Gunde Ninda Gudi Gantalu Weekly: చింటూను తీసుకొచ్చిన మీనా.. అత్తకు షాకిచ్చిన రోహిణి.. సూపర్ ట్విస్ట్

అభిరుచిలో మార్పులు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!

05వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
05వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆషాడానికి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత మీనాతో ఆమె తల్లి, చెల్లి మాట్లాడతారు. అప్పుడు ప్రభావతి అర్ధరాత్రి ఫోన్ చేసి ఆమెను తీసుకు వెళ్లమన్న విషయాన్ని బయటపెడుతుంది. గజా మనుషులు బైక్ మీద వెళ్తూ మీనాను చూస్తారు. అందులో ఒకడు 'మీనా ఒంటరిగానే పుట్టింటికి వచ్చింది. ఆ బాలు గాడు రాలేదు అనుకుంటా. వెంటనే ఈ విషయం అన్నకు చెప్పాలి' అని వెళ్తారు. అనంతరం రోహిణికి ప్రభావతి దిష్టి తీస్తుంది. అంతేకాదు, మీనా, బాలుకు శోభనం అయిందని, అయినా వాళ్ల కంటే ముందే నువ్వే తల్లివి కావాలని రోహిణికి చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu Last Week roundup story August 5th to 9th Episodes highlights

06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
06వ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రోహిణి తన తల్లిని తీసుకుని ఆస్పత్రికి వస్తుంది. అప్పుడు డాక్టర్ ఆమె పరిస్థితి బాలేదని అంటాడు. దీంతో రోహిణిని మనోజ్‌కు నిజం చెప్పేయమని ఆమె తల్లి అడుగుతుంది. అప్పుడు తల్లిపై సీరియస్ అవుతుంది. అనంతరం రవి దగ్గరకు శృతి వస్తే ఆమె ఎవరో తెలియనట్లుగా మాట్లాడతాడు. దీంతో ఆమె నిలదీయగా అసలు విషయం చెబుతాడు. తర్వాత ఆకలితో ఉన్న బాలు.. మీనాకు కాల్ చేయగా ఆమె రమ్మని చెబుతుంది. ఇక, మనోజ్ కారు అమ్మే విషయంలో తప్పు చేయడంతో ఓనర్ అతడిని ఉద్యోగంలో నుంచి తీసేసి బయటకు పంపేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

07వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
07వ తేదీ బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. చింటూ అత్త అని పిలవడంతో రోహిణి కోప్పడుతుంది. దీంతో ఆ బుడ్డోడు బాధపడుతూ నాకు అమ్మలేదని అందరూ ఏడిపిస్తున్నారు అని చెబుతాడు. అంతేకాదు, ఒక్కసారి వాళ్ల ముందు నిన్ను అమ్మ అని పిలుస్తా అంటాడు. దీంతో రోహిణి ఏడుస్తుంది. అనంతరం రవి కోసం శృతి రెస్టారెంట్‌కు వస్తుంది. అప్పుడు అతడు సరిగా మాట్లాడకుండా దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో శృతి అతడికి ప్రపోజ్ చేసి ముద్దు పెడుతుంది. అదంతా చూసి శృతి పేరెంట్స్ కోప్పడతారు. అంతేకాదు, సురేంద్ర.. సత్యంకు ఫోన్ చేస్తాడు. కానీ, సత్యం మాత్రం సురేంద్రను లెక్కచేయడు.

Gunde Ninda Gudi Gantalu Last Week roundup story August 5th to 9th Episodes highlights

08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
08వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన ఉద్యోగం పోయిన విషయాన్ని మనోజ్ తల్లి ప్రభావతికి చెప్తాడు. దీంతో ఆమె కంగారు పడిపోతూ అతడిపై అరుస్తుంది. తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని సలహాలు ఇస్తుంది. అప్పుడే కంగారుగా ఇంటికి వచ్చిన సత్యం.. బాలుకు వంట చేయలేదని ప్రభావతిపై సీరియస్ అవుతాడు. ఆ వెంటనే బాలుకు కాల్ చేయగా అతడు అత్తగారింట్లో ఉన్న విషయం చెప్తాడు. దీంతో ప్రభావతి కంగారు పడిపోతుంది. అనంతరం బాలు ఇంటికి వెళ్లబోతూ మీనా ఇంటి ముందు గజ మనుషులను చూసి ఆగిపోతాడు. కానీ, పార్వతమ్మ మాత్రం ప్రభావతి గురించి భయపడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

09వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
09వ తేదీ శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మీనా ఇంటికి బాలు వెళ్లిపోవడంతో ప్రభావతి కోపంగా ఉంటుంది. వెంటనే పార్వతమ్మకు కాల్ చేసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. అప్పుడు మీనా ఏమైనా అడగాలంటే బాలుకే కాల్ చేయమని చెబుతుంది. అనంతరం మీనా కోసం ఇంటి ముందు వేచి చూస్తున్న గజ.. డాబా మీదకు వెళ్లి చూస్తాడు. అక్కడ బాలు ఉండడంతో షాక్ అవుతాడు. వెంటనే అతడితో బాలు ఫైటింగ్ చేస్తాడు. అప్పుడు పక్కన ఇళ్ల వాళ్లు కూడా వచ్చి గజకు వార్నింగ్ ఇవ్వడంతో వెళ్లిపోతాడు. తర్వాత సత్యాన్ని కలిసి సురేంద్ర నిజం చెప్పడంతో ఇకపై శృతిని కలవొద్దని రవికి ఆర్డర్ ఇస్తాడు. బాలు విషయంలో ప్రభావతి కోపంగా ఉంటుంది.

Gunde Ninda Gudi Gantalu Last Week roundup story August 5th to 9th Episodes highlights

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌ ఎన్నో ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ వారంలో బాలు.. మీనా వాళ్ల ఇంటికి వెళ్లడం, అక్కడ గజతో గొడవకు దిగడాన్ని హైలైట్ చేశారు. మరోవైపు, రవి, శృతి ప్రేమ వ్యవహారం అందరికీ తెలియడం వాళ్లకు ఇబ్బంది కలిగేలా చేసింది. దీంతో ఈ జంట ఏమవుతుందో అన్న ఆసక్తిని రేకెత్తించారు. ఇక, వచ్చే వారంలో రోహిణి కొడుకును బాలు, మీనా ఇంటికి తీసుకు రావడం మరింత ఆసక్తిని పెంచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X