ఓ ఇంటివాడైన గల్లీ బాయ్ రియాజ్.. అమ్మాయి ఎవరో, ఎంత చక్కగా ఉందో తెలుసా?
అదిరింది షో ద్వారా పాపులర్ అయిన రియాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జబర్దస్త్ ప్రోగ్రాంలా జీ తెలుగు అదిరింది అనే ఒక షో ఏర్పాటు చేయగా అందులో కొన్నాళ్ల పాటు రియాజ్ పాల్గొని అలరించాడు. అందులో రియాజ్ వైఎస్ జగన్ ను అనుకరిస్తూ చేసిన ఒక స్కిట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారంలో వైసీపీ అభిమానులు రియాజ్ ని టార్గెట్ చేయడంతో ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. ఆ తర్వాత జనసేనలో చేరి ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు. అయితే ఆ సంగతి అలా ఉంచితే రియాజ్ ఇప్పుడు ఓ ఇంటివాడు అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే

అదిరింది రియాజ్ గా
గల్లీ బాయ్ రియాజ్ అలియాస్ రింగ్ రియాజ్ అనే పేరు తెచ్చుకున్న షేక్ రియాజ్ నెల్లూరు లో పుట్టి పెరిగాడు.. మరుగుజ్జు రూపంలో చూడగానే నవ్వు తెప్పించే విధంగా ఉండే రియాజ్ తొలుత సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అదిరింది షో లో ఎంట్రీ ఇచ్చి సద్దాం హుస్సేన్ టీంతో కలిసి కొన్ని స్కిట్స్ చేసి మంచి ఫేమస్ అయ్యారు. అలా గల్లీబాయ్ రియాజ్ కాస్త అదిరింది రియాజ్ గా మారాడు.

అదిరింది రియాజ్ గా
అదిరింది షో ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆయనకు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చింది. అయితే రియాజ్ నటించిన సినిమాలు ఇప్పటి వరకు విడుదల కాలేదు. కానీ ఆయన నటించిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వెబ్ సిరీస్ ఇప్పటికే ఆహా ఓటీటీలో ప్రసారం అయింది. అలాగే బస్తీ బాయ్స్ అనే ఒక వెబ్ సిరీస్ నాగబాబు యూట్యూబ్ ఛానల్ లో విడుదలైంది.

సోషల్ మీడియాలో
నెమలి రాజుతో కలిసి రియాజ్ సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ వీడియోస్ చేసి మరింత ఫేమస్ అయ్యాడు. అదే సమయంలో జనసేన నుంచి నెల్లూరు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఎట్టకేలకు రియాజ్ ఒక ఇంటి వాడు అయ్యాడు. ఆయన వివాహం చేసుకున్నట్టు పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పెద్దలే కుదిర్చి
తాజా ఫోటోలు బయటకు రాలేదు కానీ ఎంగేజ్మెంట్ ఫోటోలని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కొంతమంది. నిజానికి రియాజ్ ఇంట్లో ఒక వేడుక జరిగింది. దానికి సంబందించిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వీడియోలో రియాజ్ కాళ్ళ మీద పడి పలువురు ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











