Gunde Ninda Gudi Gantalu Weekly: బాలు గౌరవాన్ని నిలబెట్టిన సత్యం.. ప్రాణాలకు తెగించి శృతిని కాపాడిన మీనా..

Gunde Ninda Gudi Gantalu Weekly: గుండె నిండా గుడి గంటలు సీరియల్ గతవారం అంటే డిసెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు ప్రసారమైన 'గుండె నిండా గుడి గంటలు'సీరియల్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో.. ఓ లుక్కేయండి మరి!

సోమవారం డిసెంబర్ 9వ తేదీన ఎపిసోడ్ లో సత్యం తన కొడుకు బాలుకి ఊహించని విధంగా తన పాత కారును గిఫ్ట్ గా ఇస్తాడు. దీంతో బాలుకి పట్టరాని సంతోషంతో ఎమోషనల్ అవుతాడు. తాను ఇంతగా ప్రేమిస్తున్నా.. తన తండ్రిని ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు. అనంతరం సత్యం.. మీనా చేతుల మీదుగా కారు తాళాలను బాలుకి ఇప్పిస్తాడు. ముందుగా గుడికి వెళ్లి రమ్మని చెప్పుతాడు. ఈ సమయంలో మీనాకు సారీ చెప్పాలని బాలు ప్రయత్నిస్తాడు. కానీ, మొహమాటంతో తన ఫ్రెండ్ రాజేష్ ను అడ్డం పెట్టుకొని మీనాకు సారీ చెబుతాడు. ఆ తర్వాత సర్ప్రైజ్ గా తాను టూర్ కు వరకు వెళ్ళినప్పుడు తీసుకువచ్చిన గాజులను మీనాకు ఇస్తాడు బాలు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story December 9th to December 13th Episodes highlights

మంగళవారం డిసెంబర్10వ ఎపిసోడ్ లో బాలు తన కారు తిరిగి వచ్చినందుకు సంతోషంలో మీనాతో కలిసి తినడానికి రెస్టారెంట్ కి వెళ్తాడు. అప్పటికే ఆ రెస్టారెంట్ లో రవి, శృతిలు ఉంటారు. రవి తన అన్నయ్య వచ్చిన విషయాన్ని గమనించి.. దగ్గరికి వెళ్లి పలకరిస్తాడు. దీంతో రవికి ఎక్కలేని ఆగ్రహం వస్తుంది. అనవసరంగా వరుసలు కలిపి దగ్గర కావాలని ప్రయత్నించవద్దంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో శృతి తన భర్త రవికి సపోర్టుగా నిలుస్తుంది. తన భర్త మీద చీటికిమాటికి చేయి వేస్తే బాగోదంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో బాలు మరింత రెచ్చిపోతాడు. కాలేజీలలో ఇలాంటివే నేర్పించారంటూ శృతిని అవమానిస్తాడు. ఇంకోసారి కలవాలని చూసిన.. మాట్లాడాలని చూసిన, చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తాడు బాలు. మరోవైపు కామాక్షి, ప్రభావతి లు సత్యమును ఎలాగైనా ఒప్పించి, రవిని ఇంటికి తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఇంతలోనే బాలు వెంటనే వారికి వార్నింగ్ ఇస్తాడు. సత్యం కూడా ఈ విషయంలో తాను ఇప్పుడే మాట్లాడాలని అంటూ వెళ్లిపోతాడు.

బుధవారం డిసెంబర్ 11న ఎపిసోడ్ లో రవి హోటల్లో జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బాధపడతాడు. శృతి వచ్చి అనవసరంగా ఇంటి గురించి ఆలోచించి, ఉన్న సంతోషాన్ని పాడు చేసుకోవద్దనీ, తాను జన్మలో మీ ఇంట్లో కాలు పెట్టాలని తెగేసి చెబుతోంది. కానీ, రవి మాత్రం తాను ఫ్యామిలీని విడిచిపెట్టి ఉండలేకపోతున్నానని, ఆ బంధాలు, బంధుత్వాలు ఉంటే అండగా ఉంటుందని శృతి నచ్చజెప్పి ప్రయత్నం చేస్తాడు. కానీ, శృతి వినిపించుకోదు. మరోసారి ఫ్యామిలీ విషయం తన ముందు ప్రస్తావించొద్దంటూ తెగేసి చెబుతోంది. మరుసటి రోజు ఉదయాన్నే రవి.. మనోజ్ కు కాల్ చేస్తాడు. కోటీశ్వరాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న లక్కీ అంటూ రవిని పొగడ్తలతో ముంచేస్తాడు. ఇంతలో శృతి రావడంతో ఆ ఫోన్ కట్ చేస్తాడు. తనని ఇంటికి రమ్మంటున్నారని చెప్పడంతో శ్రుతికి మరింత కోపం వస్తుంది. రౌడీలాగా బిహేవ్ చేస్తే ఇంట్లో కాలు పెట్టానంటూ దిగేసి చెబుతుంది. ఈ క్రమంలో రవికి శృతికి మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. దీంతో శృతి టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu last week roundup story December 9th to December 13th Episodes highlights

గురువారం డిసెంబర్ 12న ఎపిసోడ్ లో శృతి.. మీనాకు ఫోన్ చేసి రెస్టారెంట్ కు రమ్మని పిలుస్తుంది. ఈ క్రమంలో సంజు మనుషులు శృతిని ఫాలో అవుతూ రెస్టారెంట్ కు వెళ్తారు. మీనా రెస్టారెంట్ కు రాగానే.. రవి తనని బాగా చూసుకోవడం లేదని, ప్రతిసారి ఫ్యామిలీ అంటూ తనని దూరం పెడుతున్నారని మీనాకు చెబుతుంది. దీంతో మీనాకు కోపం వస్తుంది. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక అనీ, కొత్త అనుబంధాలు వస్తే.. పాత బంధాలను తెంచుకోవడం కాదని చెబుతుంది. ఇకనైనా రవిని అర్థం చేసుకోమని వెళ్ళిపోతుంది. ఇంతలో సంజు తన మనుషులతో కలిసి శృతి పై యాసిడ్ దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ విషయాన్ని గమనించిన మీనా ధైర్యంతో సంజు పై దాడి చేసి శృతిని రక్షిస్తుంది. అనంతరం ఇంటికి తీసుకెళ్ళి ధైర్యం చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu last week roundup story December 9th to December 13th Episodes highlights

శుక్రవారం డిసెంబర్ 13న ఎపిసోడ్ లో యాసిడ్ దాడితో భయపడిన శృతికి ఉమ్మడి కుటుంబం గురించి చెబుతుంది. అందరం ఉమ్మడిగా ఉంటే.. ఎలాంటి కష్టాలైనా ఎదుర్కోవచ్చునని సూచిస్తుంది. రవి గురించి కూడా ఒకసారి ఆలోచించమని చెబుతోంది. ఆ తర్వాత మీనా.. శృతి వాళ్ళ నాన్న సురేంద్ర ఇంటికి వెళ్లి జరిగిన ప్రమాదం గురించి చెబుతోంది. ఇప్పటికైనా శృతిని దగ్గర తీసుకొని, రక్షణ గా ఉండమని కోరుతుంది. మరోవైపు మీనా చేసిన సాహసం మీడియా కంటా పడడంతో ఇంటికి వచ్చి మీనా ను ఇంటర్వ్యూ చేస్తారు. ఈ సమయంలో తన ధైర్యానికి కారణం తన భర్తనే అంటూ బాలుకి క్రెడిట్ ఇస్తుంది. మీనా ధైర్యాన్ని చూసిన ప్రభావతి ఇకపై తన కోడలితో జాగ్రత్తగా ఉండాలని భయపడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X