Gunde Ninda Gudi Gantalu Weekly: రోహిణీ ప్లాన్ ఫెయిల్.. సత్యం సంచలన నిర్ణయం.. మీనాకు స్పెషల్ గిఫ్ట్..
Gunde Ninda Gudi Gantalu Weekly: గుండె నిండా గుడి గంటలు సీరియల్ గతవారం అంటే డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 6 వ తేదీ వరకు ప్రసారమైన 'గుండె నిండా గుడి గంటలు'సీరియల్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో.. ఓ లుక్కేయండి మరి!
సోమవారం డిసెంబర్ 2వ తేదీన ఎపిసోడ్ లో శృతి హనీమూన్ వెళ్లాదామని ప్లాన్ చేస్తుంది. కానీ ఇప్పటికే ఇరు ఫ్యామిలీ లకు దూరంగా ఉన్నామని, ఇప్పుడు హనీమూన్ అవసరం లేదని రవి తేల్చి చెప్తాడు. మరోవైపు లేని జాబు గురించి మనోజ్ గొప్పలు చెప్తాడు. దీంతో వచ్చే నెల జీతం పెంచమని అడుగని సలహా ఇస్తోంది రోహిణీ. మరోవైపు ఆఫీసు వెళ్లడానికి కారు తీసుకోమని సత్యం సలహా ఇస్తాడు. రోహిణితో పార్లర్ వెళ్లాలని ప్రభావతి ప్లాన్ చేస్తోంది. కానీ, తాను పార్లర్ కు వెళ్లడం లేదని వేరే క్లైంట్ ను కలవడానికి వెళుతున్నానని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. మరోవైపు.. మీనా వంటచేసి తాను బయటికి వెళ్తుంది. మరోవైపు ప్రభావతి, మీనాక్షిలు బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. కానీ సాంబార్ పై మూత పెట్టక పోవడంతో బల్లి పడుతుంది. మరోవైపు..మీనా ఫైనాన్సర్ దగ్గరికి వెళ్లి కారు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ,ఆ ఫైనాన్స్ మీ నాతో మాట్లాడడానికి ఇష్టపడడు. దీంతో మీనా కలిసేదాకా వెళ్ళనంటూ అక్కడ్ని కూర్చుని ఉండిపోతుంది మీనా.

మంగళవారం డిసెంబర్ 3 వ ఎపిసోడ్ లో రవిని కలవడానికి ప్రభావతి వెళ్తుంది. త్వరలోనే అందరితో మాట్లాడి ఇంటికి తీసుకెళ్తానని చెప్పడంతో రవి సంతోషపడుతాడు. అయితే..ప్రభావతి తోడుగా వచ్చిన మీనాక్షి ఇన్ డైరెక్ట్ గా పంచులు వేస్తూ అత్తగారింటికి వెళ్లొద్దని చెబుతోంది. ఆ సమయంలో మీనా వదిన ఏం తప్పు చేయలేదని రవి చెప్పిన ప్రభావతి నమ్మదు. ఆ దేవుడే దిగి వచ్చి మీనా మంచిదని చెప్పిన మీ అమ్మ నమ్మదని మీనాక్షి అంటుంది. మరోవైపు ఫైనాన్సర్ ను ఎలాగైనా కలవాలని మీనా వెయిట్ చేస్తూ ఉంటుంది. అతడు బయటికి రాగానే బాలు గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ, వినకుండా ఫైనాన్సర్ వెళ్ళిపోతాడు. మరోవైపు.. బాలు పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. సరిగా అన్నం తినే సమయంలో సాంబార్లో బల్లి పడ్డ విషయాన్ని గమనిస్తాడు. దీంతో తన తండ్రి దగ్గర ఉన్న ప్లేట్లు లాక్కొని అందులో బల్లి పడిందని చెబుతాడు. తన తల్లి రాగానే సాంబార్లో బల్లి పడిందని సీరియస్ అవుతాడు. తనకేం తెలియదని అంతా మీ నాని చేసిందని తప్పును మీ నాపైకి నెట్టేస్తుంది ప్రభావతి.
బుధవారం డిసెంబర్ 4న ఎపిసోడ్ లో మీనా ఇంటికి రాగానే సాంబార్ లో ఏం వేశావని బాలు నిలదీస్తాడు. తాను జాగ్రత్తగా మూతలు పెట్టి, బయటకు వెళ్లాలని చెబుతోంది. ఇంట్లో వారందరినీ చంపాలని ప్రయత్నిస్తున్నావా? అంటూ మీనాపై ప్రభావతి మరింత రెచ్చిపోతుంది.మీనాక్షి అసలు విషయం గుర్తుకు చేసుంది. ఈ విషయం బాలుకు తెలిస్తే నన్ను చంపేస్తాడంటూ భయపడుతుంది ప్రభావతి. మరో వైపు సంజు.. శృతిపై ప్రతి కారం తీర్చుకోవాలని, శృతిపై హత్యప్రయత్నం చేద్దామని ట్రై చేస్తాడు. కానీ, రవి రావడంతో సైలెంట్ గా వెళ్లిపోతాడు. తరువాత రోజు ఉదయాన్నే మీనా త్వరగా లేచి, వంటలన్నీ పూర్తి చేసి.. బల్లి గాని, బొద్దింకలు గాని వేయలేదని, అనవసరంగా తనపై నిందలు వేయొద్దని, ప్రతి విషయానికి తానే తప్పు చేశానని నిందిస్తున్నారని మీనా అంటుంది. ఆ తర్వాత తాను గుడికి వెళుతున్నానని, తన మామయ్యకు చెప్పి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది మీనా. బాలుని కూడా మీనాకు తోడుగా గుడికి వెళ్లమని చెబుతాడు. కానీ, తనకు వేరే పని ఉందని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. నీకు కారే లేదు కదా అని ప్రశ్నిస్తాడు.

గురువారం డిసెంబర్ 5న ఎపిసోడ్ లో ఫైనాన్సియర్ ఇంటికి ఫేషియల్ చేయడానికి రోహిణి వెళ్లగా.. కారును ఇవ్వమని అడగటం కోసం మీనా వెళ్తుంది. కానీ, బాలు ప్రవర్తన తనకు నచ్చలేదని, కానీ, అందరి ముందు తనకు క్షమాపణ చెప్పితే.. కారు ఇస్తానని కండిషన్ పెడతాడు. ఈ విషయాన్ని ఎలాగైనా ఇంట్లో చెప్పి బాలుని అవమానించాలని రోహిణి ప్రయత్నిస్తోంది. తాను ఫైనాన్సర్ ఇంటికి వెళ్లానని, ఆ సమయంలో మీనా కూడా అక్కడికి వచ్చిందని, ఆ ఫైనాన్స్ తో కారు ఇవ్వమని బ్రతిమిలాడిందని, ప్రస్తుతం మీ బాలుకి ఏ ఉద్యోగం లేదని, డ్రైవర్ పని చేస్తున్నానని ప్రతి రోజు అబద్ధం చెప్తున్నాడంటూ బాలుని అవమానిస్తోంది రోహిణి. తన భార్యకు ఎవరిని మోసం చేసి బతకాల్సిన అవసరం లేదని, అవసరమైతే పస్తులు ఉంటామని మీనా దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇస్తుంది. పని చేయకుండా కూడా ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చారనీ, ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందనే, ఓ అపార్ట్మెంట్ లో కార్లు కడిగే పనికి చేరారని అసలు విషయం బయటపెడుతుంది మీనా. దీంతో ఇంట్లో వారందరూ షాక్ అవుతారు.

శుక్రవారం డిసెంబర్ 6న ఎపిసోడ్ లో ఫైనాన్షియర్ దగ్గరికి ఎందుకు వెళ్లాలని మీనాపై బాలు కోప్పడతాడు. డబ్బులు ఇచ్చిన మీ నాన్న చనిపోతే ఏం చేస్తావ్? అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలని, అందుకే వాడిని కొట్టానని అసలు విషయాన్ని బయటపడతాడు. ఆ మాటలు విన్న మీనా తానైతే వాణ్ని చెప్పుతో ఒక్కన్నే కొట్టేవాడ్నీ అంటుంది మీనా. బాలు మాటలు విన్న సత్యం బాధపడతాడు. ఎలాగైనా తన కొడుకు గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలని, ఇంటి కాగితాలను తాకట్టు పెట్టాలని భావిస్తున్నాడు. కానీ, ఇందుకు ప్రభావతి ఒప్పుకోదు. ఒక్కసారి మనసుపెట్టి ఒక తల్లిగా ఆలోచించమని ప్రభావతికి చెప్తాడు. అయితే తన నగలను కూడా విడిపించమని చెబుతుంది. దానికి సత్యం ఒప్పుకుంటాడు. బాలు టిఫిన్ చేస్తుండగా ప్రభావతి వచ్చి మిగతా వాళ్ళకి ఉందో లేదో చూసి తినమని అంటుంది. దీంతో బాలుకు కోపం వస్తుంది. ఈ సమయంలో నువ్వు ఒక్కదానివేనమ్మ ఇంట్లో పని పనిచేసే దానివి.. ఇంట్లో తిని కూర్చునేవారు ఎక్కువయ్యారని రోహిణితో అంటుంది. మనోజ్ ఉద్యోగం చేయడం లేదనే విషయం ఇన్ డైరెక్ట్ గా చెబుతోంది. దీంతో బాలుకి అనుమానం వస్తుంది.


Click it and Unblock the Notifications











