Gunde Ninda Gudi Gantalu Weekly: అడ్డంగా దొరికిన మనోజ్.. మళ్లీ దొంగగా మారిన శివ.. ప్రభావతికి బిగ్ షాక్

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
26వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. లక్ష రూపాయల గురించి తనకు తెలియదని శివ చెబుతున్నా ప్రభావతి మాత్రం వినదు. దీంతో అతడు 'బైక్ దొంగిలించడంతో మా నాన్నను పోగొట్టుకున్నాను. ఆ తర్వాత మారిపోయాను' అని ఏడుస్తాడు. అయినా ఆమె మాత్రం అనుమానపడుతూనే ఉంటుంది. అప్పుడు ఓ వ్యక్తి వచ్చి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశానని, మిగిలిన డబ్బు ఇదిగో అంటూ మనోజ్‌కు ఇస్తాడు. ఆ కవర్ చూసి గుర్తు పట్టిన బాలు.. అసలు దొంగ మనోజ్ అని కనిపెడతాడు. దీంతో ప్రభావతి యాక్టింగ్ చేస్తూ మనోజ్‌కు తానే డబ్బు ఇచ్చానని అంటుంది. తర్వాత పార్వతమ్మ వాళ్లకు క్షమాపణలు చెప్తుంది.

Gunde Ninda Gudi Gantalu Last Week roundup story August 26th to 30th Episodes highlights

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
27వ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రభావతి తప్పు చేసిందని తెలిసిన తర్వాత మీనా అసహనంగా ఉంటుంది. అందుకే అందరికీ కాఫీ ఇవ్వమన్నా ఆమె వద్దని తన ఫ్యామిలీ వాళ్లను పంపించేస్తుంది. తర్వాత బాలు వెళ్లి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. కానీ, మీనా మాత్రం తమను చులకనగా చూడడం బాధగా ఉందని అంటుంది. ఇక, మనోజ్ దొంగతనం గురించి తెలుసుకున్న ప్రభావతి.. అతడిని గదిలో పెట్టి యమా కొట్టుడు కొడుతుంది. దీంతో తాను మారతానని అంటాడు. తర్వాత తమ గదిలోకి వెళ్లగానే రోహిణి.. మనోజ్‌ను ప్రశ్నిస్తుంది. దీంతో అతడు తనను ఏమీ అడగొద్దని చెప్పి వెళ్లిపోతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

28వ తేదీ బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రభావతి వాళ్లు చేసిన అవమానంతో బాధలో ఉన్న మీనాను బాలు ఓదార్చుతాడు. దీంతో కరిగిపోయిన ఆమె అతడిని హత్తుకుని ముద్దులు పెడుతుంది. అప్పుడు బాలు టెంప్ట్ అయిపోతాడు. అలా ఇద్దరూ మరోసారి శారీరకంగా ఒక్కటవుతారు. ఆ తర్వాతి రోజు బాలు ఇకపై ఇంట్లో గొడవలు పెట్టొద్దని అంటాడు. అనంతరం మనోజ్ వాళ్లను లక్ష రూపాయలు అడుగుతాడు. దీంతో రోహిణి శాలరీ రాగానే ఇచ్చేస్తామని చెప్పి వెళ్లిపోతుంది. ఆ వెంటనే మనోజ్ ఆమె దగ్గరకు వెళ్లగా తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అప్పుడు ప్రభావతి వెళ్లి అబద్దాలు చెప్పి కవర్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Gunde Ninda Gudi Gantalu Last Week roundup story August 26th to 30th Episodes highlights

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

29వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన కోసం వచ్చిన శృతితో అందరూ ఒప్పుకుంటనే పెళ్లి చేసుకుంటాను అని రవి తేల్చి చెప్పేస్తాడు. దీనికామె కూడా ఓకే అంటుంది. అనంతరం మనోజ్ వచ్చి ఇంట్లో అందరినీ పిలుస్తాడు. అంతేకాదు, టికెట్లు క్యాన్సిల్ చేశానని, ఆ డబ్బు ఇచ్చేస్తానని చెప్తాడు. దీంతో బాలు అతడిని ఓ ఆట ఆడుకుంటాడు. ఆ తర్వాత అతడిని అవమానిస్తూ మాట్లాడడంతో రోహిణి కోపం వస్తుంది. అనంతరం రూమ్‌లోకి వచ్చిన మనోజ్‌పై ఫైర్ అవుతుంది. తర్వాత మనోజ్ గురించి బాలు వాళ్లు మాట్లాడుకునేది విన్న రోహిణి.. నేరుగా అతడి ఆఫీస్‌కు వెళ్తుంది. కానీ, అతడు అక్కడ ఉండడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

30వ తేదీ శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రోహిణి కాల్ చేయడంతో మనోజ్ అబద్ధాలు చెప్పి ఆమెను పంపించేస్తాడు. ప్రభావతికి వర్ధన్ నుంచి కాల్ వస్తుంది. అవతలి వ్యక్తి మలేషియా నుంచి కాల్ చేస్తున్నా అంటాడు. అంతేకాదు, రోహిణిని కూడా అడుగుతాడు. ఈ విషయం రోహిణికి చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. అనంతరం వడ్డీ కట్టించుకునే గూండాలు వస్తారు. వచ్చిన వెంటనే డబ్బులు కట్టమని గొడవ చేయడంతో ప్రభావతి తానే తీసుకొస్తా అంటుంది. తర్వాత ఆమె అలా వెళ్తుండగా బాలు వాళ్లకు డౌట్ వస్తుంది. ఆ సమయంలో శివ తన స్నేహితుడితో ప్రభావతి చేసిన అవమానం గురించి మాట్లాడుతుంటాడు. అంతలో ఆమె అక్కడ దిగుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Gunde Ninda Gudi Gantalu Last Week roundup story August 26th to 30th Episodes highlights

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఆగస్టు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌ ఎన్నో ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ వారంలో మనోజ్ ఇంట్లో దొంగతనం చేసినట్లు నిజం తెలియడాన్ని హైలైట్ చేశారు. అలాగే, ప్రభావతి వడ్డీ విషయంలో ఇబ్బందులు పడడం, శివకు అతడి ఫ్రెండ్ కలవడంతో కథ రంజుగా మారింది. ఇక, వచ్చే వారంలో శివ మళ్లీ దొంగగా మారి ప్రభావతి డబ్బులు కొట్టేయడాన్ని చూపించారు. దీంతో ఆమెకు చిక్కులు ఎదురవబోతున్నాయి. ఇదంతా మరింత ఆసక్తికరంగా మారబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X