన తర్వాత ఇంట్లో సభ్యుల మధ్య రొటీన్ పాలిటిక్స్ మొదలయ్యాయి. కెప్టెన్సీ టాస్క్ ఉండటంతో అవి మరింత స్పష్టంగా కనిపించాయి. కౌశల్‌కు వ్యతిరేకంగా ఇంటి సభ్యులందరూ ఏకమై దీప్తికి మద్దతుగా నిలిచారు. ఇంకా ఏమి జరిగిందటే..

నీవెవరివో హీరో, హీరోయిన్లు
నీవెవరివో సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన ఆది, తాప్సీ, రితిక ఇంటి సభ్యులతో గడిపారు. ట్రైలర్‌ను ఇంట్లో వారికి చూపించారు. ట్రైలర్ బాగుందని, చాలా ఇంట్రెస్ట్‌ను కలిగించిందని ఇంటి సభ్యులు ప్రశంసించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి హీరో, హీరోయిన్లు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు.

కెప్టెన్సీ టాస్క్ హడావిడి
నీవెవరివో టీమ్ నిష్క్రమించిన తర్వాత ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ప్రక్రియ మొదలైంది. దీప్తి కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ చేసేందుకు సన్నద్ధమైంది. అలాగే ఇంటి సభ్యులందరీ మద్దతు కూడగట్టింది.

కెప్టెన్సీ పోటీకి దీప్తి, కౌశల్
కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్‌బాస్ ఏం చేయాలో సెలబ్రిటీలకు చెప్పారు. యాక్టివిటీ రూంలో వేసిన సోఫాలో ముందు వెళ్లి ఎవరూ కూర్చునే ఇద్దరు సభ్యులకు కెప్టెన్సీ పోటీలకు అర్హులవుతారు అన్నారు. దాంతో బెల్ మోగిన వెంటనే పరుగెత్తికెళ్లి ముందు కూర్చున్న దీప్తి నల్లమోతు, కౌశల్ కెప్టెన్సీ టాస్క్ పోటీకి అర్హత సాధించారు.

దీప్తికి వన్‌సైడ్ మద్దతు
కెప్సెన్సీ టాస్క్‌లో భాగంగా ఇంటి ఆవరణలో రెండు తూకం మెషిన్లను ఉంచారు. ఇంటి సభ్యులు ఏ పోటీ దారుడికైతే ఎక్కువ బరువున్న వస్తువులు వేస్తారో ఆ వ్యక్తి ఈ వారం ఇంటి కెప్టెన్ అవుతారు అని బిగ్‌బాస్ రూల్స్ చెప్పారు. దాంతో దీప్తికి అందరూ మద్దతుగా నిలువాలని డిసైడ్ అయ్యారు. కేవలం అమిత్ మాత్రమే కౌశల్‌కు మద్దతు తెలిపాడు.

కౌశల్ చేసిన రిక్వెస్ట్‌ను
దీప్తికి ఇంటి సభ్యులు మద్దతు తెలుపడంతో తనకు కూడా సపోర్ట్ చేయాలని కౌశల్ చేసిన రిక్వెస్ట్‌ను పలు కారణాలు చెప్పి నిరాకరించారు. ఈ పోటీలో కౌశల్‌ను ఓడించాలనే కసి అందరిలో కనిపించింది. చివరకు ఎక్కువ బరువు ఉన్న వస్తువులు సొంతం చేసుకొన్న దీప్తి కెప్టెన్‌గా ఎంపికైంది.

దీప్తికి బిగ్‌బాస్ ఝలక్
కెప్టెన్ ఎన్నికైన దీప్తికి బిగ్‌బాస్ ప్రారంభంలోనే ఝలక్ ఇచ్చారు. దీప్తిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఇంటి నిబంధనలను పాటించే విధంగా కెప్టెన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంట్లో ఆటలు ఆడకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే కఠిన శిక్ష తప్పదని మరోమారు స్పష్టం చేశారు. దాంతో బయటకు వచ్చిన ఇంటి సభ్యులకు గట్టిగానే హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











