Gunde Ninda Gudi Gantalu Weekly: పెద్ద తప్పు చేసిన మీనా.. బాలుకు నిజం తెలిస్తే.. లక్ష మేటర్ ఏమైందంటే!
ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!
19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
19వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మనోజ్ జేబులు చెక్ చేస్తున్న సమయంలో శివ పొరపాటున అతడి కాలర్ పట్టుకుంటాడు. దీంతో రోహిణి వచ్చి శివను కొడుతుంది. తర్వాత అతడిని గెంటేయబోతుంటే బాలు వస్తాడు. వచ్చీ రావడమే అతడిని వెనక్కి తీసుకు వచ్చి అందరికీ క్లాస్ పీకుతాడు. తర్వాత వాడిని ఏమైనా అంటే మనోజ్ మీద కేసు పెడతానని అంటాడు. అనంతరం శివకు అన్నం పెట్టి పంపించమని మీనాకు చెప్తాడు. ఇక, రవిని కొట్టడానికి సురేంద్ర రౌడీలను పంపిస్తాడు. అతడు వాళ్లతో కలబడుతూ ఉండగా బాలు చూసి ఆ రౌడీలను కొడతాడు. తర్వాత సురేంద్ర ఇంటికి కోపంగా వెళ్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
20వ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రవిపైకి రౌడీలను పంపించడంతో బాలు నేరుగా సురేంద్ర ఇంటికి వెళ్లి ఆయనను కొడతాడు. ఆ సమయంలో సురేంద్ర వాళ్లు రవి తమ అమ్మాయి వెంట పడుతున్నాడని చెబుతారు. దీనికి రవి మౌనంగా ఉండడంతో బాలుకు విషయం అర్థం అవుతుంది. అనంతరం అదే కోపంతో ఇంటికి వచ్చిన అతడు మీనాపై అరుస్తాడు. తర్వాత ఆమె అలగడంతో బుజ్జగిస్తాడు. ఇక, మనోజ్ జాబ్ పోవడంతో బాధగా ఉంటాడు. అప్పుడు రోహిణి అతడిని ఇంకా టెన్షన్ పెట్టేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత మనోజ్ తన పాత కార్ షోరూంకు వెళ్లి ఉద్యోగం అడిగే ప్రయత్నం చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
21వ తేదీ బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కార్ షోరూంకు వచ్చిన మనోజ్.. ఆ ఓనర్‌ను తనకు రావాల్సిన శాలరీ ఇవ్వమని అడుగుతాడు. కానీ, ఆయన మాత్రం ఇవ్వనని తేల్చేస్తాడు. దీంతో గొడవపడుతూ మనోజ్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. తర్వాత రవికి శృతి కాల్ చేస్తుంటే అతడు లిఫ్ట్ చేయడు. దీంతో మీనాకు కాల్ చేసి రవి గురించి అడుగుతుంది. అప్పుడామె చికెన్ చేస్తున్నాను.. అయిన వెంటనే తీసుకొస్తాను అని రవితో కలిసి వెళ్తుంది. అప్పుడు మీనా గతంలో ఆపేసిన డబ్బింగ్ చెప్తుండగా.. శృతి, రవిని నిలదీస్తుంది. దీంతో అతడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమెకు ఐలవ్యూ అంటూ చెప్పేస్తాడు.

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
22వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. షోరూం ఓనర్‌తో గొడవపడి వచ్చిన మనోజ్‌తో రోహిణి హనీమూన్‌కు ఎలాగైనా టికెట్లు బుక్ చేయమని చెబుతుంది. దీంతో అతడు డబ్బు ఎలా తీసుకు రావాలని ఆలోచిస్తాడు. అప్పుడే తన తండ్రి తెచ్చిన లక్ష రూపాయలు గుర్తుకు వచ్చి.. వాటిని దొంగిలించాలని ప్లాన్ చేస్తాడు. అందుకు తగ్గట్లుగానే అందరూ పడుకున్న తర్వాత ఆ డబ్బు తీసుకుంటాడు. కానీ, ఆ సమయంలోనే బాలు, మీనా అక్కడకు వస్తారు. బాలు చికెన్ ఇష్టం అని వండించుకుంటే శనివారం అని ప్రభావతి తినొద్దని చెప్తుంది. అందుకే ఆ రాత్రి సమయంలో వచ్చి తింటాడు. అప్పుడు మనోజ్ దాక్కుంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
23వ తేదీ శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రభావతి బీరువా అంతటా వెతుకుతుంది. కానీ, అవి కనిపించవు. దీంతో ఆమె ఇంట్లో కంగారు పడుతూ అందరినీ పిలిచి అడుగుతుంది. అలా ఇంట్లో వాళ్లందరినీ ప్రశ్నించిన తర్వాత మీనా తమ్ముడు శివ మాత్రమే బయటి వ్యక్తి వచ్చాడని, డబ్బులు కూడా అతడే తీసి ఉంటాడని నిందలు వేస్తుంది. అప్పుడు బాలు తన బావమరిదికి సపోర్ట్ చేస్తాడు. దీంతో ప్రభావతి.. పార్వతమ్మకు కాల్ చేసి తిట్టడంతో ఆమె తన కొడుకును తీసుకుని అక్కడకు వస్తుంది. అప్పుడు కూడా ప్రభావతి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో బాలు.. శివకు సపోర్ట్ చేస్తాడు. పైగా మనోజ్‌పై నిందలు వేసి మాట్లాడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
ఆగస్టు 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ ఎన్నో ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ వారంలో మనోజ్ ఇంట్లో దొంగతనం చేయడం మళ్లీ శివకు ఇబ్బంది కలిగించింది. నిజం తెలియని ప్రభావతి మాత్రం మీనా ఫ్యామిలీపై నిందలు వేయగా.. బాలు వాళ్లు మాత్రం సపోర్ట్ చేస్తారు. ఇక, రవి గురించి మనోజ్‌కు నిజం తెలుస్తుంది. కానీ, మీనా మాత్రం వాళ్లకు సపోర్ట్ చేస్తుంది. దీంతో కథ రంజుగా మారింది. ఇక, వచ్చే వారంలో మనోజ్ డబ్బు దొంగతనం చేసింది తెలిసినట్లు చూపించారు.


Click it and Unblock the Notifications











