జబర్ధస్త్ వర్ష నిజస్వరూపం బట్టబయలు: అలా వీడియో కాల్స్.. గూగుల్ హిస్టరీ కూడా!

తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ఎంతో మంది షోలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్నాయి. అలాంటి వాటిలో జబర్ధస్త్ ఒకటి. దీని ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ వర్ష ఒకరు. అందంతో పాటు కామెడీతోనూ మెప్పిస్తోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జబర్ధస్త్ వర్షపై ఓ కమెడియన్ ఊహించని విధంగా కామెంట్లు చేశాడు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే!

వర్ష అలా పాపులర్
నటన మీద ఉన్న ఆసక్తితో వర్ష ముందుగా మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. అందులో తనదైన అందంతో మాయ చేసేసిన ఈ చిన్నది.. 'అభిషేకం' అనే సీరియల్‌తో యాక్టింగ్ కెరీర్‌ను మొదలుపెట్టుకుంది. అందులో కూడా అలరించడంతో ఆ తర్వాత 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి వాటిలో నటించే అవకాశం అందుకుని మంచి పేరు తెచ్చుకుంది.

Gully Boy Riyaz Unexpected Comments on Varsha in Jabardasth Show

జబర్ధస్త్‌లో హైలైట్

సీరియళ్ల ద్వారా నటిగా సత్తాను నిరూపించుకున్న వర్ష.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో ఆరంభంలోనే అదరగొట్టేయడంతో ఆమె బాగా హైలైట్ అయింది. దీంతో మరిన్ని స్కిట్లు చేసే ఛాన్స్ వచ్చింది. ఇలా వర్ష ఆ షోలో కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఇందులో ఇమాన్యూయేల్‌కు వర్ష జంటగా చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ సెన్సేషన్ అవుతోంది.

ఆ షోలతో బిజీగానే
జబర్ధస్త్ షోలో చాలా కాలంగా సందడి చేస్తోన్న వర్ష.. అప్పుడప్పుడూ సీరియళ్లలోనూ కనిపిస్తూ వచ్చింది. అదే సమయంలో జబర్ధస్త్‌, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగమై ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో అలరిస్తోంది. అలాగే, సినిమా నటిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని చిత్రాల్లో క్రేజీ రోల్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Gully Boy Riyaz Unexpected Comments on Varsha in Jabardasth Show

వర్షను ఆడుకునేలా

జబర్దస్త్ షోలో గ్లామర్‌తో పాటు టాలెంట్‌తోనూ మెప్పిస్తూ హైలైట్ అయిన వర్ష.. మరింత పేరు తెచ్చుకోవడానికి యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు నటిస్తోంది. అయితే, అతడు మాత్రం తరచూ ఆమె క్యారెక్టర్‌ను బ్యాడ్ చేసేలా కామెంట్లు చేస్తున్నాడు. అతడు మాత్రమే కాదు.. ఆమె చేస్తున్న స్కిట్లలో ప్రతి ఒక్కరూ వర్షతో ఆడుకుంటున్నారు.

రియాజ్ కామెంట్లు
గత వారం ప్రసారం అయ్యే జబర్ధస్త్ షోలో వర్షపై గల్లీ బాయ్ రియాజ్ హాట్ కామెంట్స్ చేశాడు. స్కిట్‌లో భాగంగా ఆమె అతడితో మాట్లాడింది. అప్పుడు ఈ కమెడియన్ 'వాట్సాప్ చాటింగ్‌లు, ఆ వీడియో కాల్స్ అన్నీ డిలీట్ చేసేయ్. మొన్న నీ ఫోన్‌లో గూగుల్ హిస్టరీ చూసే సరికి నేనే షాకయ్యా' అని ఆమె బండారం బయటపెట్టాడు. దీంతో ఇప్పుడు వర్ష మరోసారి హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X