Gunde Ninda Gudi Gantalu Weekly: తెలిసిపోయిన అసలు నిజం.. మనోజ్, రోహిణికి షాక్.. అసలు బాలు ఏం చేశాడంటే!
ఇండియాలో ఎన్నో భాషలు ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!
12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
12వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. బాలును అత్తగారి ఇంటి దగ్గర నుంచి వచ్చేయమని ఫోన్ చేయమని ప్రభావతి తన భర్త సత్యంతో చెప్తుంది. అంతలోనే అక్కడకు బాలు వచ్చి నేను వచ్చేశాను అని అంటాడు. అంతేకాదు, తనతో వచ్చిన భార్యను కూడా చూపిస్తాడు. దీంతో ప్రభావతి రచ్చ రచ్చ చేస్తుంది. ఆ సమయంలోనే ఇంటికి ఓ కుర్రాడు సరుకులు తీసుకు వస్తాడు. వాటి బిల్లు 30 వేలు అవ్వడంతో బాలు నానా రభస చేస్తాడు. దీంతో ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు రోహిణి కోపంగా తీసుకు వచ్చి డబ్బులు ఇచ్చేస్తుంది. అంతేకాదు, ఇకపై మనోజ్ మాత్రమే ఇంట్లో ఖర్చు పెడతాడని చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
13వ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. బాలు చేసిన రచ్చతో రోహిణి బాగా ఫీల్ అవుతుంది. అప్పుడు మనోజ్ ఎలాగైనా జీతం తీసుకు వచ్చి ఇవ్వాలని తేల్చి చెప్తుంది. దీంతో ప్రభావతి, మనోజ్ షాక్ అవుతారు. మీనా కోసం చీర కొనడానికి బాలు ఆమెను కారులో తీసుకు వెళ్తుంటాడు. అప్పుడు రోడ్డు మీద వెళ్తున్న సుగుణమ్మ కళ్లు తిరిగి కింద పడిపోతుంది. అది చూసిన బాలు వాళ్లు ఆమెను ఆస్పత్రిలో చేర్చుతారు. అనంతరం చింటూను ఇంటికి తీసుకు వెళ్తారు. దీంతో ప్రభావతి.. మీనా, బాలుపై సీరియస్ అవుతుంది. అదంతా చూసిన రోహిణి.. వెంటనే తల్లి కోసం ఆస్పత్రికి చేరుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
14వ తేదీ బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రికి వచ్చిన రోహిణి తన తల్లిని తిడుతుంటుంది. అంతేకాదు, అసలు చింటూను వాళ్లతో ఎందుకు పంపించావు అని నిందిస్తుంది. అంతలో అక్కడకు బాలు వాళ్లు వస్తున్నారని తెలుసుకుని దాక్కుంటుంది. అప్పుడు సుగుణమ్మను బాలు, మీనా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. కానీ, ఆమె సరైన సమాధానాలు చెప్పదు. దీంతో మీనాకు డౌట్ వస్తుంది. అనంతరం రోహిణి ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. దీంతో మీనా సందేహం నిజం అవుతుంది. తర్వాత రోహిణి తన ఫ్రెండ్ ఇంట్లో తల్లిని, కొడుకుని ఉంచుతుంది. మనోజ్ మాత్రం ఉద్యోగం పోయిన బాధలో ఉంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
15వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రభావతి ఇంటికి ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వస్తారు. వాళ్లు వచ్చీ రాగానే బాలు ఏమైనా చేశాడా అని ప్రభావతి అడుగుతుంది. కానీ, ఆ కానిస్టేబుళ్లు మాత్రం మనోజ్‌ను పిలవమని అనడంతో అందరూ కంగారు పడిపోతారు. అప్పుడు మనోజ్ రాగానే కల్పనపై కేసు పెట్టింది మీరే కదా అని అడుగుతారు. గతంలో కల్పన.. మనోజ్‌ను ప్రేమ పేరుతో మోసం చేసి 40 లక్షలు కాజేస్తుంది. అలా హైడ్రామా నడుమ బాలు, మీనా పెళ్లి జరుగుతుంది. ఇక, మీనాను అక్కడ చూసిన ఓ కానిస్టేబుల్.. ఈ అమ్మాయి వాళ్ల తమ్ముడే బాలు బైక్ దొంగతనం చేశాడు కదా అంటూ చెప్పి షాకిస్తాడు.
16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
16వ తేదీ శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పోలీసుల ద్వారా దొంగతనం గురించి తెలుసుకున్న ప్రభావతి.. మీనాను నోటికి వచ్చినట్లు తిడుతుంది. అంతేకాదు, ఆమె ఫ్యామిలీపైన కూడా చాలానే నిందలు వేస్తుంది. దీంతో మీనా ఏడుస్తూ ఇక ఆపేయమని బ్రతిమాలుతుంది. కానీ, ప్రభావతి మాత్రం అస్సలు తగ్గదు. తల్లి ఫోన్ చేయడంతో మీనా నిరాశగా మాట్లాడుతుంది. దీంతో ఆమె ఏమైందని అడగ్గా.. ఇంట్లో జరిగిన గొడవ మొత్తం వివరించి చెప్తుంది. అప్పుడే కొడుకు రావడంతో అతడిని కొట్టి విషయం చెప్తుంది. దీంతో ప్రభావతి వాళ్లకు సారీ చెప్తానని వెళ్తాడు. అక్కడ ప్రభావతి, మనోజ్ అతడిని ఘోరంగా అవమానిస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
ఆగస్టు 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ ఎన్నో ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ వారంలో బాలు, మీనా తిరిగి ఇంటికి రావడం, తర్వాత సుగుణమ్మను కాపాడి ఆస్పత్రిలో చేర్పించడం హైలైట్ చేశారు. కానీ, నిజం తెలియకుండా రోహిణి తప్పించుకున్న విధానం కూడా చూపించారు. ఇక, మీనా తమ్ముడు గతంలో చేసిన దొంగతనం గురించి ఇప్పుడు ప్రభావతి ఇంట్లో రచ్చ జరగడం ఆసక్తికరంగా మారింది. ఇక, బాలు ఎంట్రీ ఇవ్వడంతో ఈ గొడవ కొత్త మలుపు తీసుకోబోతుంది.


Click it and Unblock the Notifications











