Gunde Ninda Gudi Gantalu Weekly: బాలుకు మౌనిక జలక్.. ప్రభావతికి శ్రుతి షాక్.. బాలు మాస్టర్ ప్లాన్..

Gunde Ninda Gudi Gantalu Weekly: గుండె నిండా గుడి గంటలు సీరియల్ గతవారం అంటే డిసెంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్27వ తేదీ వరకు ప్రసారమైన 'గుండె నిండా గుడి గంటలు'సీరియల్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో.. ఓ లుక్కేయండి మరి!

సోమవారం డిసెంబర్ 23వ తేదీన ఎపిసోడ్ లో సోమవారం ఎపిసోడ్లో మౌనిక పెళ్లి చూపులు జరుగుతాయి. పెళ్లి చూపుల సమయంలో ఏ చీర కట్టుకోవాలని మీనా బాలుని అడుగుతుంది. తనకు సెలక్షన్ రాదనడంతో మీనా అలుగుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి కంగారుపడుతూ ఆగమాగం చేస్తుంది. అనవసరంగా టెన్షన్ పడొద్దు అంటూ బాలు కామెంట్ చేస్తాడు. తాను ఉండడం లేదని, అబ్బాయి వాళ్లు జాగ్రత్తగా గమనించమని మీ నాకు చెబుతాడు. ఈ సమయంలో మీనా ను ప్రభావతిని అవమానిస్తుంది. పెళ్లి వారు వచ్చినప్పుడు వారి ముందు తిరుగుతూ కనిపించని తాము పూలు అమ్ముకునే వాళ్ళ సంబంధం చేసుకున్నామని వాళ్లు అవమానిస్తారని హేళన చేస్తుంది. దీంతో బాలుకి కోపం వస్తుంది. లక్షల మింగినోడా అంటూ తన అన్నయ్యని పిలిచి నువ్వు కూడా అటు ఇటు తిరగకు వాళ్లకి నువ్వు 40 లక్షలు మింగిన విషయం తెలుస్తుందనీ, మన పరువు పోతుంది అంటూ బాలు దిమ్మ తిరిగి పంచు వేస్తాడు. మరోవైపు పెళ్లివారు ఇంటికి ఇంటికి చేరుకుంటారు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story December 23th to December 27th Episodes highlights

మంగళవారం డిసెంబర్ 24వ ఎపిసోడ్ లో సంజూ.. మౌనిక తో పర్సనల్ గా మాట్లాడుతాడు. ఈ సమయంలో తాను రెండు తప్పులు చేశానని ఒకటి గతంలో తనకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని, కానీ ఆ అమ్మాయి తనని మోసం చేసి వెళ్లిపోయిందని చెబుతాడు . ఆ సమయంలోనే తనకు నువ్వు పరిచయం అయ్యావని చెబుతోంది. అలాగే బాలుతో తనకు బార్లో గొడవ జరిగిందని, ఆ విషయంలో తాను బాలుకి సారీ చెప్పాలని ప్రయత్నిస్తున్నానంటూ సంజీవ్ తన మాటలతో మౌనికను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత మౌనిక సంజీవ్ నచ్చాడు అనడంతో తాంబూలాలు మార్చుకోబోతారు. ఇంతలోనే బాలు వచ్చి .. సంజీవ్ ని గుర్తుపట్టి.. తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయబోనని వార్నింగ్ ఇచ్చి పెళ్లి సంబంధం చెడగొడతాడు. దీంతో ఇంటిల్లిపాది బాలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఈ సమయంలో ప్రభావతి ఆగ్రహానికి లోనై బాలుని కొడుతుంది. సంజీవ్ ఇలాంటి వాడో చెప్పడానికి ప్రయత్నించిన వారు బాలు మాటను పట్టించుకోరు. దీంతో బాలు తన చెల్లెలు జీవితం గురించి ఆందోళన చెందుతాడు.

బుధవారం డిసెంబర్ 25న ఎపిసోడ్ లో బాలు తన ఫ్రెండ్ రాజేష్ దగ్గరికి వెళ్లి అసలు విషయాన్ని చెపుతాడు. సంజు గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇంతలోనే నీలకంఠం దగ్గర వర్క్ చేసిన వ్యక్తి పరిచయం అవుతాడు. నీలకంఠం పెద్ద రియల్ ఎస్టేట్ అని, రౌడీషీటర్ అని సెటిల్మెంట్ దందాలు చేస్తాడని, వాడి కొడుకు వాడి కంటే వెధవన్నర వెధవ అని షాకింగ్ విషయాలను వెల్లడిస్తాడు. ఆ విషయాలన్ని తన ఇంటికి వచ్చి చెప్పమని బాలు రిక్వెస్ట్ చేస్తాడు. తీరా ఆ వ్యక్తి ఇంటికి వచ్చాక ప్లేట్ ఫిరాయిస్తాడు. వాళ్లు చాలా మంచివారిని, నీలకంఠం వల్లనే తన కూతురు చదువుకుంటుందని, ఆపదలో ఆదుకుంటారు అంటూ వారి గురించి గొప్పలు చెప్తాడు. దీంతో ఇంట్లో వారు బాలుని ఘోరంగా అవమానిస్తారు. తర్వాత బాలు తన స్నేహితులతో కలిసి బార్ కు వస్తాడు. ఆ సమయంలోనే తన ఇంటికి వచ్చే అబద్ధం చెప్పిన వ్యక్తిని చూసి ఆగ్రహంతో నిలదీస్తాడు. తాను పెళ్లి సంబంధం చెడగొట్టారని తెలిస్తే తనని చంపేస్తాడని, ఆ ఉద్దేశంతోనే అబద్ధం చెప్పానని అసలు విషయాన్ని బయటపడతాడు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story December 23th to December 27th Episodes highlights

గురువారం డిసెంబర్26న ఎపిసోడ్ లో నీలకంఠం నిజ స్వరూపాన్ని బయట ఎలా పెట్టాలని బాలు ఆలోచిస్తాడు. ఫుల్లుగా తాగి సంజీవ్ ఇంటికి వెళ్లి నానా రచ్చ చేస్తాడు. వాస్తవానికి బాలుకి తన తల్లిదండ్రులు అక్కడ ఉన్న విషయం తెలియదు. సంజీవ్ కాలర్ పట్టి కొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇంతలోనే సత్యం వచ్చి బాలుని కొడతాడు. దీంతో అవమానంగా భావించిన బాలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు తమ కొడుకు చేసిన తప్పుకు తాము క్షమాపణ చెప్తున్నామని తాంబూలాలు మార్చుకొని, పెళ్లి ముహూర్తం పెట్టుకుని వస్తారు. ఇంటికి వచ్చాక బాలుని సత్యం నిలదీస్తారు. ఇకనైనా పెళ్లి ఆపాలని ప్రయత్నాలు మానుకోమని, మరో రెండు రోజులలో మౌనిక పెళ్లి అంటూ షాకిస్తారు. దీంతో బాలు అన్ని దారులు మూసుకుపోయారని బాధపడతాడు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story December 23th to December 27th Episodes highlights

శుక్రవారం డిసెంబర్ 27న ఎపిసోడ్ లో మౌనిక పెళ్లి పనులలో మనోజ్, రోహిణి చురుకుగా పాల్గొంటారు. కానీ బాలు కాస్త దూరంగా ఉంటూ తన చెల్లి జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బాలుని మీనా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించిన ఫలితం ఉండదు. ఈ సమయంలోనే శిలా డార్లింగ్ ఎంట్రీ ఇస్తుంది. బాలు ప్రవర్తనపై అనుమానం వస్తుంది. అలాగే రవి ఎక్కడ ఉన్నాడని ఇంట్లో వారిని నిలదీస్తుంది. ఇదే అదునుగా భావించిన ప్రభావతి రవిని శృతిని ఇంటికి తీసుకొస్తానంటూ సత్యంతో వాదిస్తుంది. దీంతో సత్యం నీ ఇష్టం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. దీంతో వెంటనే రవి ఇంటికి ప్రభావతి వెళ్తుంది. మీ మౌనికకు పెళ్లి సెట్ అయిందని కచ్చితంగా రావాలని చెబుతోంది. కానీ తాము రాలేమని శృతి తెగేసి చెప్తుంది దీంతో అవమానంగా భావించిన ప్రభావతి బాధపడుతూ వెళ్ళిపోతుంది. మరోవైపు బాలు తన స్నేహితుడు రాజేష్ ను పిలిచి .. తాను సంజీవ్ ను కిడ్నాప్ చేయబోతున్నానని చెబుతాడు. అందుకు తాను కూడా సహాయం చేస్తానని రాజేష్ మాట ఇస్తాడు. మరోవైపు పెళ్లికి అందరూ సిద్ధమవుతారు. బాలు పెళ్లికి వస్తాడా రాడా అని సందేహంలో అందరూ ఉంటారు. కానీ, ఎవరు ఊహించిన విధంగా పంచెకట్టులో రెడీ పెళ్లికి రావడానికి సిద్ధమవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X