Gunde Ninda Gudi Gantalu: వదినను కొట్టిన బాలు.. సత్యంకు గుండెపోటు.. ప్రభావతి షాక్..
Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్నతూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' సోమవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.
శుక్రవారం ఎపిసోడ్ లో.. బాలు తన స్నేహితుడు రాజేశ్ తో కలిసి బార్ కు వెళ్తాడు. ఈ క్రమంలో బార్ లో బాలుకి షాకింగ్ సంఘటన ఎదురవుతుంది. వ్యక్తి తన భార్యను కొట్టడంతో తను ఫ్యానుకు ఉరివేసుకొని చనిపోయిందని, ఎవరు కూడా తమ భార్యలను తిట్టకూడదని హెచ్చరిస్తాడు. ఈ మాటలు విన్న బాలు తన భార్య మీనా గురించి ఆలోచిస్తాడు. మీనా ఏమైనా చేసుకుంటున్నాయేమో అని బాధపడతాడు. ఈ క్రమంలో బాలు తనకు తన మరో ఫ్రెండ్ కార్తీక్ ను తీసుకొని మీ నా ఇంటికి వెళ్లాలని భావిస్తాడు.

ఈ క్రమంలో టెన్షన్ భరించలేని మీనా కు ఫోన్ చేయమని బాలు తన ఫ్రెండ్ కు కాల్ చేయమని చెప్తాడు. ఫుల్ గా తాగిన బాలు ఫ్రెండ్ అసలు విషయం అడగకుండా ఏదో ఏదో విషయాలను అడిగి నవ్వుల పాలు అవుతాడు. ఇంతలో మీనా అసలు విషయం తెలుసుకుంటూనే బాలునే నా ఫ్రెండ్ తో ఫోన్ చేయించాడని గ్రహించి ఫోన్ కట్ చేస్తుంది. దీంతో మరింత టెన్షన్ పడ్డ బాలు మీనా ఇంటికి వెళ్తాడు. మరో వైపు బాలు చేతిలో గాయపడ్డ రవిని చూసి శృతి బాధపడుతుంది. ఇక నుండి వారికి మనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతోంది.
అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఫుల్లుగా తాగిన బాలు ఇంటికి చేరుకుంటాడు. ఈ విషయాన్ని గమనించిన తన తండ్రి సత్యం ఆగ్రహానికి గురి అవుతాడు. తన తల్లి కూడా బాధపడుతుంది. తను రెస్టారెంట్ కు వెళ్లి రవిని చితకబాదానని చెప్తాడు. ఈ క్రమంలో మనోజ్ కు బాలుకు మధ్య వాగ్వివాదం జరుగుతుంది. ఈ క్రమంలో బాలు తన అన్న మనోజ్ పై చేయి చేసుకుంటాడు. అడ్డువచ్చిన మనోజ్ భార్య రోహిణి పై కూడా చేయి చేసుకుంటాడు బాలు.
ఈ ఘటనతో ఇంటిల్లిపాది షాక్ కు గురవుతారు. ఆ విషయాన్ని చూసిన బాలు తండ్రి సత్యం కు చాలా కోపం వస్తుంది. 'అరే బాలు. నా కడుపున చెడబుట్టావురా' అంటూ ఛాతీపై పట్టుకుని సోఫాలో కుప్పకూలతాడు. దీంతో ఇంట్లో వారందరూ సత్యానికి ఏమైందని కంగారు పడతారు. ప్రభావతి బాలుని నానా మాటలు అంటుంది. మరోవైపు మీనాకు ఏదో అనర్థం జరిగినట్లు కనపడుతుంది దీంతో ఉలిక్కిపడి లేస్తుంది మీనా.


Click it and Unblock the Notifications











